ETV Bharat / science-and-technology

ఇయర్​బడ్స్ పోగొట్టుకున్నారా? సింపుల్​గా​ కనిపెట్టేయండిలా!

author img

By ETV Bharat Telugu Team

Published : Nov 24, 2023, 3:24 PM IST

How To Find Your Lost Earbuds In Telugu : మీరు ఇయర్​బడ్స్ పోగొట్టుకున్నారా? ఎంత వెతికినా దొరకడం లేదా? అయితే ఇది మీ కోసమే. మీ ఇయర్​బడ్స్.. ఫోన్​తో​ కనెక్ట్ చేసి ఉండనప్పటికీ వాటిని సింపుల్​గా ట్రాక్ చేయవచ్చు. మరి అదెలాగో ఇప్పుడు తెలుసుకుందామా?

How To Track Lost Samsung Galaxy Earbuds
How to find your lost earbuds

How To Find Your Lost Earbuds : నేటి యువతీ, యువకులు ఎక్కువగా ట్రూ-వైర్​లెస్​ ఇయర్​బడ్స్ ఉపయోగించడానికి ఎక్కువగా ఇష్టపడుతున్నారు. ఎందుకంటే, ఈ ఇయర్​బడ్స్ చూడడానికి మంచి ప్రొఫెషనల్​ లుక్​తో ఉంటాయి. పైగా మంచి సౌండ్​ క్వాలిటీ కూడా కలిగి ఉంటాయి. అయితే వైర్స్​ లేకపోవడం వల్ల ఈ​ ఇయర్​బడ్స్​ను పోగొట్టుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందుకే ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు శాంసంగ్​, యాపిల్ కంపెనీలు.. వాటిలో సరికొత్త సాఫ్ట్​వేర్​లను అమర్చాయి. వీటి ఆధారంగా పోయిన మన ఇయర్​బడ్స్​ లొకేషన్​ను చాలా సులువుగా ట్రాక్ చేసుకోవచ్చు. మరీ ముఖ్యంగా మీ ఇయర్​బడ్స్ ఫోన్​తో కనెక్ట్​ అయ్యి ఉండనప్పటికీ వాటిని కనిపెట్టవచ్చు. వీటితో పాటు ఇతర సాధారణ ఇయర్​బడ్స్​ను కూడా సులువుగా ట్రాక్ చేయవచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం.

పోగొట్టుకున్న శాంసంగ్ ఇయర్​బడ్స్​ను ట్రాక్ చేయండిలా!
How To Track Lost Samsung Galaxy Earbuds : శాంసంగ్ తమ యూజర్ల కోసం Galaxy Wearables అప్లికేషన్​ను SmartThings Findతో అనుసంధానం చేసింది. కనుక దీనిని ఉపయోగించి మీ ఇయర్​బడ్స్​ను చాలా సులువుగా ట్రాక్ చేయవచ్చు. అయితే ఇక్కడ రెండు కండిషన్లు ఉన్నాయి. అవి ఏమిటంటే.. మీ ఇయర్​బడ్స్​లో కొంత మేరకైనా బ్యాటరీ లైఫ్ ఉండాలి. అలాగే ఇటీవలే మీ ఫోన్​కు వాటిని అనుసంధానం చేసి ఉండాలి. అప్పుడే మీరు గెలాక్సీ వేరియబుల్స్ అప్లికేషన్ ఉపయోగించి, వాటిని ట్రాక్ చేయగలరు. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం.

  • ముందుగా మీరు Galaxy Wearables యాప్​ను ఓపెన్ చేయాలి.
  • Find My Earbuds ను ట్యాప్​ చేసి, Start బటన్​ను నొక్కాలి.
  • వెంటనే మీ ఇయర్​బడ్స్​ నుంచి బీపింగ్ సౌండ్ వినిపిస్తుంది.
  • ఈ బీప్ శబ్దం ఆధారంగా మీ ఇయర్​బడ్స్​ను ఉన్న లొకేషన్​ను సులువుగా ట్రాక్ చేసుకోవచ్చు.
  • మీరు కనుక సరికొత్త శాంసంగ్​ ఇయర్​బడ్స్ కొని ఉంటే.. అవి కచ్చితంగా SmartThingsతో అనుసంధానం అయ్యుంటాయి.
  • కనుక మీరు SmartThings Find App యాప్​లోకి వెళ్లి Find My Earbuds ఆప్షన్​ను ట్యాప్​ చేయాలి.
  • వెంటనే మీకు, గూగుల్​ మ్యాప్స్​లో.. ఇయర్​బడ్స్​ లాస్ట్ రికార్డెడ్​ లొకేషన్​ కనిపిస్తుంది.
  • ఒక వేళ మీరు లొకేషన్​కు వెళ్లినప్పటికీ అది కనిపించకపోతే.. యాప్​లోనే Ring ఆప్షన్​ను క్లిక్ చేయాలి.
  • వెంటనే మీకు ఇయర్​బడ్స్ నుంచి బీప్ సౌండ్​ వినిపిస్తుంది.
  • ఒకవేళ మీరు నడుచుకుంటూ వెళ్తుంటే.. గూగుల్ మ్యాప్స్​లోని Navigate బటన్​ను నొక్కాలి.
  • అప్పుడు ఇయర్​బడ్స్ ఉన్న​ డైరెక్షన్​ను, రూట్​ను అది చూపిస్తుంది.
  • ఈ విధంగా పోగొట్టుకున్న శాంసంగ్ ఇయర్​బడ్స్​ను చాలా సులువుగా ట్రాక్ చేసుకోవచ్చు.

మరోసారి పోగొట్టుకోకుండా ఉండాలంటే?

  • మీరు శాంసంగ్ ఇయర్​బడ్స్ పోగొట్టుకోకుండా ఉండాలంటే.. ముందుగా SmartThingsFind యాప్​ను ఓపెన్ చేయాలి.
  • Devices డ్రాప్​డౌన్​ మెనూలో.. మీ ఇయర్​బడ్స్​ మోడల్​ను సెలెక్ట్ చేసుకోవాలి. తరువాత..
  • Find Device ఆప్షన్​ను ఎంచుకొని.. Notify When Left behindను ఎనేబుల్ చేసుకోవాలి. అంతే సింపుల్!
  • ఇకపై మీరు ఎప్పుడైనా ఇయర్​బడ్స్ మరిచిపోయి.. దూరంగా వెళ్లిపోతే, వెంటనే మీకు అలర్ట్ వస్తుంది.

యాపిల్​ ఎయిర్​పాడ్స్​ను ట్రాక్ చేసే విధానం
How To Track Your Lost Apple AirPods : యాపిల్​ కంపెనీ తమ యూజర్ల కోసం Find My అప్లికేషన్​ను రూపొందించింది. దీనిని ఉపయోగించి పోగొట్టుకున్న యాపిల్ ఎయిర్​పాడ్స్​ను సులువుగా ట్రాక్ చేసుకోవచ్చు. ముఖ్యంగా ఈ యాపిల్ Find My అప్లికేషన్​లో ఒక యూనిక్ ఫీచర్ ఉంది. దీని ద్వారా మీ ఎయిర్​పాడ్స్​ నుంచి వచ్చే బ్లూటూత్ సిగ్నల్స్​ను ట్రాక్ చేసి, అవి ఉన్న లొకేషన్​ను సులువుగా తెలుసుకోవచ్చు. ప్రస్తుతం మరే ఇతర కంపెనీల యాప్​ల్లోనూ ఈ స్పెషల్​ ఫీచర్ అందుబాటులో లేదు. ఇప్పుడు మనం యాపిల్ ఎయిర్​పాడ్స్​ను ఎలా ట్రాక్​ చేయాలో తెలుసుకుందాం.

  • ముందుగా మీరు Find My Appను ఓపెన్ చేయండి.
  • Devices సెక్షన్​లోకి వెళ్లి మీ ఎయిర్​పాడ్స్ మోడల్​ను ఎంచుకోండి.
  • మీరు పోగొట్టున్న ఎడమ/కుడి ఎయిర్​పాడ్స్​ను ఎంచుకోండి.
  • వెంటనే మీకు యాపిల్​ మ్యాప్స్​లో.. సదరు ఎయిర్​పాడ్ పనిచేసిన చివరి లొకేషన్ కనిపిస్తుంది.
  • మీరు సదరు ప్రాంతానికి వెళ్లి, Play Sound ట్యాబ్​ను నొక్కండి.
  • వెంటనే మీకు ఎయిర్​పాడ్స్ నుంచి సౌండ్ వినిపిస్తుంది.
  • ఈ విధంగా మీరు సులువుగా పోగొట్టుకున్న మీ ఎయిర్​పాడ్స్​ను గుర్తించవచ్చు.
  • ఒకవేళ మీరు దూరంగా ఉంటే.. Get Direction ఆప్షన్​ను ఎంచుకోండి.
  • వెంటనే యాపిల్ మాప్స్​.. సదరు ఎయిర్​పాడ్స్ ఉన్న లొకేషన్ వాకింగ్​​ డైరెక్షన్​ను మీకు చూపిస్తుంది.
  • ఈ విధంగా మీరు ఎయిర్​పాడ్స్​ను చాలా సులువుగా ట్రాక్ చేసుకోవచ్చు.
  • ఒక వేళ అప్పటికీ మీ ఎయిర్​పాడ్స్ దొరకకపోతే.. వెంటనే మీరు Mark as Lost ఆప్షన్​ను యాక్టివేట్​ చేసుకోండి.
  • తరువాత మీ కాంటాక్ట్ డీటైల్స్​ను అందులో ఎంటర్​ చేయండి.
  • అప్పుడు ఎవరికైనా మీ ఇయర్​బడ్స్​ దొరికితే.. వాళ్లు మీకు సదరు ఇయర్​బడ్స్​ను ఇచ్చేందుకు అవకాశం ఏర్పడుతుంది.

సాధారణ ఇయర్​బడ్స్​ లేదా హెడ్​ఫోన్స్ ట్రాక్​ చేయడం ఎలా?
How To Track Lost earbuds Or Headphones : మీరు గనుక ఆండ్రాయిడ్ ఫోన్లకు సంబంధించిన ఇయర్​బడ్స్ వాడుతుంటే.. గూగుల్​కు సంబంధించిన Find My Device సిస్టమ్​ను ఉపయోగించవచ్చు. అది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం.

  • ముందుగా మీరు ఫోన్​లో గూగుల్​కు చెందిన Find My Device యాప్​ను ఇన్​స్టాల్ చేసుకోండి.
  • ఈ యాప్​లోకి వెళ్లి, Device సెక్షన్​లో మీ ఇయర్​బడ్స్​ మోడల్​ను సెలెక్ట్ చేసుకోండి.
  • వెంటనే సదరు ఇయర్​బడ్స్ ఉపయోగించిన, లాస్ట్ రికార్డెడ్ లొకేషన్ మీకు కనిపిస్తుంది.
  • ఈ విధంగా మీరు గూగుల్ మ్యాప్స్ ఉపయోగించి సదరు ఇయర్​బడ్స్ ఉన్న లొకేషన్​ను ట్రాక్ చేసుకోవచ్చు.

నిద్రపోతున్నప్పుడు స్మార్ట్ వాచ్ ధరించడం డేంజరా?

విద్యార్థులకు ఉపయోగపడే టాప్​-12 ల్యాప్​టాప్స్ ఇవే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.