ETV Bharat / science-and-technology

Laptop Charging Issues : మీ ల్యాప్​టాప్ ఛార్జింగ్​ పెట్టినా ఛార్జ్​​ అవ్వడం లేదా?.. ఈ టిప్స్ ట్రై చేయండి!

author img

By

Published : Aug 19, 2023, 8:36 AM IST

Laptop Charging Tips In Telugu : ఈ కాలంలో ఆఫీసు పని చేయాలంటే పీసీ లేదా ల్యాప్​టాప్ తప్పనిసరి. ముఖ్యంగా వర్క్ ఫ్రమ్ హోం చేస్తున్నవారికి వీటి అవసరం చాలా ఉంటుంది. కొన్ని సార్లు ల్యాప్​టాప్​ ఛార్జింగ్​ సమస్య.. మన పనికి చాలా ఇబ్బంది కలిగిస్తుంది. మీరు కూడా ఇలాంటి సమస్యనే ఎదుర్కొంటున్నారా? ల్యాప్​టాప్​కు ఛార్జింగ్ పెట్టినా ఛార్జ్ కావడం లేదా? అయితే ఈ టిప్స్ పాటించి చూడండి.

laptop charging tips
Laptop Charging Issues

Laptop Charging Tips In Telugu : ఈ కంప్యూటర్ యుగంలో యంత్రాల వాడకం బాగా పెరిగిపోయింది. ముఖ్యంగా కార్యాలయ పనుల్లో కంప్యూటర్లు తప్పని సరి. పీసీ, ల్యాప్​టాప్.. ఇలా రెండు రకాలుగా ఇవి దొరుకుతాయి. అయితే పీసీని ఎక్కడికి పడితే అక్కడికి తీసుకెళ్లలేం కనుక చాలా మంది ల్యాప్​టాప్​లు కొనేందుకు మొగ్గు చూపుతారు. అయితే, వీటి వాడకంలో ఎన్నో అవాంతరాలు ఎదురవుతాయి. అందులో ఛార్జింగ్ సమస్య కూడా ఒకటి. ల్యాప్​టాప్​ ఛార్జింగ్ పెట్టినా కొన్ని సార్లు ఛార్జ్​ కాదు. అలాంటప్పుడు కింద చెప్పిన ముఖ్యమైన ( Laptop Charging Tips ) టిప్స్ పాటించి చూడండి. బ్రాండ్​తో, కంపెనీతో సంబంధం లేకుండా Windows తో పాటు macOS, Linux సాఫ్ట్​వేర్లతో నడిచే అన్నింటికీ ఈ టిప్స్​ వర్తిస్తాయి. మీకే ఇలాంటి పరిస్థితి ఎదురైతే ఒకసారి ఈ టిప్స్ ట్రై చేసి చూడండి.

1. కనెక్షన్ సరి చేసుకోవడం
Laptop Battery Connector Socket : ఛార్జింగ్ పెట్టిన తర్వాత ప్లగ్​లో సాకెట్ సరిగా ఉందో లేదో చూసుకోండి. అయినా ఛార్జింగ్ కావడం లేదంటే.. వేరే ప్లగ్​లో సాకెట్ పెట్టి చూడండి. కొన్ని సార్లు ఆ సాకెట్ పనిచేయకపోయినా, పవర్ సప్లై లేకపోయినా ఛార్జింగ్ కాదు. కనుక రెండో సాకెట్​లో చెక్ చేసుకోవడం ఉత్తమం. దీనితో పాటు మీ ల్యాప్​టాప్ ఛార్జింగ్ కేబుల్ కూడా అందులో ఫిట్ అయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి.

2. బ్యాటరీ తీసి ఛార్జింగ్ పెట్టడం
Laptop Removable Battery Charging : ఒకవేళ మీ ల్యాప్​టాప్ రిమూవబుల్ బ్యాటరీ అయితే.. దాన్ని తీసేసి ఛార్జింగ్ పెట్టి చూడండి. తీసే ముందు దాన్ని షట్​డౌన్ చేయండి. బ్యాటరీ తీసిన తర్వాత ఆ ప్రాంతంలో ఏవైనా డస్ట్​ పార్టికల్స్ ఉంటే ఒక శుభ్రమైన వస్త్రంతో వాటిని తొలగించండి. అలా బ్యాటరీ తొలగించి ఛార్జింగ్​ పెట్టిన తర్వాత ఛార్జింగ్ అయితే.. బ్యాటరీ ప్రొబ్లమ్ అని గుర్తించండి. ఒక వేళ మీ ల్యాప్​టాప్​లో రిమూవల్ బ్యాటరీ ఆప్షన్ లేకుంటే.. సంబంధిత నిపుణుల్ని సంప్రదిస్తే.. సమస్య ఏమిటో చెబుతారు. మీ అంతట మీరే బ్యాటరీ తీయాలని ప్రయత్నిస్తే.. రిస్కులో పడతారు జాగ్రత్త!

3. ఒరిజినల్ ఛార్జర్​ మాత్రమే వాడటం
Laptop Original Charger Usage : ఒరిజినల్ ఛార్జర్​ పాడైన తరువాత, చాలా మంది థర్డ్​ పార్టీ ఛార్జర్లు ఉపయోగిస్తారు. ఇలా చేయడం వల్ల అది ల్యాప్​టాప్​ ఛార్జింగ్, బ్యాటరీ పనితీరుపై ప్రభావం చూపుతుంది. అవి తక్కువ వోల్టేజీతో పనిచేసే అవకాశముంది. ఛార్జింగ్ మెల్లగా అవడం, కొన్నిసార్లు కాకపోవడం లాంటివి జరుగుతాయి. వీటితో పాటు వోల్టేజీ, విద్యుత్తు సరఫరాను అనుసరించి, మనం ఛార్జింగ్ పెట్టే సాకెట్​ల పైనా దృష్టి పెట్టాలి.

4. ఛార్జింగ్ కేబుల్ చెక్ చేసుకోవడం
Laptop Charger Cable Damage : మన ఛార్జింగ్ కేబుల్ డ్యామేజ్ కావడం వల్ల కూడా ఛార్జింగ్ కాదు. కనుక ఛార్జింగ్ పెట్టే ముందు మన కేబుల్ వైర్​ను ఒకసారి చెక్ చేసుకోవడం మంచిది. మనకు తెలియకుండా ఎక్కడో చిన్నపాటి డ్యామేజ్ అయ్యే అవకాశముంది. కనుక ఒకసారి వైర్ సరి చూసుకుని ఛార్జింగ్ పెట్టాలి. దీనితో పాటు పోర్టర్​ కూడా క్లీన్​గా ఉండేలా చూసుకోవాలి. ఛార్జింగ్ పెట్టినప్పుడు కేబుల్ అందులో ఫిట్​ అయ్యిందో? లేదో? చూసుకోవాలి.

5. వనరుల వినియోగాన్ని తగ్గించడం
Laptop Heating Issue : మీరు మీ ల్యాప్​టాప్​లో ఎక్కువ పని చేస్తుంటే, అది మళ్లీ ఛార్జింగ్ కావడానికి టైం పట్టవచ్చు. సిస్టం హీట్ అయినప్పుడు దాన్ని కూల్ చేయడానికి ఫ్యాన్ తిరగాలి. దీనికి ఎక్కువ బ్యాటరీ పవర్ ఖర్చవుతుంది. ల్యాప్​టాప్​లో ఏయే ప్రోగ్రామ్స్​ రన్ అవుతున్నాయో, అవి ఎంత బ్యాటరీ పవర్​ను వినియోగించుకుంటున్నాయో తెలుసుకునేందుకు Ctrl + Shift + Esc ప్రెస్ చేసి More details పైన క్లిక్ చేసి తెలుసుకోవచ్చు. ఎక్కువ ప్రోగ్రాములుంటే కొన్ని ఆపేసి సిస్టం షట్​డౌన్ చేయడం మంచిది.

6. మానుఫ్యాక్చర్ పవర్ చెకింగ్
Laptop Manufacture Power Issue : ఇతర సాఫ్ట్​వేర్​ సమస్యలు కూడా మీ ల్యాప్​టాప్​ బ్యాటరీ ఛార్జ్​​ కాకుండా ఉండేలా చేస్తాయి. విండోస్​లోని పవర్​ ప్లాన్స్​.. మీ బ్యాటరీని ఛార్జ్ చేయకుండా నిరోధించే అవకాశముంది. ఇది తెలుసుకోవడానికి సెట్టింగ్స్​లోకి వెళ్లి System > Power & sleep and clicking Additional power settings లో చూడాలి. అక్కడ ఇతర ప్లాన్లు కూడా ఎంచుకునే అవకాశం ఉంటుంది.

7. బ్యాటరీ డ్రైవ్​లు అప్​గ్రేడ్ లేదా మార్చడం
Laptop Driver Update : బ్యాటరీ అనేది ఎక్స్​టర్నల్​ డివైజ్ కనుక Windows దానితో సరిగ్గా ఇంటర్​ఫేస్​ చేయడానికి నిర్దిష్ట డ్రైవర్లను ఉపయోగిస్తుంది. ఛార్జింగ్ కాకపోవడానికి ఇవి కూడా ఒక కారణం కావచ్చు. వీటిని అప్​గ్రేడ్ చేయడం ద్వారా లేదా మార్చడం ద్వారా ఈ సమస్యను పరిష్కరించుకోవచ్చు. దీనికోసం Win + X ప్రెస్ చేసి Device Manager సెలెక్ట్ చేసుకోవాలి. తరువాత Batteries పై క్లిక్ చేస్తే Microsoft AC Adapter, Microsoft ACPI-Compliant Control Method Battery అనే రెండు ఆప్షన్లు కనిపిస్తాయి. వాటిపై Right-click చేసి అప్​గ్రేడ్ చేయవచ్చు.

పైన పేర్కొన్న స్టెప్స్, టిప్స్​ అన్నీ ఫాలో అయిన తర్వాత మళ్లీ ఒకసారి ఛార్జింగ్ పెట్టి చూడండి. ఇవన్నీ చేసినా.. ఫలితం రాలేదంటే కొత్త ఛార్జర్ కొనుగోలు చేయండి. వీలైతే ఒరిజినల్ కంపెనీ ఛార్జర్ తీసుకోండి. ఒకవేళ అలా వీలుకాకపోతే.. ఆన్​లైన్​లో మంచి రివ్యూస్​, రేటింగ్స్​ ఉన్న థర్డ్ పార్టీ ఛార్జర్లు తీసుకునే ప్రయత్నం చేయవచ్చు.

Remove Search Results From Google : గూగుల్​ సెర్చ్​లో మీ పర్సనల్ ఇన్ఫో వస్తోందా?.. డిలీట్​ చేయండిలా..

Smartphone Security Tips : స్మార్ట్​ఫోన్​ను వాలెట్​లా వాడుతున్నారా?.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి​!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.