ETV Bharat / science-and-technology

పీడీఎఫ్​ను ఇలా ఎడిట్​ చేయొచ్చని తెలుసా?

author img

By

Published : Jul 27, 2021, 11:21 AM IST

పీడీఎఫ్​ను వర్డ్​ ఫార్మాట్​లోకి మార్చకుండా ఎడిట్​ చేయడం ఎలా సాధ్యం అని అనుకుంటున్నారా? ఆ టిప్​ ఈ కింది కథనంలో చూసేయండి.

How to edit a PDF in Microsoft Word
పీడీఎఫ్​ ఫైల్​ ఎడిట్​ చేయోచ్చని ఇది చూశాకే తెలిసింది!

మీరు పనిచేసే కొన్ని సందర్భాల్లో మెయిల్స్​ ద్వారా పీడీఎఫ్, వర్డ్​​ ఫైల్స్​ వస్తుంటాయి. సాధారణంగా వర్డ్​ లేదా నోట్స్​ రూపంలో ఉన్న డాక్యుమెంట్స్​ను మాత్రమే మీరు ఎడిట్​ చేయడానికి వీలుంటుంది. కానీ పీడీఎఫ్​ను ఎడిట్​ చేయలేరు. పోనీ.. ఏదైనా టూల్​తో మీరు ఎడిట్​ చేయాలని చూసినా, దానికి చాలా తతంగం ఉంటుంది. ఏదిఏమైనా రోజులు మారాయి.. ఇది 2021. ప్రపంచంలో చాలా మారాయి. ఆ విధంగా మైక్రోసాఫ్ట్​ వర్డ్​లోనే పీడీఎఫ్ ఫైల్​ను​ ఎడిట్​ చేసేందుకు ఓ మార్గం ఉంది. అదెలాగో తెలుసా?

పీడీఎఫ్​ను ఎడిట్​ చేసేందుకు విండోస్​ 11 ఆపరేటింగ్​ సిస్టమ్​తో 2021లో విడుదల చేసిన ఉత్తమ ల్యాప్​టాప్​ వినియోగించాల్సి ఉంటుంది. అయితే ఈ ప్రక్రియ మైక్రోసాఫ్ట్​ 365, వర్డ్​ 2019, వర్డ్​ 2016 టూల్స్​లోనూ పనిచేస్తోంది. దీన్ని వర్డ్​ 2007లో ప్రయత్నించినా.. అందులో ఆశించిన ఫలితం రాలేదు.

మైక్రోసాఫ్ట్​ వర్డ్​లో పీడీఎఫ్​ ఫైల్​ను​ ఎలా ఎడిట్​ చేయాలంటే..

  1. మైక్రోసాఫ్ట్​ వర్డ్​లో గో టూ ఫైల్​లోకి వెళ్లి ఓపెన్​పై క్లిక్​ చేయాలి.
  2. మీరు ఎడిట్​ చేయాలనుకున్న పీడీఎఫ్​ ఫైల్​ను ఎంచుకోండి.
  3. ఆ వెంటనే మీరు ఎంచుకున్న పీడీఎఫ్​ను వర్డ్​ ఫార్మాట్​లోకి మార్చాలా? అని వర్డ్​ టూల్​ అడుగుతుంది. దానికి మీరు ఓకే ఆప్షన్​పై క్లిక్​ చేయాలి. ఒకవేళ మీరు దానిపై క్లిక్​ చేసినా.. ఒరిజినల్​ పీడీఎఫ్​లో ఎలాంటి మార్పుండదు.

మీరు ఒకసారి పీడీఎఫ్​ను ఎడిట్​ చేసే క్రమంలో అది డాక్యుమెంట్​గా మారుతుంది. ఆ ఫైల్​ను సేవ్​ చేసే సమయంలో 'SAVE AS'​ అనే ఎంపికను ఎంచుకుంటే సరిపోతుంది.

వర్డ్​ డాక్యుమెంట్​ను పీడీఎఫ్​లోకి మార్చుకోవాలంటే.. గో టూ ఫైల్​లోకి వెళ్లి SAVE AS​ ఎంచుకొని, టైప్​ బాక్స్​లో టైటిల్​ కింద భాగంలో పీడీఎఫ్​ను ఎంచుకుంటే సరి. మీ ఫైల్​ పీడీఎఫ్​ రూపంలో భద్రంగా ఉంటుంది.

సలహా: పీడీఎఫ్​ను వర్డ్​లో ఎడిట్​ చేసేందుకు ముందుగా.. మీ కంప్యూటర్​ ఫార్మాట్​ను సరిచూసుకోండి. మీరు వాడే మైక్రోసాఫ్ట్​ వర్డ్​ సరికొత్త వర్షన్​ కాకపోతే దాన్ని అప్​డేట్​ చేయండి.

ఇదీ చూడండి.. భారీ కెమెరాతో మోటోరోలా నయా స్మార్ట్​​ఫోన్లు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.