ETV Bharat / science-and-technology

క్రోమ్‌లో ఈ 5 ఫీచర్లు మీకు తెలుసా? ఓ సారి ట్రై చేయండి

author img

By

Published : Nov 5, 2022, 9:17 AM IST

Google Chrome Features : గూగుల్‌ క్రోమ్‌.. ప్రపంవ్యాప్తంగా ఎక్కువమంది ఉపయోగించే వెబ్ బ్రౌజర్. కాలానుగుణంగా వెబ్‌ బ్రౌజింగ్‌ను సులభతరం చేస్తూ ఎన్నో ఫీచర్లు యూజర్లకు అందుబాటులోకి వచ్చాయి. వాటిలో ముఖ్యమైన ఐదు ఫీచర్ల గురించి తెలుసుకుందాం.

google chrome features 2022
google chrome features 2022

Google Chrome Features : బ్రౌజ్‌ చేయాల్సిన కంటెంట్ ఏదైనా కానీ, బ్రౌజింగ్ కోసం ఎక్కువ మంది ఉపయోగించేది మాత్రం గూగుల్ క్రోమ్‌. రోజూ వాడుతున్నా.. కొన్ని ఫీచర్ల గురించి చాలా మందికి తెలియకపోవచ్చు. ఇవి బ్రౌజింగ్‌లో యూజర్‌ సమయాన్ని ఆదా చేయడంతోపాటు, వెబ్‌ విహారాన్ని సులభతరం చేస్తాయి. ఇంతకీ, ఆ ఫీచర్లు ఏంటి? అవి ఎలా పనిచేస్తాయి? వాటితో యూజర్‌కి ఎలాంటి ఉపయోగం ఉంటుందో తెలుసుకుందాం.

క్రోమ్‌ జర్నీ చేస్తారా?
క్రోమ్‌ విహారంలో కొత్తగా ట్యాబ్ ఓపెన్ చేసి యూఆర్‌ఎల్‌ సెర్చ్‌ బార్‌పై మౌస్‌ కర్సర్‌ పెట్టగానే, అంతకముందు వెతికిన కంటెంట్‌ రిజల్ట్‌తోపాటు రెజ్యూమ్‌ యువర్‌ జర్నీ అని కనిపిస్తుంది. దీనివల్ల యూజర్‌ సులువుగా పాత సెర్చ్‌ రిజల్ట్‌ను చూడొచ్చు. ఒకవేళ మీ బ్రౌజర్‌లో ఇలా కనిపించకపోతే.. బ్రౌజర్‌లో హిస్టరీపై క్లిక్ చేస్తే టర్న్‌ ఆన్‌ జర్నీస్‌ ఆప్షన్‌ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేస్తే బ్రౌజర్‌లో రెజ్యూమ్‌ యువర్ జర్నీ ఆప్షన్‌ ఎనేబుల్ అవుతుంది. యూఆర్‌ఎల్‌లో పాత సెర్చ్‌ రిజల్ట్‌ కనిపించకూడదంటే జర్నీస్‌ ఆప్షన్‌ను టర్న్‌ ఆఫ్‌ చేస్తే సరిపోతుంది.

ఆ ఒక్క క్లిక్‌తోనే సమస్య
ముఖ్యమైన సమాచారం కోసం వెతికే సందర్భంలో ఎక్కువ ట్యాబ్‌లు ఓపెన్‌ చేస్తాం. బ్రౌజర్‌ విండోని మినిమైజ్‌ చేసే తొందరలో పొరపాటున విండో క్లోజ్‌ బటన్‌పై క్లిక్ చేస్తాం. అంతే.. సమాచార సేకరణ కోసం ఓపెన్ చేసిన ట్యాబ్‌లు ఒకేసారి క్లోజ్‌ అయ్యాయని ఆందోళన చెందుతాం. ఇలాంటి సందర్భాల్లో మీరు క్లోజ్ చేసిన ట్యాబ్స్‌ తిరిగి ఆటోమేటిగ్గా ఓపెన్ చేయొచ్చు.
ఇందుకోసం బ్రౌజర్‌ సెట్టింగ్స్‌లో ఆన్‌ స్టార్టప్‌ ఆప్షన్‌పై క్లిక్ చేస్తే ఓపెన్‌ ది న్యూ ట్యాబ్‌ పేజ్‌, కంటిన్యూ వేర్‌ యు లెఫ్ట్‌ ఆఫ్‌, ఓపెన్‌ ఏ స్పెసిఫిక్‌ పేజ్‌ ఆర్‌ సెట్‌ ఆఫ్‌ పేజెస్‌ ఆప్షన్లు కనిపిస్తాయి. వాటిలో కంటిన్యూ వేర్‌ యు లెఫ్ట్‌ ఆఫ్‌ సెలెక్ట్ చేయాలి. తర్వాత ఎప్పుడైనా మీరు పొరపాటున ట్యాబ్స్‌ ఓపెన్‌ చేసి బ్రౌజర్‌ క్లోజ్‌ చేస్తే, తిరిగి బ్రౌజర్‌ ఓపెన్‌ చేయగానే.. అంతకముందు ఓపెన్ చేసి ఉంచిన ట్యాబ్‌లు కనిపిస్తాయి.

లెన్స్‌తో సెర్చ్‌ ఎలా..?
బ్రౌజింగ్ చేస్తున్నప్పుడు కొత్త ఫొటోలు కనిపిస్తే.. వాటి వివరాలను గూగుల్ లెన్స్‌తో తెలుసుకోవచ్చు. వస్తువులు, జంతువులు, మొక్కలు.. ఇలా ఏ కేటగిరి ఫొటోలైనా గూగుల్ లెన్స్‌లో వేస్తే అది ఎక్కడ దొరుకుతుంది? దేనికి సంబంధించినది? వంటి పూర్తి వివరాలతోపాటు దానికి సంబంధించిన సమగ్ర సమాచారాన్ని స్క్రీన్‌పై చూపిస్తుంది.
వెబ్‌పేజ్‌లో ఇమేజ్‌పై రైట్‌ క్లిక్ చేస్తే సెర్చ్‌ ఇమేజ్ విత్‌ గూగుల్ లెన్స్ ఆప్షన్‌ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేస్తే గూగుల్ లెన్స్‌లో ఇమేజ్‌ను వెతికేస్తుంది. లేదంటే సెర్చ్‌ యూఆర్‌ఎల్‌లో గూగుల్ లెన్స్‌ టైప్‌ చేసి, పేజ్‌ ఓపెన్‌ కాగానే ఫొటోను డ్రాగ్‌ లేదా కాపీ-పేస్ట్ చేసి సెర్చ్‌ క్లిక్ చేసినా వివరాలు మీ ముందుంటాయి.

వెబ్‌ లింక్‌ షేర్‌ చేయడం సులువే!
బ్రౌజర్‌లో ఆన్‌లైన్ పేపర్‌ లేదా ఆసక్తికరమైన ఆర్టికల్‌ చదవుతుంటాం. ఇంతలో ముఖ్యమైన పనిచేయాల్సి వస్తుంది. అలాంటప్పుడు మీరు చదువున్న ఆర్టికల్‌ లేదా వెబ్‌ పేజ్‌ను సులువుగా మీ మెయిల్‌ లేదా సోషల్‌ మీడియా ఖాతాలో షేర్‌ చేయొచ్చు. ఇందుకోసం మీరు చదువుతున్న వెబ్‌పేజ్‌ యూఆర్‌ఎల్‌ కుడివైపు బాణం గుర్తుతో షేర్ సింబల్‌ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేస్తే మెయిల్‌, ఫేస్‌బుక్‌, ట్విటర్‌ వంటి ఇతరత్రా ఆప్షన్లు కనిపిస్తాయి.

వెబ్‌సైట్‌ షార్ట్‌కట్స్‌
రోజూ ఎన్ని వెబ్‌సైట్లు బ్రౌజ్‌ చేసినా.. తరచుగా చూసే వెబ్‌సైట్లు కొన్ని ఉంటాయి. బ్రౌజర్‌ ఓపెన్ చేయగానే.. వాటి కోసం సెర్చ్‌బార్‌లో వెతికే అవసరంలేకుండా కనిపించేలా బ్రౌజర్‌ను కస్టమైజ్‌ చేసుకోవచ్చు. ఇందుకోసం క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేస్తే కుడివైపు కింద కస్టమైజ్‌ క్రోమ్ ఆప్షన్ కనిపిస్తుంది. అందులో బ్యాక్‌గ్రౌండ్, షార్ట్‌కట్స్‌, కలర్‌ అండ్‌ థీమ్‌ ఆప్షన్లు కనిపిస్తాయి. వాటిలో బ్యాక్‌గ్రౌండ్‌ ఫీచర్‌తో బ్రౌజర్ బ్యాక్‌గ్రౌండ్ మార్చుకోవచ్చు. షార్ట్‌కట్స్‌తో మనం తరచుగా చూసే వెబ్‌సైట్ల వివరాలు కనిపిస్తాయి. కలర్‌ అండ్‌ థీమ్‌తో బ్రౌజర్‌ను నచ్చిన రంగులోకి మార్చుకోవచ్చు.

ఇవీ చదవండి : వాట్సాప్​లో యూజర్లకు గుడ్​ న్యూస్.. సెల్ఫ్​ మెసేజ్​తో సహా 5 కొత్త ఫీచర్స్​!

గూగుల్​ గుడ్​ న్యూస్​.. క్లౌడ్​ స్టోరేజీ 15GB నుంచి 1TBకి పెంపు.. కానీ వారికి మాత్రమే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.