ETV Bharat / science-and-technology

Google Storage Cleanup : ఫ్రీగా గూగుల్ స్టోరేజ్​ వాడుకోవాలా?.. మీ జీ-మెయిల్​, గూగుల్​ డ్రైవ్​లను ఇలా క్లీన్ చేసుకోండి!

author img

By ETV Bharat Telugu Team

Published : Aug 27, 2023, 7:45 PM IST

How to Clean Up Your Google Drive and Gmail to Save Space and Money
Google Storage Cleanup

Google Storage Cleanup Process In Telugu : మీ గూగుల్​ డ్రైవ్​, జీ-మెయిల్​, గూగుల్ ఫొటోస్ స్టోరేజ్ ఫుల్​ అయిపోయిందా? ప్రీమియం సబ్​స్క్రిప్షన్​ తీసుకోవడం మీకు ఆర్థికంగా ఇబ్బందిగా ఉంటుందా? అయితే ఇది మీ కోసమే. కొన్ని సింపుల్​ టిప్స్ పాటించడం ద్వారా మీరు గూగుల్ స్టోరేజ్​ను ఉచితంగా వాడుకోవచ్చు. అదెలానో ఇప్పుడు చూద్దాం.

Google Storage Cleanup : నేటి కాలంలో ప్రతి ఒక్కరికీ గూగుల్ అకౌంట్​ ఉండడం కామన్​. అయితే గూగుల్ ఒక్కో యూజర్​కు కేవలం 15జీబీ స్టోరేజ్​ను మాత్రమే ఉచితంగా అందిస్తుంది. అంతకంటే ఎక్కువ స్టోరేజ్ కావాలంటే కచ్చితంగా డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. అందుకే మీ గూగుల్ అకౌంట్​తో లింక్​ అయ్యున్న గూగుల్ డ్రైవ్​, జీ మెయిల్​, గూగుల్ ఫొటోల నుంచి ఎప్పటికప్పుడు జంక్ ఫైల్స్​ను, అవసరంలేని ఫైల్స్​ను డిలీట్ చేస్తూ ఉండాలి. అప్పుడే మీరు ఫ్రీగా గూగుల్ స్టోరేజ్​ను ఉపయోగించుకోవడానికి వీలవుతుంది.

ఒక వేళ మీరు అధికంగా స్టోరేజ్ కావాలనుకుంటే.. నెలకు రూ.130 చొప్పున చెల్లించి గూగుల్ వన్​ సబ్​స్క్రిప్షన్​ తీసుకోవాల్సి ఉంటుంది. లేదా ఏడాదికి రూ.1560 చెల్లించి సబ్​స్క్రైబ్​ చేసుకోవాల్సి ఉంటుంది. కానీ ఇది సాధారణ వ్యక్తులకు కాస్త భారమే. అందుకే గూగుల్ డ్రైవ్, జీ-మెయిల్​, గూగుల్​ ఫొటోలను ఎప్పటికప్పుడు క్లీన్​ చేసుకొని, ఫ్రీగా ఎలా వాడుకోవచ్చో ఇప్పుడు చూద్దాం.

డెస్క్​టాప్​లో గూగుల్​ డ్రైవ్​లోని ఫైల్స్​ను సైజ్ ఆధారంగా ఎలా డిలీట్​ చేయాలి?
How To Delete Files By Size In Google Drive On Your Desktop :

  1. మొదట గూగుల్ డ్రైవ్​ అకౌంట్​లోకి లాగిన్​ అవ్వాలి.
  2. లాగిన్ అయిన తరవాత, స్క్రీన్​కు ఎడమ వైపున ఉన్న మెనులోని స్టోరేజ్​ ఆప్షన్​పై క్లిక్ చేయాలి.​
  3. స్టోరేజ్​లోని మీ ఫైల్​లను పెద్ద సైజ్​ నుంచి చిన్న సైజ్​కు వచ్చే విధంగా మార్చుకోవాలి.
  4. మీకు అవసరం లేని పెద్ద సైజు ఫైల్​లను డిలీట్ చేసుకోవాలి.
  5. మెనూకు ఎడమ వైపున ఉన్న ట్రాష్​ను క్లిక్ చేయాలి. ఫైల్​లను ట్రాష్​ బిన్​ను నుంచి కూడా క్లియర్ చేయాలి.
  6. స్క్రీన్​కు కుడి పైభాగంలోని ఎమ్​టీ ట్రాష్​ను క్లిక్ చేయాలి.
  7. అక్కడ కూడా డీలిట్ చేసిన ఫైల్​లను పూర్తిగా తొలగించాలి.

ఫోన్​లో గూగుల్​ డ్రైవ్ యాప్​లోని​ ఫైల్స్​ ఎలా డిలీట్​ చేయాలి?
How To Delete Files By Size In Google Drive App :

  1. మొదట గూగుల్ డ్రైవ్​ యాప్​ను ఓపెన్ చేసి, లాగిన్ అవ్వాలి.
  2. కింది భాగంలో రైట్​ కార్నర్​లో ఉండే ఫైల్​ను క్లిక్ చేయాలి
  3. స్క్రీన్​ పై భాగంలోని మై డ్రైవ్ ఆప్షన్​ను క్లిక్ చేయాలి.
  4. పక్కనే ఉన్న ఆప్షన్​లో స్టోరెజ్​ యూజ్డ్​పై క్లిక్ చేయాలి. దీని వల్ల ఫైల్​లు పెద్దలో సైజ్​లో ఉన్నవి పైకి ,చిన్న సైజ్​లోకి ఉన్నవి కిందికి మారతాయి.
  5. స్క్రీన్​లో ఉన్న త్రీ డాట్స్ పైన క్లిక్ చేయాలి.
  6. రిమూవ్ ఆప్షన్​ను క్లిక్ చేయాలి.
  7. స్క్రీన్​​కు ఎడమ పై భాగంలో సెర్చ్​ డ్రైవ్​ పక్కన ఉన్న హామ్​బర్గర్​ ఆప్షన్​పై ​క్లిక్ చేయాలి.
  8. ట్రాష్ ఆప్షన్​ను క్లిక్ చేయాలి.
  9. త్రీ డాట్స్ ఉన్న దానిపై క్లిక్ చేయాలి.
  10. ఎమ్​టీ ట్రాష్ ఆప్షన్​ను క్లిక్ చేయాలి. అంతే.. అవసరం లేని ఫైల్స్ అన్నీ డిలీట్ అయిపోతాయి.

డెస్క్​టాప్​లో ​జీ-మెయిల్ ఫైల్స్​ను​ సైజ్ ఆధారంగా ఎలా డిలీట్ చేయాలి?
How To Delete Files By Size In Gmail On The Desktop :

  1. మొదట జీమెయిల్​లో లాగిన్​ కావాలి.
  2. సెర్చ్ బార్​లో has:attachment larger:10MB అని టైప్ చేయాలి.
  3. దీని వల్ల మీ జీమెయిల్​లో 10MB కంటే పెద్దగా ఉన్న ఫైల్​లు పైకి, చిన్నగా ఉన్నవి కిందికి మారతాయి.
  4. మీకు అవసరం లేని ప్రతి ఈ-మెయిల్​కు ఎడమ వైపున ఉన్న, బాక్స్​లో ట్రాష్​ ఐకాన్​ను క్లిక్ ​ చేయండి.
  5. ట్రాష్​లోని ఎమ్​టీ ట్రాష్​ నౌ ఆప్షన్​ను క్లిక్ చేయండి.

మొబైల్​ యాప్​లో జీ-మెయిల్ ఫైల్స్​ను సైజ్ ఆధారంగా ఎలా డిలీట్ చేయాలి?
How To Delete Files By Size In Gmail App :

  1. మొదట జీమెయిల్ యాప్​ను ఓపెన్ చేసి లాగిన్ అవ్వాలి.
  2. సెర్చ్ బార్​లో has:attachment larger:10MB అని టైప్ చేయాలి. దీని వల్ల మీ జీమెయిల్​లో 10MB కంటే పెద్దగా ఉన్న ఫైల్​లు పైకి, చిన్నగా ఉన్నవి కిందికి మారతాయి.
  3. మీకు అవసరం లేని ఈ-మెయిల్​లను డిలీట్ చేయాలి.
  4. తరువాత ట్రాష్​ బిన్​పై క్లిక్ చేయాలి.
  5. ట్రాష్​లోని ఎమ్​టీ ట్రాష్​ నౌ ఆప్షన్​ను క్లిక్ చేయాలి.
  6. ఒకసారి ఫైల్ ట్రాష్​కి చేరిన తరవాత, 30 రోజులలో అది ఆటోమేటిక్​గా తొలగిపోతుంది.

మీ జీమెయిల్​ స్పామ్​ ఫోల్డర్​ను ఎలా క్లీన్​ చేయాలి!
How to Empty Gmail Spam Folder : చాలా మంది స్పామ్​ మెసేజ్​లను డిలీట్ చేయడం మర్చిపోతుంటారు. వాస్తవానికి స్పామ్ ఫోల్డర్​ మీ ఈ-మెయిల్​ అకౌంట్​లోని అనవసరమైన డేటాను స్టోర్​ చేసుకుంటుంది. అందుకే స్పామ్​ ఫోల్డర్​ను క్లీన్​ చేయడం ద్వారా స్టోరేజ్​ను పెంచుకోవచ్చు.

డెస్క్​టాప్​లో ​స్పామ్​ ఫోల్డర్​ను ఎలా క్లీన్ చేయాలి?
How to Cleanup Gmail Spam Folder In Desktop : మొదట మీ జీమెయిల్ అకౌంట్​లోకి లాగిన్ కావాలి. తరువాత ఎడమ వైపున ఉన్న స్పామ్ ఆప్షన్​ను క్లిక్ చేయాలి. అక్కడ స్పామ్ అని లేకపోతే, మోర్ అని క్లిక్ చేయాలి. ఇప్పుడు స్పామ్​ ఫోల్డర్​ కనిపిస్తుంది. దీనిని ఓపెన్ చేసి..​ ఫోల్డర్​లోని అన్ని స్పామ్​ మెసేజ్​​లను డిలీట్ చేయాలి.

మొబైల్​యాప్​లో ​స్పామ్​ ఫోల్డర్​ను ఎలా క్లీన్​ చేయాలి?
How to Cleanup Gmail Spam Folder In Mobile App : మొదట మీ జీమెయిల్ అకౌంట్​లోకి లాగిన్ కావాలి. తరువాత స్క్రీన్​​కు పై భాగంలో ఉండే హాంబర్గర్ ఐకాన్​​ను క్లిక్ చేయాలి. తరువాత స్పామ్​ ఫోల్డర్​లోని అన్ని స్పామ్ మెసేజ్​లను డిలీట్ చేయాలి.

గూగుల్ ఫొటోస్ స్టోరేజ్​ని ఎలా డిలీట్ చేయాలి?
How To Cleanup Your Google Photos : గూగుల్ తన యూజర్స్​కు 15జీబీ స్టోరేజ్​ని ఉచితంగా అందిస్తుంది. టెక్ట్స్​ మెసెజ్​లతో పోలిస్తే ఫొటోలు, వీడియోలు ఎక్కువగా స్టోరేజ్​ని తీసుకుంటాయి. అయితే గూగుల్​ ఫొటోస్​లో సైజ్​ల వారిగా ఫైల్​లను చూడడం వీలుకాదు. మనమే ఒక్కొక్కటిగా చూడాల్సి ఉంటుంది.

డెస్క్​టాప్​లో ​గూగుల్​ ఫొటోస్​లోని.. ఫొటోలు, వీడియోలను ఎలా డిలీట్ చేయాలి?
How To Cleanup Your Google Photos And Videos In Desktop :

  1. మొదట గూగుల్​ ఫొటోస్ ఓపెన్​ చేసి అకౌంట్​లోకి లాగిన్ కావాలి.
  2. మీరు డిలీట్ చేయాలనుకుంటున్న ఫొటోలు, వీడియోలను సెలెక్ట్ చేసుకోవాలి. అప్పుడు ఫొటో, వీడియోలపై గ్రే కలర్ మార్క్​ వస్తుంది.
  3. స్క్రీన్​​కు ఎడమ వైపుపై భాగంలో ఉండే ట్రాష్​ ఐకాన్​ను క్లిక్​ చేయాలి.
  4. మూవ్ టు ట్రాష్ ఆప్షన్​ను క్లిక్ చేయాలి.
  5. తరవాత ట్రాష్​లోకి వెళ్లి, ఎమ్​టీ ట్రాష్​పై క్లిక్​​ చేయాలి.

యాపిల్ యూజర్స్​.. గూగుల్ ఫొటోస్ వాడేటప్పుడు జాగ్రత్త!
యాపిల్ ఫోన్​ను ఉపయోగించేవారి జీ-మెయిల్​, ఐక్లౌడ్ అకౌంట్​తో లింక్ అయ్యుంటే.. వారి ఫొటోలు, వీడియోలు.. ఈ రెండు అకౌంట్​లకు లింక్ అవుతాయి. యాపిల్ యూజర్స్ గూగుల్ ఫొటోస్​ యాప్​లో బ్యాకప్, సింక్ ఫిచర్​ను ఆన్ చేసుకుంటే.. ఫోన్​లోని అన్ని ఫొటోలు, వీడియోలు గూగుల్ ఫొటోస్ యాప్​​లోకి వస్తాయి. యాపిల్​ యూజర్స్ గూగుల్ ఫొటో యాప్​లోని ఫొటోలు, వీడియోలను డిలీట్ చేస్తే, అవి ఐక్లౌడ్​ అకౌంట్​లో కూడా డిలీట్ అవుతాయి. గూగుల్​ ఫొటోస్​ యాప్​లోని ఫొటోలు, వీడియోలను డిలీట్ చేసే ముందు మీరు రెండు చోట్లా (ఐక్లౌడ్, గూగుల్​ ఫొటోస్​ యాప్​ అకౌంట్​లు) డిలీట్ చేస్తున్నారు అని చెబుతుంది.

గూగుల్ ​ఫొటోస్​ యాప్​లోని ఫొటోలు, వీడియోలను ఎలా డిలీట్​ చేయాలి?
How To Cleanup Your Google Photos And Videos In Mobile App :

  1. మొదట గూగుల్​ ఫొటోస్ యాప్​ను ఓపెన్​ చేసి అకౌంట్​లోకి లాగిన్ కావాలి.
  2. మీరు డిలీట్ చేయాలనుకుంటున్న ఫొటోలను, వీడియోలను సెలెక్ట్ చేసుకొని, వాటిని డిలీట్ చేయాలి.
  3. స్క్రీన్​ కింది భాగంలో ఉన్న లైబ్రరీని క్లిక్ చేయాలి.
  4. తరవాత ట్రాష్​ను క్లిక్ చేయాలి.
  5. ఎడమ వైపున ఉన్న త్రీ డాట్స్​పై క్లిక్ చేయాలి.
  6. ఎమ్​టీ ట్రాష్​ను క్లిక్ చేయాలి.
  7. డిలీట్​ ఆప్షన్​ను క్లిక్ చేయండి.
  8. మీరు ట్రాష్​ను క్లిక్ చేసి, క్లియర్ చేయకుంటే ఫొటోలు, వీడియోలు ఆటోమేటిక్​గా 60 రోజులలో తొలగిపోతాయి.

ఇప్పటికే మీ గూగుల్​ స్టోరేజీ నిండిపోయిందా?.. అయితే ఇలా చేయండి!
గూగుల్ డ్రైవ్​, గూగుల్​ ఫొటోస్​, జీ-మెయిల్​లోని ఐటమ్​లను మీరు డిలీట్​ చేయాలనుకోకపోతే.. వాటిని డౌన్​లోడ్ చేసుకొని కంప్యూటర్​లో స్టోర్ చేసుకోవచ్చు.

గూగుల్ డ్రైవ్​, గూగుల్​ ఫొటోస్​, జీ-మెయిల్​లోని ఐటమ్​లను ఎలా డౌన్​లోడ్ చేయాలి?
How To Download Files From G mail and Google Drive :

  1. మొదట డెస్క్​టాప్​లో గూగుల్​ డ్రైవ్​, జీ-మెయిల్​, గూగుల్​ ఫొటోస్​లో లాగిన్ కావాలి.
  2. మీరు డౌన్​లోడ్​ చేయాలనుకుంటున్న ఫైల్‌లు, ఈ-మెయిల్‌లు, ఫొటోలను సెలక్ట్ చేసుకోవాలి.
  3. డెస్క్​టాప్​ కుడిపై భాగంలో ఉండే త్రీ డాట్స్​పై క్లిక్​ చేయాలి.
  4. డౌన్​లోడ్​ ఆప్షన్​ను క్లిక్​ చేయాలి. మీ ఫైల్​లు అన్ని జీమెయిల్​లో .eml file పేరుతో సేవ్ అవుతాయి.
  5. ఫైల్స్​ను డౌన్​లోడ్ చేసి, మీ కంప్యూటర్​లో స్టోర్ చేసుకోవాలి. తరువాత మీ గూగుల్​ డ్రైవ్​, జీమెయిల్​, గూగుల్ ఫొటోస్​ ట్రాష్​ బిన్​ని క్లీన్ చేయాలి.

ఈ విధంగా మీరు గూగుల్ డ్రైవ్​, గూగుల్ ఫొటోస్​, జీ-మెయిల్​లోని జంక్​ ఫైల్స్​ను డిలీట్​ చేసి, ఉచితంగా గూగుల్ స్టోరేజ్​ను వాడుకోవచ్చు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.