ETV Bharat / science-and-technology

Iphone 15 Launch : టెక్​ లవర్స్​కు గుడ్​ న్యూస్.. సరికొత్త ఐఫోన్​ 15, యాపిల్ వాచ్​ లాంఛ్​.. ఫీచర్లు ఇవే..

author img

By ETV Bharat Telugu Team

Published : Sep 13, 2023, 8:11 AM IST

Updated : Sep 13, 2023, 10:21 AM IST

Iphone 15 Launch : యాపిల్​ సంస్థ ఐఫోన్​ 15 సిరీస్​ ఫోన్లను లాంఛ్ చేసింది. అలాగే సరికొత్త యాపిల్ వాచ్​లను కూడా ఆవిష్కరించింది. మరి ఈ మోడల్స్ ధర ఎంతో? ఫీచర్లు ఏమిటో తెలుసుకుందామా?

iphone 15 series launch
iphone 15 series launch

IPhone 15 Launch : ప్రపంచవ్యాప్తంగా ఉన్న టెక్​ ప్రియులు ఎంతో ఆసక్తిగా చూసిన యాపిల్‌ మెగా ఈవెంట్‌ పూర్తయింది. కాలిఫోర్నియాలోని యాపిల్‌ హెడ్​క్వార్టర్స్​లో ‘వండర్‌ లస్ట్‌’ పేరుతో అత్యంత అట్టహాసంగా జరిగిన కార్యక్రమంలో ఐఫోన్‌ 15 సిరీస్‌ ఫోన్లను యాపిల్‌ కంపెనీ విడుదల చేసింది. వీటితో పాటు యాపిల్‌ వాచ్‌ సిరీస్‌ 9, వాచ్‌ అల్ట్రా 2 లను కూడా విడుదల చేసింది. ఈ సారి ఐఫోన్​ 15లో టైప్‌-సీ ఛార్జింగ్‌ పోర్టును అమర్చడం విశేషం. ఇక వాచ్‌ల విషయానికి వస్తే బ్యాటరీ లైఫ్‌ ఎక్కువగా ఉండేలా వాటిని రూపొందించారు. అయితే ఈ మెగా ఈవెంట్‌లో ఎయిర్‌పాడ్​లను మాత్రం యాపిల్‌ కంపెనీ విడుదల చేయలేదు. బహుశా ఈ ఏడాది చివరలో విడుదల చేసే అవకాశం ఉందని టెక్ నిపుణులు భావిస్తున్నారు. ఇప్పుడు యాపిల్‌ కంపెనీ విడుదల చేసిన సరికొత్త ఐఫోన్లు, వాచ్​ల్లో ఉన్న బెస్ట్​ ఫీచర్లు గురించి తెలుసుకుందాం.

ఐఫోన్‌ 15, ఐఫోన్‌ 15 ప్లస్‌ ఫీచర్స్‌
IPhone 15 Features : ఐఫోన్‌ 14 మోడల్‌లో ఉన్నట్లే ఐఫోన్‌ 15లోనూ 6.1 అంగుళాల స్క్రీన్​, ఐఫోన్‌ 15 ప్లస్‌లో 6.7 అంగుళాల స్క్రీన్​ను అమర్చారు. ముఖ్యంగా వీటిలో ఓఎల్‌ఈడీ సూపర్‌ రెటీనా డిస్‌ప్లే ఇస్తున్నారు. గులాబీ, పసుపు, ఆకుపచ్చ, నీలం, నలుపు రంగు వేరియంట్లలో ఈ ఐఫోన్లు అందుబాటులో ఉంటాయి. డైనమిక్‌ ఐలాండ్‌తో కూడిన కొత్త నాచ్‌ డిస్‌ప్లే, వెనక వైపు 2X టెలిఫొటో సామర్థం ఉన్న 48 మెగాపిక్సల్‌ కెమెరా ఇచ్చారు. 24mm, 28mm, 38mm లెన్స్‌లను కూడా ఉన్నాయి. వీటితో యూజర్లు హైరిజల్యూషన్‌ ఫొటోస్‌, వీడియోలను తీసుకోవచ్చు. తక్కువ కాంతిలో కూడా ఫొటోలు తీసుకునే విధంగా ఈ కెమెరాను రూపొందించడం విశేషం. ఏ16 బయోనిక్‌ చిప్‌ సహా ఆండ్రాయిడ్‌ ఫోన్లలో ఉండే యూఎస్‌బీ-సీ ఛార్జింగ్ పోర్ట్‌ను కూడా ఈ సారి కొత్తగా ఇచ్చారు.

ఐఫోన్​ 15 ధరలు
IPhone 15 Price :

  • ఐఫోన్‌ 15 ధరను భారత్‌లో రూ.79,900 గా నిర్ణయించారు.
  • ఐఫోన్‌ 15 ప్లస్‌ ధర రూ.89,899 గా ఉంది.

ఐఫోన్‌ 15 ప్రో, 15 ప్రో మ్యాక్స్‌ ఫీచర్స్​
IPhone 15 Pro Features : ఐఫోన్‌ 15 ప్రోలో 6.1 అంగుళాల స్క్రీన్​, ఐఫోన్‌ 15 ప్రో మ్యాక్స్‌లో 6.7 అంగుళాల స్క్రీన్​ ఇచ్చారు. ఐఫోన్‌ 15 ప్రో, ఐఫోన్‌ 15 ప్రో మాక్స్‌ మోడళ్లు టైటానియం వైట్‌, నేచురల్‌ టైటానియం, టైటానియం బ్లూ, టైటానియం బ్లాక్‌ అనే నాలుగు వెరియంట్లలో లభిస్తాయి. ఈ ఫోన్స్ వెనక వైపు 48 మెగాపిక్సల్‌ కెమెరా.. అలాగే 3 ఫోకల్‌ లెంగ్త్‌ కెమెరాను కూడా అమర్చారు. ఐఫోన్‌ 15 ప్రోలో 3X ఆప్టికల్‌ జూమ్‌, 15ప్రో మ్యాక్స్‌లో 5X టెలిఫోటో లెన్స్‌ను అమర్చారు.

ఐఫోన్‌ 15 ప్రో, 15 ప్రో మ్యాక్స్‌ ధరలు
IPhone 15 Pro Price :

  • 128 జీబీ స్టోరేజ్‌తో కూడిన ఐఫోన్ 15 ప్రో ధరను భారత్‌లో రూ.1,34,900గా నిర్ణయించారు.
  • 256 జీబీ స్టోరేజ్‌తో కూడి ఐఫోన్​ 15 ప్రో మాక్స్‌ ధరను రూ.1,59,900గా నిర్ణయించారు.

యాపిల్​ వాచ్‌ సిరీస్‌ 9 ఫీచర్స్‌
Apple Watch Series 9 Features : యాపిల్​ వాచ్‌ సిరీస్‌ 9ను ఈసారి వినూత్నంగా తీసుకొచ్చారు. ముఖ్యంగా వాచ్​ బ్యాండ్​లను జంతు చర్మాలతో చేసిన​ మెటీరియల్​ వాడకుండా, లెధర్​ ఫీలింగ్ వచ్చేలా డిజైన్​ చేశారు. పర్యావరణహితం కోసమే ఈ విధంగా చేసినట్లు యాపిల్ సంస్థ పేర్కొంది. యాపిల్ వాచ్​ సిరిస్​ 9లో కొత్తగా S9 చిప్‌ను అమర్చారు. ఇది సెకెండ్‌ జనరేషన్‌ అల్ట్రా వైడ్‌బ్యాండ్‌ చిప్‌. గతంలోని వాటితో పోలిస్తే ఇది 30 శాతం వేగంగా పనిచేస్తుంది. అలాగే చాలా కచ్చితంగా హెల్త్‌ను ట్రాక్‌ చేస్తుంది. ఈ యాపిల్ వాచ్​లను.. యాపిల్‌ డివైజ్‌లతో సులువుగా కనెక్ట్‌ చేసుకోవచ్చు. అలాగే ఫోన్​ లోకేషన్‌ను మెరుగ్గా ట్రేస్‌ చేయవచ్చు. ఈ వాచ్‌ల్లో డబుల్‌ ట్యాప్‌ ఫీచర్‌ కూడా అందుబాటులోకి తెచ్చారు.

యాపిల్​ వాచ్‌ సిరీస్‌ 9 ధర :
Apple Watch Series 9 Price : యాపిల్​ సిరీస్‌ 9 వాచ్​ ధర భారత్‌లో రూ.41,900గా ఉంది.

వాచ్‌ అల్ట్రా 2 ఫీచర్స్
Apple Watch Ultra 2 Features : యాపిల్‌ వాచ్‌ అల్ట్రా 2ను ఫాస్ట్​ ఛార్జింగ్ సపోర్ట్​తో తీసుకువచ్చారు. అలాగే దీని బ్యాటరీ లైఫ్​ కూడా అత్యధికంగా అంటే.. 36 గంటల పాటు ఉంటుంది. 3000 నిట్స్‌ బ్రైట్‌నెస్‌, ఫ్లాష్‌లైట్‌ బూస్ట్‌, న్యూ గెశ్చర్స్‌, యాక్షన్‌ బటన్‌, ఐఫోన్‌ ట్రేస్‌ చేయడం లాంటి బెస్ట్ ఫీచర్లు ఇందులో ఉన్నాయి. డబుల్‌ ట్యాప్‌ ఫీచర్‌, సూర్యకాంతిలోనూ స్పష్టంగా కనిపించేవిధంగా డిస్‌ప్లే అమర్చారు.

వాచ్‌ అల్ట్రా 2 ధర :
Apple Watch Ultra 2 Price : భారత్​లో యాపిల్ వాట్ ఆల్ట్రా 2 ధర సుమారుగా రూ.66,250 (799 డాలర్లు)గా ఉంది.

Last Updated :Sep 13, 2023, 10:21 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.