ETV Bharat / science-and-technology

మీ స్మార్ట్​ ఫోన్​ లైఫ్​ టైమ్​ పెంచుకోవాలా? అయితే ఈ టిప్స్​​ మీ కోసమే!

author img

By

Published : Mar 12, 2023, 6:32 PM IST

మనం రోజు వారి జీవితంలో ఎక్కువగా సమయం గడిపేది స్మార్ట్​ ఫోన్​తోనే.. ఇందులో ఎటువంటి సందేహం లేదు. ప్రస్తుత కాలంలో ఛాటింగ్​, షాపింగ్​ చేయడమే కాకుండా అన్నింటికీ దానిపైనే ఆధారడుతున్నాం. ఫోన్​ అనేది మన నిత్య జీవితంలో భాగమైపోయింది. అయితే ఇటువంటి ఫోన్​ పనితీరులో ఏ చిన్న సమస్య వచ్చినా సరే అది మనల్ని తీవ్ర నిరాశకు గురిచేస్తుంది. మనం ఫోన్​ను వినియోగించే తీరునుబట్టి.. దాని పనితీరు ఆధారపడి ఉంటుంది అని అందరికీ తెలుసు. కానీ, మనం తెలియక చేసే చిన్న చిన్న తప్పులే ఫోన్​లో చాలా సమస్యలు తెచ్చిపెడుతుంటాయి. అయితే ఈ సింపుల్​ టిప్స్​ మీ స్మార్ట్ ఫోన్​ లైఫ్​ను మరింత పెంచుకునేందుకు ఎంతగానో సహాయపడతాయి. ఒక్కసారి అవేంటో తెలుసుకుందామా..!

how to increase smartphone life
how to increase smartphone life

ప్రస్తుత కాలంలో స్మార్ట్​ ఫోన్​ ప్రతి ఒక్కరి జీవితంలో భాగమైంది. చేతిలో ఫోన్​ లేనిదే రోజు గడవని పరిస్థితి నెలకొంది. మిలీనియం జనరేషన్​గా పిలుచుకునే నేటితరం యువతకు అయితే పొద్దున్న లేచింది మొదలు.. నిద్రపోయే వరకు చేతిలో ఫోన్​ ఉండాల్సిందే. ఎంతలా అంటే ఇంటా బయట ఎక్కడ ఉన్నాసరే.. 'నా ఫోనే నా ప్రపంచం' అనుకునేంతలా సమాజం మార్పు చెందింది. అయితే ఫోన్​ వల్ల వచ్చే లాభానష్టాల గురించి పక్కన పెడితే.. దాన్ని పాడవకుండా చూసుకోవడం పెద్ద టాస్క్​ అని చెప్పవచ్చు. చాలా మంది తెలియక చేసే తప్పుల కారణంగా ఎంతో ఇష్టంగా కొనుక్కున్న స్మార్ట్ ​ఫోన్​ జీవిత కాలాన్ని చేజేతులా పాడుచేసుకుంటారు. అయితే ఈ సింపుల్​ టిప్స్​ పాటిస్తే మీ స్మార్ట్​ ఫోన్​ లైఫ్​ టైమ్​ను పెంచుకోవచ్చు. మరి వాటిపై ఓ లుక్కేద్దామా..!

మంచి రక్షణ ఉత్పత్తులను ఎంచుకోవడం..
సాధారణంగా ఎంత ఖరీదైన స్మార్ట్​ ఫోన్​ అయినా సరే.. దాని టచ్​స్క్రీన్​​లు చాలా సున్నితంగా ఉంటాయి. వీటికి ఏ చిన్న వస్తువు తగిలినా సరే గీతలు పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కొన్ని సార్లు తక్కువ ఎత్తుల నుంచి కిందపడినా సరే.. డిస్​ప్లే పూర్తిగా ధ్వంసం అవుతుంది. కొన్నిసార్లు టచ్​ పనిచేయక పోవడం కూడా జరుగుతుంది. అందరికీ ఎక్కువగా ఎదురయ్యే ఈ సమస్యను అధిగమించాలంటే.. కొత్త ఫోన్ కొన్నాం అనే తొందర్లో ఏదో ఒక​ టెంపర్డ్​ గ్లాస్​ను కాకుండా నాణ్యమైన, డబుల్​ లేయర్​లు కలిగి ఉన్న గొరిల్లా గ్లాస్ ప్రొటెక్టర్​లను ఎంచుకోవాలి. అలాంటివి వినియోగించినప్పుడే.. ఫోన్ కిందపడినా సరే పైన ఉన్న టెంపర్డ్ గ్లాస్ పాడవుతుందే కానీ.. డిస్​ప్లేకు ఏం కాదు. ఇది తక్కువ ఖర్చుతో కూడుకున్నది కూడా.

దీంతో పాటుగా మొబైల్​ కిందపడినప్పుడు స్క్రీన్​తో పాటుగా డ్యామేజ్ అయ్యే మరో పార్ట్​.. ఫోన్​ వెనుక భాగం. బ్యాక్​ పార్ట్​ పగిలినప్పుడు చాలా సార్లు లోపల భాగాలు కూడా పాడయ్యే ప్రమాదం ఉంటుంది. అందుకే దీన్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. దీన్ని సురక్షితంగా కాపాడుకోవడానికి చుట్టూ కప్పి ఉంచే మొబైల్​ కేస్​(బ్యాక్ పౌచ్)లను ఎంచుకోవాలి. ప్రస్తుతం కొంచెం డబ్బులు పెడితే చాలు మనకి నచ్చిన కేస్​లు, పౌచ్​లు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి.

ఆ సమయంలో అసలు ఛార్జ్ వద్దే వద్దు..
చాలా మందికి పగలంతా ఫోన్ చేతిలో ఉన్నందున.. ఛార్జింగ్ పెట్టే అవకాశమే ఉండదు. దీంతో వారు రాత్రి నిద్రపోయే ముందు ఫోన్​కు ఛార్జింగ్ పెడుతుంటారు. ఇలా చేయడం వల్ల సమయం కలిసి వచ్చినా సరే.. ఫోన్​పై మాత్రం తీవ్ర ప్రభావం పడుతుంది. ప్రస్తుతం మార్కెట్​లో ఉన్న ఫోన్​లు దాదాపు గంట నుంచి రెండు గంటలు ఛార్జ్​ చేస్తే చాలు​ బ్యాటరీ ఫుల్ అవుతాయి. దీనికోసం రాత్రంతా ఫోన్​కు ఛార్జింగ్ పెట్టాల్సిన అవసరం లేదు. అలా బ్యాటరీని ఓవర్​ ఛార్జింగ్​ చేస్తే దాని పనితీరు క్షీణిస్తుంది. ఫలితంగా బ్యాటరీ ఉబ్బెత్తుగా తయారై.. త్వరగా పాడవుతుంది. వీలున్నంత వరకూ రాత్రంతా ఛార్జింగ్ పెట్టకుండా.. ఖాళీ సమయాల్లో బ్యాటరీని ఫుల్ చేసుకోవడం మంచిది.

ఎప్పటికప్పుడు OS అప్​డేట్​ చేస్తున్నారా..!
ఫోన్​ పనితీరు మెరుగుపడడం.. బగ్స్​ను తొలగించడం, కొత్త ఫీచర్​లను జోడించడంలో ఆపరేటింగ్​ సిస్టమ్​ కీలక పాత్ర పోషిస్తుంది. ఫోన్​ ఓఎస్​ని అప్​డేట్​ చేయడం వల్ల కొత్త దానిలా తయారవుతుంది. దీంతో చాలా మంది ఫోన్​లో తరచూ అప్​డేట్​లు చేస్తూ ఉంటారు. అయితే ఇది ఏ మాత్రం మంచిది కాదు. ఓఎస్​ అనేది కొత్త మోడళ్లకు అనుగుణంగా ఉంటుంది. వాటిని దృష్టిలో పెట్టుకునే సంస్థలు వాటిని తయారు చేస్తాయి. దాదాపు మూడేళ్ల కాలం దాటిన ఫోన్​ల్లో ఓఎస్​ను అప్​డేట్​ చేయకపోవడం మంచిది. దీని వలన మన ఫోన్​కు కలిగే లాభం కంటే నష్టమే ఎక్కువ. ఎలా అంటే పాత ఫోన్​ సామర్థ్యాలు దాని హార్డ్​వేర్​పై ఆధారపడి ఉంటాయి. ప్రస్తుతం కొత్తగా వస్తున్న ఓఎస్​లకు ఈ హార్డ్​వేర్​లు సపోర్ట్​ చేయవు.. కావున ఫోన్​ పనితీరు మెరుగుపడుతుందని అప్​డేట్​ చేయకపోవడమే మంచిది.

ఫోన్​ పోర్ట్​లను క్లీన్​గా ఉంచుతున్నారా..!
మనం వెళ్లిన ప్రతి చోటికి ఫోన్​ను తీసుకువెళ్తుంటాం. అది పార్టీ అయినా, దూర ప్రయాణమైనా మరేదైనా సరే ఫోన్ మన చేతిలో ఉండాల్సిందే. అలాంటప్పుడు ఫోన్​ ఛార్జింగ్ పోర్ట్​, ఆడియో ఫోర్ట్​లలో దుమ్ము, ధూళి చేరుతుంది. ఇది ఛార్జింగ్​, ఆడియో కనెక్షన్​లలో రకరకాల సమస్యలను తెచ్చిపెడుతుంది. ఈ సమస్యలను రాకుండా ఉంటాలంటే.. దాదాపు నెలలో రెండు మూడుసార్లు అయినా సరే ఆ పోర్ట్​లను క్లీన్​ చేస్తూ ఉండాలి. అయితే వాటిని శుభ్రం చేసేటప్పుడు లిక్విడ్​లను ఉపయోగించకుండా ఉండాలి. వాటిని యూజ్​​ చేస్తే లోపల భాగాలు దెబ్బతినే ప్రమాదం ఉంది.

ఆఫ్​​ చేయడం మర్చిపోవద్దు మిత్రమా..!
మనిషికైనా, యంత్రానికైనా సరే నిరంతరాయంగా పనిచేస్తే కాస్త విరామం అవసరం. అయితే మనం సంవత్సరంలో 365 రోజులూ వినియోగించే ఫోన్​ కూడా ఓ యంత్రమేగా! దానికీ రెస్ట్ ఉండాలిగా..! మనకు అరచేతిలో ప్రపంచాన్ని చూపించే ఫోన్​కు కూడా కాస్త విరామ సమయం అన్నది అవసరమే. అందుకే ఎప్పటికప్పుడు ఫోన్​ను స్విచ్ఛాఫ్​​ చేస్తూ ఉండాలి. అలా చేసినప్పుడు దాని పనితీరు మెరుగుపడి.. ఎక్కువ కాలం పనిచేస్తుంది. మనకు ఫోన్​తో అవసరం లేదనుకున్న కాస్త సమయమైనా దాన్ని స్విచ్ఛాఫ్​​ చేయడం మంచిది. సాధారణంగా మనం స్నానం, భోజనం, వ్యాయామం లాంటివి చేస్తున్నప్పుడు ఫోన్​ను ఎక్కువగా వినియోగం కదా! అలాంటప్పుడు ఫోన్​ను ఆఫ్​ చేయడం ద్వారా.. ఫోన్​ లైఫ్​ టైమ్​ను మెరుగుపరచుకోవచ్చు.

యాంటీ వైరస్​ సాఫ్ట్​వేర్​లు ఉండాల్సిందే..!
ప్రస్తుతం కాలంలో కొందరు సైబర్​ నేరగాళ్లు స్మార్ట్​ ఫోన్​లను లక్ష్యంగా చేసుకుని రకరకాల మోసాలకు పాల్పడుతున్నారు. దీనికోసం నేరగాళ్లు స్పైవేర్​, ర్యాన్స్​మ్​వేర్​​, యాడ్​వేర్​ల ద్వారా రకరకాల మాల్వేర్​లను ఫోన్​లలోకి పంపించి.. డేటాని చోరీ చేసి డబ్బులు దోచేస్తున్నారు. అయితే ఈ సైబర్ మోసాల బారిన పడకుండా ఉండాలంటే.. అప్రమత్తంగా ఉండడమే కాకుండా ఫోన్​లో యాంటీవైరస్ సాఫ్ట్​వేర్​లు కూడా ఉండాలి. అలాంటప్పుడే వారి బారిన పడకుండా ఉండడానికి వీలవుతుంది. దీంతోపాటుగా ఫోన్​కు స్ట్రాంగ్ పాస్​వర్డ్​లతో పాటుగా ఫింగర్​ప్రింట్​ లాక్​ కూడా పెట్టుకోవడం మంచిది. వీలున్నంత వరకూ ఫోన్​లో సున్నితమైన సమాచారాన్ని నిల్వ చేసుకోకుండా ఉండాలి.

స్టోరేజ్​ క్లియర్​ చేస్తున్నారా..!
మనం రోజు తీసుకునే ఫొటోలు, వీడియోలతో పాటుగా నచ్చిన యాప్​లను ఫోన్​లో స్టోర్​ చేస్తూనే ఉంటాం. ఇలా క్రమంగా స్టోర్​ చేస్తూ ఉంటే.. ఫోన్ పనితీరుపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఫోన్​లు యాప్స్ లోడ్​ కావడానికి ఎక్కువ సమయం పట్టడమే కాకుండా.. వేడెక్కే అవకాశం కూడా ఉంటుంది. అయితే ఫోన్​లో మనకు అవసరం లేని ఫైల్స్​తో పాటుగా ఫొటోలు, వీడియోలు, యాప్స్​లను ఎప్పటికప్పుడు డిలీట్ చేస్తూ ఉండాలి. దీంతో పాటుగా యాప్ స్టోరేజ్​, క్యాచెస్​ను కూడా క్లియర్ చేస్తూ ఉండాలి. ఫోన్​లో ఎంత ఎక్కువ స్పేస్​ ఉంటే అంత బాగా పనిచేస్తుంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.