ETV Bharat / science-and-technology

WhatsApp group video call limit : వావ్!.. వాట్సాప్​లో ఇప్పుడు ఒకేసారి 32 మందితో మాట్లాడవచ్చు!

author img

By

Published : Jun 30, 2023, 3:15 PM IST

WhatsApp Desktop Beta Begins Testing Video Calls With Up to 32 People
Whatsapp new feature

WhatsApp latest update : వాట్సాప్​ వినియోగదారులకు అదిరిపోయే న్యూస్​. త్వరలో ఒకేసారి 32 మంది గ్రూప్​ వీడియో కాల్​లో మాట్లాడేందుకు వీలుగా వాట్సాప్​ ఓ సరికొత్త ఫీచర్​ను తీసుకురానుంది. ప్రస్తుతం దీన్ని వాట్సాప్​ డెస్క్​టాప్​ బీటా వెర్షన్​లో టెస్ట్ చేస్తోంది. పూర్తి వివరాలు మీరే చూడండి.

WhatsApp group video call limit : మెటా కంపెనీ నేతృత్వంలోని వాట్సాప్​ ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లను తెస్తూ, తన వినియోగదారులను ఆకట్టుకుంటోంది. తాజాగా ఒకేసారి 32 మంది గ్రూప్​ వీడియో కాల్​ మాట్లాడేందుకు వీలుగా మరో మంచి ఫీచర్​ను అందుబాటులోకి తేవడానికి సన్నాహాలు చేస్తోంది. ప్రస్తుతం దీనిని వాట్సాప్​ డెస్క్​టాప్​ బీటా వెర్షన్​లో టెస్ట్ చేస్తోంది. త్వరలోనే ఇది అందరు యూజర్లకు అందుబాటులోకి రానుంది.

ప్రస్తుతం వాట్సాప్​లో ఒకేసారి కేవలం 8 మంది మాత్రమే గ్రూప్​ వీడియో కాల్​లో మాట్లాడేందుకు అవకాశం ఉంది. దీనిని నాలుగు రెట్లు పెంచి, ఒకేసారి 32 మంది మాట్లాడుకోవడానికి వీలును కల్పించే దిశగా మెటా కంపెనీ నేతృత్వంలోని వాట్సాప్ ప్రయత్నిస్తోంది.​

మైక్రోసాఫ్ట్​ స్టోర్​ నుంచి వాట్సాప్​ డౌన్​లోడ్​
WhatsApp for windows users : వాట్సాప్​ ఇటీవలే తన ఎలక్ట్రాన్​ బేస్డ్​ డెస్క్​టాప్​ వెర్షన్​ను పూర్తిగా ఆపేసింది. కనుక ఇకపై దానికి అప్​డేట్స్​ రావు. అందుకే దాని స్థానంలో మైక్రోసాఫ్ట్​ స్టోర్​ నుంచి సరికొత్త వాట్సాప్​ యాప్​ను డౌన్​లోడ్​ చేసుకునే విధంగా మార్పులు చేసింది. అందువల్ల విండోస్ యూజర్లు కచ్చితంగా లేటెస్ట్​ వాట్సాప్​ను నేరుగా.. మైక్రోసాఫ్ట్​ స్టోర్​ నుంచి డౌన్​లోడ్​ చేసుకోవాల్సి ఉంటుంది.

డబ్ల్యూఏబీటాఇన్ఫో లీక్స్​
WhatsApp new group video calling feature : ప్రస్తుతం ఈ నయా వీడియో కాలింగ్​ ఫీచర్​ ఉన్న వాట్సాప్​ బీటా వెర్షన్​ను.. విండోస్​ 2.2323.1.0లో పరీక్షిస్తున్నట్లు డబ్ల్యూఏబీటాఇన్ఫో తెలిపింది. ఇప్పటికే పలువురు​ బీటా యూజర్లకు ఇది అందుబాటులోకి వచ్చిందని కూడా పేర్కొంది. ఈ ఫీచర్​ ద్వారా ఒకేసారి 32 మందితో ఆడియో లేదా వీడియో కాల్​ చేసుకోవచ్చని తెలిపింది. అయితే ఇది సర్వస్​ సైడ్​ అప్​డేట్​ మాత్రమే అని, త్వరలోనే అందరు యూజర్లకు ఇది అందుబాటులోకి వస్తుందని వెల్లడించింది.

  • WhatsApp beta for Windows gets a feature to create video calls up to 32 people!

    Some beta testers may receive a message inviting them to explore the option of making large video calls within their groups, as well as to try out the screen-sharing feature.https://t.co/kxvJ6kSunw pic.twitter.com/LYobF7opld

    — WABetaInfo (@WABetaInfo) June 28, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

అప్​కమింగ్​ వాట్సాప్ ఫీచర్స్​
WhatsApp upcoming features 2023 :వాట్సాప్​ తన యూజర్లను ఆకట్టుకునేందుకు తరచుగా ఎన్నో సరికొత్త ఫీచర్లను తీసుకువస్తోంది. త్వరలో 'మెసేజ్​ పిన్​ డ్యురేషన్​ ఫీచర్'​ను తీసుకురానుంది. దీని ద్వారా వినియోగదారులు ఒక మెసేజ్​ను 24 గంటలు, 7 రోజులు, 30 రోజుల వ్యవధి పాటు పిన్​ చేసుకునే అవకాశం కలుగుతుంది. అలాగే మెసేజ్ డిస్అపీయరింగ్ మోడ్​, వ్యూ ఒన్స్​ అండ్​ మల్టీ డివైజ్​ ఫీచర్స్​ను కూడా బీటా యూజర్లకు అందుబాటులోకి తెచ్చింది. మరీ ముఖ్యంగా వాట్సాప్​ పైభాగంలో డార్క్ కలర్​ బార్​ను తీసుకురావడానికి సన్నాహాలు చేస్తోంది.

WhatsApp cyber security features : సైబర్​ నేరగాళ్ల నుంచి యూజర్లకు భద్రత కల్పించడం కోసం కూడా వాట్సాప్​ చర్యలు తీసుకుంటోంది. అందులో భాగంగా వాట్సాప్ యూజర్లు స్వయంగా స్పామ్​ కాల్స్​ను మ్యూట్​​ చేసుకునే విధంగా ఫీచర్​ను తీసుకొచ్చింది. అదే విధంగా మల్టిపుల్ అకౌంట్స్​ మధ్య సులువుగా స్విచ్​ కావడానికి వీలుగా మరో ఫీచర్​ను టెస్ట్​ చేస్తోంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.