ETV Bharat / science-and-technology

సెకనులో 57వేల సినిమాలు డౌన్‌లోడ్‌!

author img

By

Published : Jul 28, 2021, 12:12 PM IST

ఇంటర్నెట్​లో ఒక సినిమా డౌన్​లోడ్​ చేయాలంటే.. మొబైల్ డేటా ద్వారా కొన్ని నిమిషాలు పడుతుంది. హై స్పీడ్ వైఫై ద్వారా అయితే.. నిమిషం లోపే డౌన్​లోడ్​ చేయొచ్చు. కానీ కేవలం ఒక సెకనులో 57 వేల సినిమాలు డౌన్​లోడ్​ చేయొచ్చని తెలుసా? అవును జపాన్​ పరిశోధకులు దీనిని సాధ్యం చేశారు. ఆ విశేషాలు ఇలా ఉన్నాయి.

Internet speed record
జపాన్​ ఇంటర్నెట్ స్పీడ్ రికార్డ్​

మీరు ఒక సెకన్​లో 57వేల సినిమాలను డౌన్‌లోడ్‌ చేసుకోగలరా? కేవలం 3 సెకన్లలోనే స్పోటిఫై లైబ్రరీ మొత్తాన్ని డౌన్‌లోడ్‌ చేసుకోగలరా? అదెలా సాధ్యం? అంత ఇంటర్నెట్‌ స్పీడ్‌ అసాధ్యం? అంతా ఇలాగే అనుకుంటుండొచ్చు. కానీ జపాన్‌కు చెందిన నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇన్ఫర్మేషన్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ టెక్నాలజీ పరిశోధకుల కృషి గురించి తెలిస్తే 'ఓస్‌ ఇంతేనా?' అని అనటం తథ్యం.

అవును.. డిజిటల్‌ ట్రాక్‌లో ఏకంగా ఉసెయిన్‌ బోల్ట్‌నే సృష్టించారు మరి. సెకన్​కు 319 టెరాబైట్ల సమాచారాన్ని పంపించి, ఇంటర్నెట్‌ స్పీడ్‌లో అత్యంత వేగం రికార్డును సాధించారు. అత్యంత అధునాతనమైన నాసా వ్యవస్థ సెకన్​కు 400 గిగాబైట్ల వేగంతోనే నడుస్తోంది. మనదేశంలో మొబైల్‌ ఇంటర్నెట్‌ సగటు వేగం 17.84 ఎంబీపీఎస్‌. వీటితో పోల్చి చూస్తే జపాన్‌ పరిశోధకులు సాధించిన ఇంటర్నెట్‌ వేగం అనూహ్యమనే అనుకోవచ్చు. ఇంత వేగంతో సెకండులో 57వేల పూర్తి నిడివి సినిమాలను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. మరింత ఆసక్తికరమైన విషయం ఏంటంటే- ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఆప్టికల్‌ ఫైబర్‌ సదుపాయాలతోనే దీన్ని సుసాధ్యం చేయటం. అంటే కొద్దిపాటి ఖర్చుతోనే ఇప్పుడున్న ఫైబర్‌ ఆప్టిక్‌ సదుపాయాలతో దీన్ని సమ్మిళితం చేయొచ్చన్నమాట.

ఇదీ చదవండి:గురు గ్రహ చందమామపై నీటి ఆవిరి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.