ETV Bharat / science-and-technology

Youtube Playable : యూట్యూబ్​ నయా ఫీచర్​​.. ఇకపై ఆన్​లైన్​ గేమర్స్​కు పండగే!

author img

By

Published : Jun 25, 2023, 1:43 PM IST

Youtube playables : యూట్యూబ్​ యూజర్లకు గుడ్​ న్యూస్​. త్వరలోనే యూట్యూబ్​లో నేరుగా ఆన్​లైన్​ గేమ్స్​ ఆడుకునే విధంగా.. గూగుల్ ఓ సరికొత్త ప్రొడక్టును తీసుకురానుంది. ఇందు కోసం ఇప్పటికే అంతర్గతంగా కంపెనీ ఉద్యోగులతో గేమింగ్​ టెస్ట్​లు కూడా చేయిస్తోంది. పూర్తి వివరాలు మీ కోసం..

Youtube new gaming feature playable
Youtube playable

YouTube playable : ఆన్​లైన్​​ గేమర్స్​కు అదిరిపోయే న్యూస్​. యూట్యూబ్​ వెబ్​సైట్​లోనే నేరుగా గేమ్స్ ఆడుకునే విధంగా ఓ సరికొత్త​ ప్రొడక్ట్​ను తీసుకురావడానికి గూగుల్​​ సన్నాహాలు చేస్తోంది. ఇప్పటికే అంతర్గతంగా ఈ ప్రొడక్టును టెస్టింగ్​ చేస్తోంది యూట్యూబ్​.

ఈ సరికొత్త యూట్యూబ్​ ప్రొడక్టును.. వెబ్​ బ్రౌజర్​, ఆండ్రాయిడ్ మొబైల్స్​​, యాపిల్​ ఐఫోన్​ యూజర్లు అందరికీ అందుబాటులోకి తేనుంది గూగుల్​. ఫలితంగా యూట్యూబ్​లోనే నేరుగా ఆన్​లైన్​ గేమ్స్​ ఆడుకునే అవకాశం ఏర్పడుతుంది.

ప్లేయబుల్​
YouTube Gaming Platform playable : వాల్​స్ట్రీట్​ జర్నల్​ ప్రకారం, గూగుల్​ ఇప్పటికే తన ఉద్యోగులకు 'ప్లేయబుల్​' పేరుతో తెచ్చిన సరికొత్త యూట్యూబ్​ ప్రొడక్టును టెస్ట్​ చేయాలని సూచించింది. ముఖ్యంగా ఆర్కేడ్​ గేమ్​ స్టాక్​ బౌన్స్​ లాంటి గేమ్​లను టెస్టింగ్​ కోసం అందుబాటులో ఉంచింది.

''గేమింగ్​ కోసం ప్రత్యేకమైన వేదిక సృష్టించాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాం. చాలా కొత్త ఫీచర్స్​ను టెస్ట్​ చేస్తున్నాం కూడా. కానీ ప్రస్తుతం ఏ విషయం కూడా అధికారికంగా ప్రకటించడానికి అవకాశం లేదు.'' అని ఓ యూట్యూబ్​ అధికార ప్రతినిధి తెలిపారు.

గేమర్స్​కు ఆన్​లైన్​ స్వర్గం
Playable for Gamers : ఆన్​లైన్​ గేమ్స్ హోస్ట్​ చేయడానికి, స్ట్రీమింగ్​ చేయడానికి, లైవ్​ స్ట్రీమ్ వీడియోలు చూడడానికి యూట్యూబ్​ మంచి వేదిక. అందుకే ఆన్​లైన్ ప్రకటనలు రోజురోజుకూ తగ్గుతున్న వేళ.. యూట్యూబ్​ ఈ సరికొత్త గేమింగ్​ ప్లాట్​ఫాంను తెచ్చేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఒక వేళ ఇదే సాకారమైతే యూట్యూబ్​ వేదికగా ఆన్​లైన్​ గేమర్స్​కు మంచి ఆదాయం సంపాందించే అవకాశం ఏర్పడుతుంది. యూట్యూబ్​కు కూడా మంచి యాడ్​ రెవెన్యూ వస్తుంది.

చాలా గేమ్స్​ ఉన్నాయి..
Playable Games : ప్రస్తుతం ఇంకా టెస్టింగ్​ దశలో ఉన్న ప్లేయబుల్​లో..​ ఆడడానికి చాలా గేమ్స్​నే అందుబాటులో ఉంచింది గూగుల్​. స్టాక్​ బౌన్స్​ అనేది ప్రత్యేకంగా యాడ్​ - సపోర్టెడ్​ ఆర్కేడ్​ గేమ్​. ఈ గేమ్​లో ప్లేయర్స్​.. బౌన్సింగ్​ బాల్​తో లేయర్లుగా ఉన్న బ్రిక్స్​ను స్మాష్​ చేయాల్సి ఉంటుంది.

యూట్యూబ్​ షాపింగ్​ ఛానల్​
YouTube Shopping Channel : యోన్​హాప్​ వార్తా సంస్థ ప్రకారం, గూగుల్​ మరో సరికొత్త ఫీచర్​ను అందుబాటులోకి తెస్తోంది. 2023 జూన్​ 30న దక్షిణ కొరియాలో అధికారికంగా యూట్యూబ్​ మొదటి అధికారిక షాపింగ్​ ఛానల్​ను ప్రారంభించనుంది.

యూట్యూబ్​ హవా
యూట్యూబ్ తనదైన శైలిలో యూజర్లను ఆకట్టుకుంటూ సోషల్​ మీడియాను ఒక ఊపు ఊపేస్తోంది. ఎలాంటి సమాచారం అయినా వీడియోల రూపంలో ఇక్కడ లభిస్తుంది. యూట్యూబ్​ కూడా ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లను తీసుకొస్తూ యూజర్లను ఆకట్టుకుంటూ ఉంటుంది. ఇటీవలే యూట్యూబ్​ తమ మోనటైజేషన్​ ప్రక్రియను కూడా సులభతరం చేసింది. దీని వల్ల యూట్యూబర్​లకు మంచి రెవెన్యూ జనరేట్ కావడానికి అవకాశం ఏర్పడింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.