ETV Bharat / science-and-technology

గూగుల్​ క్రోమ్​ వెంటనే అప్​డేట్​ చేసుకోండి.. లేదంటే...

author img

By

Published : Aug 25, 2021, 3:27 PM IST

క్రోమ్​ బ్రౌజర్​లో ఏడు లోపాలను గుర్తించినట్లు గూగుల్​ ప్రకటించింది. వాటిని అధిగమించేందుకు సరికొత్త అప్​డేట్​ను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు వెల్లడించింది. సైబర్​ దాడుల నుంచి తప్పించుకునేందుకు వెంటనే అప్​డేటెడ్​ వెర్షన్​ను ఇన్​స్టాల్​ చేసుకోవాలని యూజర్లను కోరింది.

Google Chrome users warned about seven high-severity vulnerabilities - update the browser now
గూగుల్​ క్రోమ్​ అప్​డేట్​ చేసుకోకుంటే.. ఇక అంతే!

క్రోమ్​ బ్రౌజర్​ను అప్​డేట్​ చేసుకోవాలంటూ వినియోగదారులకు గూగుల్​ విజ్ఞప్తి చేసింది. తాజాగా క్రోమ్​లో ఏడు లోపాలను కనుగొనగా.. వాటిని అధిగమించేందుకు అప్​డేట్​ వర్షెన్​ను ఇన్​స్టాల్​ చేసుకోవాలని సూచించింది. ఈ లోపాలు కేవలం క్రోమ్​ బ్రౌజర్​కు మాత్రమే పరిమితం కాకుండా.. లైనెక్స్​, మ్యాక్​ ఆపరేటింగ్​ సిస్టమ్స్​ను దెబ్బతీసే అవకాశం ఉంది. అయితే వాటి ద్వారా సైబర్​ నేరగాళ్లు రెచ్చిపోయే అవకాశం ఉందని గూగుల్​ సంస్థ ప్రకటించింది. దీనికోసమే క్రోమ్​ కొత్త అప్​డేట్​ను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు స్పష్టం చేసింది.

ఈ ఏడు లోపాల్లో రెండింటిని బహిర్గతం చేసిన మన్​ఫ్రెడ్​ పాల్​ అనే వ్యక్తికి గూగుల్​ బహుమానం అందించింది. ఒక్కో లోపానికి రూ.15.59 లక్షలను పాల్​ అందుకున్నాడు.

గూగుల్​ క్రోమ్​ అప్​డేట్​ చేసుకోండిలా!

  • ముందుగా మీకు సంబంధించిన కంప్యూటర్​ లేదా ల్యాప్​టాప్​లో గూగుల్​ క్రోమ్​ బ్రౌజర్​ను ఓపెన్​ చేయండి.
  • టూల్​బార్​లోని(Tool bar) మూడు డాట్​బటన్​పై క్లిక్​ చేయండి.
  • ఆ తర్వాత హెల్ప్(Help)​ బటన్​పై క్లిక్​ చేసి అబౌట్​ గూగుల్ క్రోమ్​(About Google Chrome) ఆప్షన్​ను ఎంచుకోండి.
  • మీరు వినియోగించే బ్రౌజర్​ లేటెస్ట్​ వర్షెన్​ ఇన్​స్టాల్​ చేయకపోతే.. అప్​డేట్​ ఆప్షన్​ చూపిస్తుంది. దానిపై క్లిక్​ చేసి బ్రౌజర్​ను అప్​డేట్​ చేసుకోవచ్చు. అది పూర్తవ్వగానే సిస్టమ్​ను రీస్టార్ట్​ చేయాల్సిఉంటుంది.
  • మీరు ఇప్పటికే తాజా వెర్షన్​ (92.0.4515.159) వాడుతుంటే.. మీ బ్రౌజర్​ను అప్​డేట్​ చేయాల్సిన అవసరం లేదు.

ఇదీ చూడండి.. డేటా భద్రత ముఖ్యమా?.. ఈ బ్రౌజర్లు వాడండి!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.