ETV Bharat / science-and-technology

వాట్సాప్ యూజర్లకు గుడ్​ న్యూస్​.. గ్రూప్‌లో ఇక 1024 మంది!

author img

By

Published : Oct 11, 2022, 10:16 AM IST

Updated : Oct 11, 2022, 10:31 AM IST

సామాజిక దిగ్గజం వాట్సాప్​.. గ్రూప్స్‌ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. గ్రూపులో సభ్యుల సంఖ్యను రెండింతలు చేయనుంది. ఈ క్రమంలో త్వరలో వాట్సాప్‌ గ్రూపులో వెయ్యి మందికిపైగా సభ్యులు ఉండొచ్చు.

WhatsApp
వాట్సాప్

గ్రూప్స్‌ విషయంలో వాట్సాప్‌ కీలక నిర్ణయం తీసుకుంది. గ్రూపులో సభ్యుల సంఖ్యను రెండింతలు చేయనుంది. దీంతో త్వరలో వాట్సాప్‌ గ్రూపులో వెయ్యి మందికిపైగా సభ్యులు ఉండొచ్చు. గతంలో ఓ గ్రూపులో గరిష్ఠంగా 256 మందిని సభ్యులుగా చేర్చుకోవచ్చు. కొన్ని రోజుల క్రితం ఆ సంఖ్యను 512కు పెంచారు. త్వరలో ఆ సంఖ్యను వాట్సాప్‌ 1024కి పెంచనుంది. ఇప్పటికే కొంతమంది వాట్సాప్‌ బీటా యూజర్లకు ఈ అప్‌డేట్‌ అందుబాటులోకి వచ్చింది. త్వరలోనే సాధారణ యూజర్లకూ ఈ అప్‌డేట్‌ ఇవ్వనున్నారు.

ఈ ఫీచర్లు కూడా..

  • గ్రూప్‌ అడ్మిన్‌ల కోసం అప్రూవల్‌ సిస్టమ్‌ను తీసుకురానుంది. అంటే ఎవరైనా గ్రూపులో చేరాలి అనుకుంటే.. అడ్మిన్‌ అప్రూవ్‌ చేయాల్సి ఉంటుంది. గ్రూపులో చేరేందుకు వచ్చిన విజ్ఞాపనలన్నీ.. ఒక చోట లిస్ట్‌లా కనిపిస్తాయి. వాటిని అడ్మిన్‌ చెక్‌ చేసుకుని ఆ వ్యక్తి గ్రూపు సభ్యుడిగా వద్దు అనుకుంటే రిక్వెస్ట్‌ను రిజెక్ట్‌ చేయొచ్చు.
  • వాట్సాప్‌ కాల్‌ లింక్స్‌ ఫీచర్‌ త్వరలో అందుబాటులోకి రానుంది. దీంతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించాలనుకునే వ్యక్తి కాల్‌ లింక్‌ క్రియేట్‌ చేసి.. కాల్‌ మాట్లాడాలి అనుకునేవారికి పంపాలి. ఆ లింక్‌ను క్లిక్‌ చేసి నేరుగా ఆ వీడియో సమావేశంలో పాల్గొనొచ్చు. ఈ మొత్తం ప్రాసెస్‌ జూమ్‌, గూగుల్‌ మీట్‌ తరహాలో ఉంటుందని సమాచారం.
  • యూజర్లు వాట్సాప్‌ స్టేటస్‌లో ఆడియో మెసేజ్‌లను కూడా పెట్టుకోవచ్చు. స్టేటస్‌ బటన్‌ క్లిక్‌ చేస్తే.. వాయిస్‌ రికార్డ్‌ చేసే ఆప్షన్‌ వస్తుంది. దాని ద్వారా వాయిస్‌ స్టేటస్‌ పెట్టొచ్చు.

ఇవీ చదవండి: ఒకే స్క్రీన్​పై ప్రయాణికుడ్ని బట్టి ఫ్లైట్ వివరాలు.. ఎయిర్​పోర్ట్ కష్టాలకు ఇక చెక్!

వేలిముద్రల దొంగలతో జాగ్రత్త.. ఈ టిప్స్​ పాటిస్తే సేఫ్​!

Last Updated :Oct 11, 2022, 10:31 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.