ETV Bharat / science-and-technology

యూట్యూబ్​ చూస్తే ఎక్కువ డేటా అయిపోతుందా?.. ఇలా త‌గ్గించుకోండి..!

author img

By

Published : Jun 29, 2023, 8:29 AM IST

Youtube Data Usage : వాట్సాప్‌, ఫేస్​బుక్​, ఇన్‌స్టాగ్రామ్ లాంటి సోష‌ల్ మీడియా యాప్స్​తో పాటు దాదాపుగా అంద‌రూ ఎక్కువ‌గా వాడేది యూట్యూబ్‌. సినిమాలు, షార్ట్ వీడియోస్​, కామెడీ ప్రోగ్రామ్స్ వంటివి చాలా మంది యూట్యూబ్​లో చూస్తారు. మ‌రి అలాంటి యూట్యూబ్ చూస్తే ఎంత డేటా ఖ‌ర్చ‌వుతుందో మీరు ఎప్పుడైనా ఆలోచించారా..? లేక‌పోతే ఇది చ‌దివి తెలుసుకోండి.

Youtube Data Usage
Youtube Data Usage

Youtube Data Usage : దాదాపుగా అంద‌రి ఫోన్లో ప్రస్తుతం అన్​లిమిటెడ్ ప్లాన్ ఉంటుంది. ఇది అందుబాటులోకి వ‌చ్చిన‌ప్ప‌టి నుంచి డేటా వినియోగం విప‌రీతంగా పెరిగింది. ఒక‌ప్పుడు 1 జీబీని రెండు, మూడు రోజులు వాడే మ‌నం.. నేడు ఒక్క‌రోజుకి కూడా 1 జీబీ డేటా స‌రిపోవ‌డం లేదు. సోష‌ల్ మీడియా యాప్స్ త‌ర్వాత మ‌నం ఎక్కువ‌గా వాడేది యూట్యూబ్. మ‌రి ఆ యూట్యూబ్ ఎంత డేటాను వినియోగిస్తుంది. ఆ వినియోగాన్ని ఎలా కొల‌వాలి అనే అంశాల‌తో పాటు దాన్ని త‌గ్గించుకోవ‌డానికి కొన్ని చిట్కాలు తెలుసుకోండి.

ఇంట్లో లేదా ఆఫీసులో వైఫై ఉన్నప్పుడు యూట్యూబ్‌లో వీడియోలు చూస్తే పెద్ద‌గా ఏం అనిపించ‌దు. కానీ సొంత డేటా వాడితే మాత్రం స‌రిపోదు. ఈ స‌మ‌యంలో ఇంట‌ర్నెట్ నుంచి పెద్ద మొత్తంలో స‌మాచారం మ‌న ఫోన్​కి చేరుతుంది. ఇది ప్ర‌తి సెకన్​కు మారుతూ ఉంటుంది. కాబట్టి ఏ వీడియో స్ట్రీమింగ్ అయినా అదే స్థాయిలో డేటా ఉప‌యోగించుకుంటుంది.

యూట్యూబ్ ఎంత డేటా ఉప‌యోగించుకుంటుంది ?
Youtube Data Usage Per Hour : యూట్యూబ్ డేటా వినియోగం అనేది మీరు చూసే వీడియో క్వాలిటీ మీద ఆధార‌ప‌డి ఉంటుంది. ఏ వీడియో అయినా.. 144p నుంచి 2160p (4K) వ‌ర‌కు ఉంటుంది. ఇందులోని బిట్​రేట్​ని బ‌ట్టి క్వాలిటీ ఉంటుంది. ఉదాహ‌ర‌ణ‌కు 480p (స్టాండర్డ్​ క్వాలిటీ)కి యూట్యూబ్ బిట్​రేట్​ 2,000Kbps ఉంటుంది. ఈ లెక్క చొప్పున యావరేజ్ వినియోగం 1.25Mbps. అంటే ఏదైనా వీడియోను 480p లో వీక్షిస్తే.. నిమిషానికి 9.375MB డేటా ఖ‌ర్చ‌వుతుంది. అదే క్వాలిటీలో గంట సేపు చూస్తే 562.5MB డేటా ఖ‌ర్చ‌వుతుంది.

  • 144p: -- (No bitrate provided by YouTube.)
  • 240p: గంటకు 225MB
  • 360p: గంటకు 315MB
  • 480p: గంటకు 562.5MB
  • 720p at 30FPS: గంటకు 1237.5MB
  • 720p at 60FPS: గంటకు 1856.25MB (1.86GB)
  • 1080p at 30FPS: గంటకు 2.03GB
  • 1080p at 60FPS: గంటకు 3.04GB
  • 1440p (2K) at 30FPS: గంటకు 4.28GB
  • 1440p (2K) at 60FPS: గంటకు 6.08GB
  • 2160p (4K) at 30FPS: గంటకు 10.58GB
  • 2160p (4K) at 60FPS: గంటకు 15.98GB

ఎంత డేటా వినియోగం అవుతుందో తెలుసుకునేందుకు ఆండ్రాయిడ్ యూజ‌ర్లు సెట్టింగ్స్​ > నెట్​వర్క్​ & ఇంటర్నెట్​ > మొబైల్​ నెట్​వర్క్​కి వెళ్లి యాప్​ డేటా యూసేజ్​ని సెలెక్ట్ చేసి యూట్యూబ్​పై క్లిక్ చేస్తే వివ‌రాలు వ‌స్తాయి. ఇది కొన్ని వెర్ష‌న్ల‌లో వేరేలా ఉంటుంది. సెట్టింగ్స్​ >యాప్స్​ > యూట్యూబ్​ >మొబైల్​ డేటా & వైఫైని సెలెక్ట్ చేయాలి. ఇక ఐఫోన్ యూజ‌ర్లు సెట్టింగ్స్​> సెల్యులార్​ > యూట్యూబ్​పై క్లిక్ చేసి వివ‌రాలు తెలుసుకోవ‌చ్చు.

అధిక డేటా వాడ‌కాన్ని ఎలా త‌గ్గించాలి ?

  • మొద‌టగా హై రిజల్యూషన్ లో వీడియోలు చూడ‌టం ఆపాలి. ముఖ్యంగా మొబైల్ డేటా వాడుతున్న‌ప్పుడు.
  • రెండోదిగా వీడియో ప్రారంభంలోనే క్వాలిటీని సెలెక్ట్ చేసుకుంటే డేటా ఆదా అవుతుంది. అందులో ఆటో క్వాలిటీని ఎంచుకుంటే ప్ర‌తి వీడియోకు అదే వ‌ర్తిస్తుంది. లేదా హైయర్​ పిక్చర్​​ క్వాలిటీ లేదా డేటా సేవర్​ను సెలెక్ట్ చేసుకోవ‌చ్చు.
  • మూడోదిగా డీఫాల్ట్ వీడియో క్వాలిటీని ఎంచుకోవ‌చ్చు. దీనికోసం సెట్టింగ్స్​ లోకి వెళ్లి వీడియో క్వాలిటీ ప్రిఫరెన్సెస్​ సెలెక్ట్ చేసుకోవాలి.

వీడియోకు ముందు, మ‌ధ్య‌లో వ‌చ్చే యాడ్స్ వ‌ల్లా డేటా ఖ‌ర్చ‌వుతుంది. యాడ్స్ నుంచి బయటపడాలంటే యూట్యూడ్ ప్రీమియం తీసుకోవ‌చ్చు. దాని విలువ నెల‌కు 12 డాల‌ర్లు. ఫలితంగా అన్ని వీడియోల‌ను ఆఫ్​లైన్​లో డౌన్​లోడ్​ చేసుకుని తీరిక ఉన్న‌ప్పుడు చూసుకోవచ్చు. అలాగే ఆన్​లైన్​లో వీడియోలు చూసినా యాడ్స్ రావు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.