ETV Bharat / science-and-technology

IPhone 15 Offers : యాపిల్​ లవర్స్​కు గుడ్​న్యూస్​.. రూ.31 వేలకే ఐఫోన్​ 15.. ఎలా పొందాలో తెలుసా!

author img

By ETV Bharat Telugu Team

Published : Sep 23, 2023, 3:56 PM IST

Updated : Sep 23, 2023, 5:08 PM IST

IPhone 15 Offers : కేవలం రూ.31 వేలకే ఐఫోన్​15ను సొంతం చేసుకోవచ్చనే విషయం మీకు తెలుసా! ప్రస్తుతం మార్కెట్​లో బెస్ట్ ఆఫర్స్, డిస్కౌంట్స్​, ఎక్స్ఛేంజ్​ బెనిఫిట్స్ లభిస్తున్నాయి. వీటిని ఉపయోగించి, మీ బడ్జెట్లో సరికొత్త ఐఫోన్​ 15ను సొంతం చేసుకోవచ్చు. అది ఎలానో ఇప్పుడు తెలుసుకుందాం.

how-to-get-iphone-15-for-under-rs-31-000-iphone-15-exchange-offers
ఐఫోన్ 15 ఎక్స్ఛేంజ్ ఆఫర్

IPhone 15 Offers : ఐఫోన్​ 15 సేల్​ శుక్రవారం ఘనంగా ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో భారీ సంఖ్యలో ఐఫోన్​15 మోడల్​ ఫోన్లు అమ్ముడుపోతున్నాయి. ఈ ఫోన్​ ప్రారంభ ధర రూ.79,900లుగా ఉంది. గరిష్ఠంగా రూ.1,99,900 ధర వద్ద ఐఫోన్​ 15 ప్రో మ్యాక్స్​ లభిస్తుంది. అయితే ఈ ఐఫోన్​ 15ని కేవలం రూ.31 వేలలోపే సొంతం చేసుకోవచ్చు. అది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం.

ఇండియా ఐస్టోర్​ వెబ్​సైట్​ ప్రకారం.. ఐఫోన్​ 15 (128 జీబీ వేరియంట్​) ధర 79,900లుగా ఉంది. హెచ్​​డీఎఫ్​సీ డెబిట్​,క్రెడిట్​ కార్డ్​లపై రూ.5,000 వరకు ఇన్​స్టాంట్​​ క్యాష్​బ్యాక్​ లభిస్తుంది. దీంతో దీని ధర రూ.74,900 దిగివస్తుంది. అయితే మంచి కండిషన్​లో ఉన్న ఐఫోన్ 12 ( 64 జీబీ) మొబైల్​ను ఎక్స్ఛేంజ్​ చేస్తే.. కేవలం​ రూ.48,900కే ఐఫోన్ 15 లభిస్తుంది.

ఒకవేళ ఐఫోన్​ 13ను కనుక మీరు ఎక్స్ఛేంజ్ చేసినట్లయితే మరింత తక్కువగా ఐఫోన్​ 15ను సొంతం చేసుకోవచ్చు. దీని ద్వారా రూ.35,000 లోపే ఐఫోన్ 15 కొనవచ్చు. మరీ ముఖ్యంగా మంచి కండిషన్​లో ఉన్న ఫోన్ అయితే.. అదనంగా మరో రూ.6000 వరకు ఎక్స్ఛేంజ్​ బోనస్​ లభిస్తాయి. దీనితో రూ.31వేలకే ఐఫోన్​ 15 మీ సొంతం అవుతుంది.

జోరుగా ఐఫోన్​ అమ్మకాలు..
Iphone 15 Series Record Sales :
యాపిల్ కంపెనీ ఐఫోన్‌ 15 సిరీస్‌ను సెప్టెంబరు 12న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసింది. ఈ ఫోన్​ అమ్మకాలను భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా సెప్టెంబర్​ 22న(శుక్రవారం) ప్రారంభించడం జరిగింది. కాగా, సేల్స్​ ప్రారంభించిన మొదటి రోజే ఐఫోన్​ 14 సిరీస్​ విక్రయాల రికార్డులను.. ఐఫోన్ 15 అధిగమించింది. అమ్మకాలు ప్రారంభించిన మొదటి రోజు నుంచే భారీ సేల్స్​ జరిగాయి. ఐఫోన్​ 15, ఐఫోన్​ 15 ప్లస్​ మోడళ్లకు తొలి రోజే మంచి డిమాండ్​ ఏర్పడిందని ఇండస్ట్రీ వర్గాలు తెలిపాయి.

ఐఫోన్​ 15 ధరలు..
ప్రస్తుతం ఐఫోన్​ 15 సిరీస్​ ఫోన్లు బ్లూ, బ్లాక్, గ్రీన్​, ఎల్లో, పింక్​ కలర్ ఆప్షన్స్​లో లభిస్తున్నాయి. 128 జీబీ, 256 జీబీ, 512 జీబీ స్టోరేజీ కెపాసిటీతో వచ్చిన ఐఫోన్​ 15 ధరలు.. రూ.79,900, రూ.89,90, రూ.1,09,900గా ఉన్నాయి.

ఐఫోన్​ 15 ప్రో రేట్స్​..
ఐఫోన్​ ప్రో సిరీస్​ ఫోన్లు.. బ్లూ టైటానియం, బ్లాక్​ టైటానియం, వైట్​ టైటానియం, నేచురల్ టైటానియం కలర్స్​లో వస్తున్నాయి. 128జీబీ, 256జీబీ, 512జీబీ, 1టీబీ స్టోరేజీ కెపాసిటీలో అందుబాటులో ఉన్న ఐఫోన్​ 15 ప్రో సిరీస్​ మోడల్​ ఫోన్​లు రూ.1,34,900ల ప్రారంభ ధర నుంచి అందుబాటులో ఉన్నాయి. 1టీబీ స్టోరేజీ కెపాసిటీతో ఉండే ఐఫోన్​ 15 ప్రో మ్యాక్స్​ ధర భారత్​లో రూ.1.99 లక్షలుగా ఉంది.

Last Updated :Sep 23, 2023, 5:08 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.