ETV Bharat / science-and-technology

IPhone Discount Sale : ఐఫోన్​ లవర్స్​కు గుడ్​న్యూస్​.. ఐఫోన్​ 14, ఐఫోన్​ 13లపై అదిరిపోయే డిస్కౌంట్స్​​!

IPhone Discount Sale : ఐఫోన్​ లవర్స్​కు గుడ్​న్యూస్​. మరికొద్ది గంటల్లో ఐఫోన్​ 15 ఇండియాలో లాంఛ్​ కానుంది. ఈ నేపథ్యంలో యాపిల్​ కంపెనీ.. ఐఫోన్​ 14, ఐఫోన్​ 13లపై భారీ డిస్కౌంట్స్​ను ప్రకటించింది. ఆ వివరాలు మీ కోసం.

author img

By ETV Bharat Telugu Team

Published : Sep 12, 2023, 5:04 PM IST

Updated : Sep 12, 2023, 7:00 PM IST

Big Discounts Offers On iphone 13 And 14 Mobiles In Flipkart
Discounts On iPhones

IPhone Discount Sale : ఐఫోన్​ లవర్స్​కు శుభవార్త వినిపించింది యాపిల్​ సంస్థ. సరికొత్త ఐఫోన్​ 15ను లాంఛ్​ చేయనున్న నేపథ్యంలో..​ ఐఫోన్​ 14, ఐఫోన్ 13లపై బంపర్​ ఆఫర్స్​ ప్రకటించింది​.

ఐఫోన్​ 14 డిస్కౌంట్​ డీల్స్​!
IPhone Discounts India :

  • ఐఫోన్​ 14 అసలు ధర- రూ.79,900/-
  • ఫ్లిప్​కార్ట్​లో ఆఫర్​ ధర- రూ.66,999/- (రూ.12,901 వరకు స్పెషల్​ డిస్కౌంట్​)
  • హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్​ క్రెడిట్​ కార్డ్​పై అదనంగా రూ.4,000/- డిస్కౌంట్​ను అందిస్తున్నారు. దీనితో ఐఫోన్​ 14 కేవలం రూ.62,999/-లకే లభించనుంది.
  • మొత్తంగా ఐఫోన్​ 14పై రూ.16,901 వరకు ఆఫర్​ లభిస్తుంది.

ఐఫోన్​ 13 డిస్కౌంట్​ డీల్స్​!
Offers On IPhone :

  • ఐఫోన్​ 13 అసలు ధర- రూ.69,900/-
  • ఫ్లిప్​కార్ట్​లో ప్రారంభ ధర- రూ.56,999/- (రూ.12,901 వరకు స్పెషల్​ డిస్కౌంట్​)
  • హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్ క్రెడిట్​ కార్డు ఉన్న కస్టమర్స్​కు రూ.2,000/- వరకు డిస్కౌంట్​ ఇస్తున్నారు.
  • దీనితో రూ.54,999/-లకే ఐఫోన్​ 13ను కొనుగోలు చేయవచ్చు.

ఐఫోన్​ 13, ఐఫోన్​ 14 ఫీచర్స్​
IPhone Features : రెండేళ్ల క్రితం వచ్చిన 5జీ మోడల్​ ఐఫోన్​ 13లోని ఫీచర్స్​నే ఐఫోన్​ 14లోనూ గమనించవచ్చు. కెమెరా, బ్యాటరీ లైఫ్​, డిస్​ప్లే, చిప్​సెట్​ ఇలా దాదాపు రెండింటిలో సమానమైన ఫీచర్స్​ను ఆస్వాదించవచ్చు. వాస్తవానికి ఐఫోన్​ 11​ మోడల్​లోనూ ఇదే డిజైన్​​ ఉంటుంది. తక్కువ​ ధరలో ఐఫోన్​ సొంతం చేసుకోవాలని ఆశించేవారు ఐఫోన్​ 13, ఐఫోన్​ 14లను ఈ డిస్కౌంట్​ డీల్స్​లో భాగంగా కొనుగోలు చేసుకోవచ్చు.

మరికొద్ది గంటల్లో ఐఫోన్​ 15 లాంఛ్​!
IPhone 15 Launch Date : సెప్టెంబర్​ 12 (మంగళవారం) భారత కాలమానం ప్రకారం రాత్రి 10.30 గంటలకు కాలిఫోర్నియాలోని యాపిల్ కంపెనీ హెడ్​క్వార్టర్స్​లో ఐఫోన్​ 15ను లాంఛ్​ చేయనున్నారు. దీనితో పాటు యాపిల్​ వాచెస్​, ఎయిర్​పాడ్స్​ను కూడా ఆవిష్కరించనున్నారు. ఇందుకోసం రూపొందించిన సరికొత్త iOS 17, iPadOS 17, WatchOS 10లతో పాటు త్వరలో రానున్న సాఫ్ట్​వేర్​ అప్​డేట్ల గురించి ఈ కార్యక్రమంలో తెలియజేయనుంది యాపిల్.

ఐఫోన్​ 15 ఫీచర్స్ ఇవేనా?
IPhone 15 Price : టెక్​ నిపుణుల అంచనా ప్రకారం.. ఐఫోన్​ 15లో మిగతా మోడల్స్​తో పోలిస్తే గణనీయమైన మార్పులు తీసుకువస్తున్నారు. ముఖ్యంగా కెమెరా, బ్యాటరీ, చిప్​సెట్​, డిజైన్​ సహా అన్నింటిలోనూ సరికొత్త మార్పులు ఈ నయా మోడల్​లో చూడవచ్చు. అయితే వీటి ప్రారంభ ధరలు రూ.80,000 లేదా అంత కంటే ఎక్కువ ఉండవచ్చు.

Last Updated : Sep 12, 2023, 7:00 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.