ETV Bharat / science-and-technology

చంద్రుడిపై యూఏఈ గురి.. జపాన్​ కంపెనీతో కలిసి కీలక ప్రయోగం

author img

By

Published : Dec 11, 2022, 5:38 PM IST

జపాన్​కు చెందిన ఓ ప్రైవేటు సంస్థతో కలిసి చంద్రుడిపైకి రోవర్​ను పంపింది యూఏఈ. ఎలాన్​ మస్క్​కు చెందిన స్పేస్​ఎక్స్​ సంస్థ రూపొందించిన రాకెట్ ద్వారా.. ఈ రోవర్​ను, ఓ రోబోను జాబిల్లిపైకి పంపుతున్నారు.

moon mission 2022
moon mission 2022

అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా ఇటీవలే చంద్రుడిపైకి అర్టెమిస్​ ప్రయోగాన్ని తలపెట్టింది. తాజాగా జపాన్​కు చెందిన ప్రైవేట్​ సంస్థ ఐస్పేస్​ మరో ప్రయోగాన్ని చేపట్టింది. ఐస్పేస్​ ల్యాండర్​ను సమకూర్చగా.. స్పేస్​ఎక్స్ రాకెట్​, యునైటైడ్ అరబ్​ ఎమిరేట్స్​ లూనార్​ రోవర్​తో దీనిని ప్రయోగించారు. ఈ ప్రయోగం పూర్తయ్యేందుకు సుమారు 5 నెలల సమయం పట్టనుంది. అమెరికా నాసా చేపట్టిన ప్రయోగం కేవలం ఐదు రోజుల్లోనే పూర్తయి.. ఒరియాన్​ చంద్రుడిపైకి చేరింది. అయితే తక్కువ ఇంధనాన్ని వినియోగిస్తూ.. డబ్బును ఆదా చేసేలా ఈ ల్యాండర్​ను తయారు చేశామని, అందుకే 5 నెలల సమయం పడుతుందని వెల్లడించారు ప్రతినిధులు. సుమారు 16 లక్షల కిలోమీటర్ల దూరం ప్రయాణించి వచ్చే ఏడాది ఏప్రిల్ నాటికి చంద్రుడిపైకి చేరుకుంటుందని చెప్పారు.

moon mission 2022
నింగిలోకి దూసుకెళ్తున్న రాకెట్

చంద్రుడికి ఈశాన్యంలో ఉన్న అట్లాస్ కార్టర్​ లక్ష్యంగా ఈ రాకెట్​ దూసుకెళ్తుందని తెలిపారు. ఇప్పటికే మార్స్​పై ప్రయోగాలు చేపట్టిన యూఏఈ.. ఇప్పుడు చంద్రుడి ప్రయోగాలకు ఆసక్తి చూపిస్తోంది. ల్యాండర్​లో రోవర్​తో పాటు జపాన్​ స్పేస్ ఏజెన్సీ ఓ బంతిలాంటి వస్తువును పంపించింది. ఇది చంద్రుడిపైకి దిగాక ఓ రోబోలాగా మారిపోనుంది. చంద్రుడిపై ఉన్న దుమ్మును సైతం తట్టుకుని తిరిగేలా దీన్ని రూపొందించారు. 2024లో రెండో ప్రయోగాన్ని, 2025లో మూడో ప్రయోగాన్ని చేపట్టనున్నట్లు ఐస్పేస్​ సంస్థ ప్రకటించింది. ఐస్పేస్​ మిషన్​ను హకుటో అని కూడా పిలుస్తారు. జపనీస్​లో హకుటో అంటే తెల్ల కుందేలు అని అర్థం. ఇది చంద్రుడిపైన ఉంటుందని వారి నమ్మకం.

moon mission 2022
నింగిలోకి దూసుకెళ్తున్న రాకెట్
moon mission 2022
నింగిలోకి దూసుకెళ్తున్న రాకెట్

మరోవైపు నాసా చేపట్టిన జాబిల్లి యాత్ర చివరి దశకు చేరింది. ఆదివారం ఒరియాన్‌ స్పేస్‌ క్యాప్సుల్‌ పసిఫిక్‌ సముద్రంలో పడనుంది. దాదాపు 50 ఏళ్ల తర్వాత చంద్రుడి సమీపానికి వెళ్లి వచ్చిన స్పేస్‌ క్యాప్సుల్‌ సముద్రంలో పడనుంది. గతంలో అపొలో 17 ప్రాజెక్టులో చివరిసారిగా సిబ్బందితో ఉన్న క్యాప్సుల్‌ భూమిని చేరుకొంది. గతం వారం ఈ స్పేస్‌ క్రాఫ్ట్‌ ఇంజిన్లు శక్తిమంతమైన కదలికలతో దిశను మార్చాయి. దీంతో ఇది చంద్రుడి వైపు నుంచి భూమి వైపు కదలడం మొదలైంది. గంటకు 40,000 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించనుంది. ఇది శబ్దవేగం కంటే 32 రెట్లు అధికం. ఇది భూ వాతావరణంలోకి ప్రవేశించిన తర్వాత టాప్‌ స్పీడ్‌ను అందుకుంటుంది.

ఇవీ చదవండి: వంట నూనెతో ఆకాశంలో ఎగిరే విమానం.. సరికొత్త చరిత్ర

మహా స్పేస్ఎక్స్.. రోదసి ప్రయోగాల్లో నవశకం.. భారత్​లోనూ ప్రోత్సహిస్తే..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.