ETV Bharat / science-and-technology

రూ.5వేలలో స్మార్ట్‌వాచ్ కొనాలా? టాప్ 9 మోడల్స్ ఇవే...

author img

By

Published : Jul 18, 2021, 5:36 PM IST

స్మార్ట్‌వాచ్​లకు ఇటీవల విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. మొబైల్ నోటిఫికేషన్ల నుంచి ఆరోగ్య సంరక్షణ వరకు అన్ని రకాల సమాచారాన్ని యూజర్‌కు చేరవేస్తుండటం వల్ల సంప్రదాయ వాచ్‌ల స్థానంలో వీటిని ఉపయోగించేవారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. దీంతో తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్లున్న మోడల్స్‌ వైపు యూజర్స్ మొగ్గు చూపుతున్నారు. తాజాగా నాయిస్‌ కంపెనీ కొత్త మోడల్ స్మార్ట్‌వాచ్‌ను తీసుకొస్తూ ఏడు రోజుల బ్యాటరీ బ్యాక్‌అప్ ఉంటుందని తెలిపింది. ఈ నేపథ్యంలో రూ. 5వేల ధరలో వారం రోజుల బ్యాటరీ లైఫ్‌తో మార్కెట్లో అందుబాటులో ఉన్న స్మార్ట్‌వాచ్‌ల జాబితాను పరిశీలిద్దాం.

smart watches
Smartwatches: ₹ 5వేల ధరలో..స్మార్ట్‌ అండ్ స్టైలిష్‌

ఇటీవల కాలంలో స్మార్ట్​ వాచ్​లకు ఆదరణ పెరుగుతోంది. తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్లు ఉన్న వాచ్​లపై వినియోగదారులు ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు తొమ్మిది స్మార్ట్​వాచ్​ మోడల్స్​ బాగా పాపులర్ అయ్యాయి. రూ.5వేల కంటే తక్కువ ధరకు అందుబాటులో ఉన్న ఈ స్మార్ట్​వాచ్​ల వివరాలు తెలుసుకుందాం..

నాయిస్‌ కలర్‌ఫిట్ అల్ట్రా (Noise Colourfit Ultra)

smart watches
నాయిస్‌ కలర్‌ఫిట్ అల్ట్రా (Noise Colourfit Ultra)

నాయిస్‌ కంపెనీ రూ. 4,499 ధరలో కలర్‌ఫిట్ అల్ట్రా పేరుతో స్మార్ట్‌వాచ్‌ను తీసుకొచ్చింది. జులై 16 నుంచి వీటి అమ్మకాలు ప్రారంభంకానున్నాయి. గన్‌మెటల్ గ్రే, క్లౌడ్ గ్రే, స్పేస్ బ్లూ రంగుల్లో లభిస్తుంది. ఈ వాచ్‌ను ఒక్కసారి ఛార్జ్ చేస్తే 9 రోజులు నిరంతరాయంగా పనిచేస్తుందని నాయిస్ తెలిపింది. ఇందులో 60 రకాల స్పోర్ట్స్ మోడ్‌లు, 100 వాచ్‌ ఫేస్‌లు ఉన్నాయి. ఐపీ68 రేటింగ్‌ వాటర్‌ప్రూఫ్‌ను ఇస్తున్నారు. హార్ట్‌రేట్, స్లీప్‌, స్ట్రెస్‌ మానిటర్‌ ఫీచర్స్ ఉన్నాయి.

బోట్ వాచ్ ఎక్స్‌టెండ్ (Boat Watch Xtend)

smart watches
బోట్ వాచ్ ఎక్స్‌టెండ్ (Boat Watch Xtend)

50 రకాల వాచ్‌ ఫేసెస్‌తో 1.69-అంగుళాల టచ్‌ స్క్రీన్ డిస్‌ప్లే ఇస్తున్నారు. 300 ఎంఏహెచ్‌ బ్యాటరీ ఉంది. దీన్ని ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే 7 రోజులపాటు నిరంతరాయంగా పనిచేస్తుంది. 14 స్పోర్ట్స్ మోడ్స్‌ ఉన్నాయి. తొలిసారిగా ఇందులో అలెక్సా వాయిస్‌ అసిస్టెంట్ సపోర్ట్‌ ఇస్తున్నారు. 5ఏటీఎం వాటర్ రెసిస్టెన్స్‌ ఉంది. ఒకవేళ వాచ్‌ 50మీటర్ల లోతు నీటిలో పడి తడిచినా పాడవకుండా రక్షణ కల్పిస్తుంది. హార్ట్‌రేట్ సెన్సర్, ఎస్‌ఈఓ2, స్ట్రెస్ మానిటర్ ఫీచర్స్ ఉన్నాయి. ఈ వాచ్‌ ధర రూ. 3,499గా కంపెనీ నిర్ణయించింది. అమెజాన్‌ లేదా బోట్ వెబ్‌సైట్‌ నుంచి కొనుగోలు చెయ్యొచ్చు. పిచ్ బ్లాక్‌, డీప్ బ్లూ, ఆలీవ్ గ్రీన్, సాండీ క్రీమ్ రంగుల్లో లభిస్తుంది.

రెడ్‌మీ వాచ్‌ జీపీఎస్‌ (Redmi Watch GPS)

smart watches
రెడ్‌మీ వాచ్‌ జీపీఎస్‌ (Redmi Watch GPS)

ఈ వాచ్‌లో జీపీఎస్, అడ్వాన్స్‌డ్ హెల్త్‌ ట్రాకింగ్ ఫీచర్స్‌తోపాటు 11 రకాల స్పోర్ట్స్ మోడ్‌లు, 200 వాచ్‌ ఫేస్‌లను ఇస్తున్నారు. హార్ట్‌రేట్, స్లీప్ మానిటరింగ్ ఫీచర్స్ ఉన్నాయి. ఒకటి నుంచి ఐదు నిమిషాల బ్రీతింగ్ ఎక్సర్‌సైజ్ చేసేందుకు ప్రత్యేకంగా బ్రీతింగ్ ఎక్సర్‌సైజ్ గైడ్ ఫీచర్ కూడా ఉంది. 5ఏటీఎం వాటర్ రెసిస్టెన్స్‌తో వాచ్‌ నీటిలో తడిచినా పాడవదు. ఇందులోని 230 ఎంఏహెచ్ బ్యాటరీని ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే 10 రోజులపాటు బ్యాక్‌అప్‌ ఉంటుంది. 1.4-అంగుళాల ఫుల్ టచ్‌ కలర్ డిస్‌ప్లే ఇస్తున్నారు. ఫోన్‌ కాల్స్‌, నోటిఫికేషన్స్ అలారమ్, మ్యూజిక్ కంట్రోల్, ఫైండ్ మై ఫోన్ వంటి ఫీచర్స్ ఉన్నాయి. దీని ధర రూ. 3,999. ఐవోరి, బ్లాక్‌, బ్లూ రంగుల్లో రెడ్‌మీ వాచ్‌ లభిస్తుంది.

నాయిస్‌ కలర్‌ఫిట్ ప్రో 3 (Noise ColourFit Pro 3)

smart watches
నాయిస్‌ కలర్‌ఫిట్ ప్రో 3 (Noise ColourFit Pro 3)

ఈ వాచ్‌లో మహిళల కోసం ప్రత్యేకంగా ఫిమేల్ హెల్త్‌ ట్రాకింగ్ అనే ఫీచర్‌ ఇస్తున్నారు. ఇందులోని 210 ఎంఏహెచ్ బ్యాటరీ సింగిల్ ఛార్జ్‌తో 10 రోజులపాటు పనిచేస్తుంది. 1.55-అంగుళాల ఎల్‌సీడీ స్క్రీన్ ఇస్తున్నారు. వాటర్‌ రెసిస్టెన్స్‌ ఫీచర్‌తోపాటు 14 రకాల స్పోర్ట్స్ మోడ్స్‌ ఉన్నాయి. ఆండ్రాయిడ్, ఐఓఎస్ డివైజ్‌లను సపోర్ట్ చేస్తుంది. ఇతర వాచ్‌లకు భిన్నంగా ఇందులో యూజర్‌కి నచ్చినట్లుగా మార్చుకునేలా క్లౌడ్ వాచ్‌ ఫేస్‌లను ఇస్తున్నారు. హార్ట్‌రేట్, ఎస్‌పీఓ2, స్లీప్ మానిటర్ ఫీచర్స్ ఉన్నాయి. దీని ధర రూ. 4,499. స్మోక్ గ్రే, జెట్ బ్లూ, స్మోక్ గ్రీన్‌, రోస్‌ పింక్‌, జెట్ బ్లాక్‌, రోస్ రెడ్ రంగుల్లో లభిస్తుంది.

ఫైర్‌-బోల్ట్‌ బీఎస్‌డబ్ల్యూ001 (Fire-Boltt BSW001)

smart watches
ఫైర్‌-బోల్ట్‌ బీఎస్‌డబ్ల్యూ001 (Fire-Boltt BSW001)

1.4-అంగుళాల ఫుల్ హెచ్‌డీ టచ్‌ స్క్రీన్‌ డిస్‌ప్లే ఇస్తున్నారు. 200 రకాల వాచ్‌ ఫేస్‌లు ఉన్నాయి. వాచ్‌ను ఒక్కసారి ఛార్జ్ చేస్తే 8 రోజులు పనిచేస్తుంది. ఐపీఎక్స్7 వాటర్‌ రెసిస్టెన్స్ ఫీచర్ ఉంది. దీని ధర రూ. 2,999. బ్లాక్‌, బ్లూ, గ్రే, పింక్‌, గోల్డ్‌ రంగుల్లో లభిస్తుంది. మల్టీ స్పోర్ట్స్‌ మోడ్స్‌, హార్ట్‌రేట్, స్లీప్‌, బ్లడ్ ఆక్సిజన్ మానిటరింగ్‌తోపాటు మ్యూజిక్ కంట్రోల్స్, వైబ్రేషన్ అలర్ట్, కాలర్ ఇన్ఫర్మేషన్‌ ఫీచర్స్ కూడా ఉన్నాయి.

క్రాస్‌బీట్స్‌ ఇగ్నైట్‌ (Crossbeats Ignite)

smart watches
క్రాస్‌బీట్స్‌ ఇగ్నైట్‌ (Crossbeats Ignite)

ఈ వాచ్‌లో సోషల్‌ మీడియా యాక్టివిటీ, కాల్‌ నోటిఫికేషన్, మెసేజ్‌ అలర్ట్ ఫీచర్స్ ఉన్నాయి. 5 రకాల వాచ్‌ ఫేస్‌లతో 1.4-అంగుళాల హై డెఫినిషన్ ఐపీఎస్ డిస్‌ప్లే ఇస్తున్నారు. 180 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. దీన్ని ఒక్కసారి ఛార్జ్ చేస్తే 10 రోజుల పాటు పనిచేస్తుంది. 6 రకాల స్పోర్ట్స్ మోడ్స్‌తోపాటు ఐపీ68తో వాటర్, డస్ట్‌ నుంచి రక్షణ కల్పిస్తున్నారు. ఆరోగ్యానికి సంబంధించిన సమాచారాన్ని సీబీ ఎక్స్‌ప్లోర్ అనే యాప్‌ సాయంతో ఎప్పటికప్పుడు యూజర్‌కి చేరవేస్తుంది. ప్యూర్ బ్లాక్‌ కలర్‌ వేరియంట్‌ ధర రూ. 2,999గాను, డిసర్ట్ గోల్డ్ వేరియంట్ ధర రూ. 3,299గా కంపెనీ నిర్ణయించింది.

రియల్‌మీ వాచ్‌ (Realme Watch)

smart watches
రియల్‌మీ వాచ్‌ (Realme Watch)

రియల్‌మీ స్మార్ట్‌వాచ్‌ శ్రేణిలో ఇది ఎంట్రీలెవల్ మోడల్. 1.4-అంగుళాల టచ్‌ స్క్రీన్ డిస్‌ప్లే ఇస్తున్నారు. ఇందలోని 160 ఎంఏహెచ్ బ్యాటరీ ఒక్కసారి ఛార్జ్ చేస్తే 7 రోజుల బ్యాటరీ లైఫ్‌ను అందిస్తుంది. 14 రకాల స్పోర్ట్స్ మోడ్స్‌, 12 రకాల వాచ్‌ ఫేస్‌లు, యాక్టివిటీ ట్రాకర్‌, హార్ట్‌రేట్ మానిటర్‌, బ్లడ్ ఆక్సిజన్ మానిటరింగ్, ఫోన్‌ నోటిఫికేషన్‌ ఫీచర్లున్నాయి. వాచ్‌ సాయంతో ఫోన్‌లో మ్యూజిక్, కెమెరా కంట్రోల్ చెయ్యొచ్చు. దీని ధర రూ. 3,499. బ్లాక్ రంగులో లభిస్తుంది.

నాయిస్‌ఫిట్ యాక్టివ్‌ (Noisefit Active)

smart watches
నాయిస్‌ఫిట్ యాక్టివ్‌ (Noisefit Active)

గుండ్రటి డయల్‌తో ఆకర్షణీయమైన ఫీచర్స్‌తో నాయిస్‌ఫిట్ యాక్టివ్ వాచ్‌ను తీసుకొచ్చారు. యూజర్‌ హెల్త్‌ కండిషన్‌ను ఎప్పటికప్పుడు మానిటర్‌ చేసి ఆ సమాచారాన్ని నాయిస్‌ఫిట్ యాప్‌లో నిక్షిప్తం చేస్తుంది. ఇందులో కూడా క్లౌడ్ వాచ్‌ ఫేసెస్‌ ఉన్నాయి. 14 రకాల స్పోర్ట్స్ మోడ్స్‌తోపాటు 24/7 హార్ట్‌రేట్ మానిటర్‌, ఎస్‌పీఓ2, 5ఏటీఎం వాటర్‌ రెసిస్టెన్స్ ఫీచర్స్‌ ఇస్తున్నారు. 320 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. సింగిల్ ఛార్జ్‌తో 7 రోజులు నిరంతరాయంగా పనిచేస్తుంది. వైబ్రేషన్ అలర్ట్, మ్యూజిక్ కంట్రోల్‌, ఫైండ్ మై ఫోన్ ఫీచర్స్‌ కూడా ఉన్నాయి. రోబస్ట్ బ్లాక్, పవర్ బ్లూ, స్పోర్టీ రెడ్, జెస్టీ గ్రే రంగుల్లో లభిస్తుంది. ఈ వాచ్‌ ధర రూ. 3,998.

అమేజ్‌ఫిట్ నియో (Amzefit Neo)

smart watches
అమేజ్‌ఫిట్ నియో (Amzefit Neo)

రెట్రో డిజైన్‌తో 1.2 అంగుళాల మోనోక్రోమ్ డిస్‌ప్లే ఇస్తున్నారు. ఫోన్‌, మెసేజ్ నోటిఫికేషన్లతోపాటు 24X7 హార్ట్‌రేట్ మానిటరింగ్ కోసం పీపీజీ బయో ట్రాకింగ్ ఆప్టికల్‌ సెన్సర్ ఇస్తున్నారు. ర్యాపిడ్ ఐ మూమెంట్ (ఆర్‌ఈఎం), స్లీప్ ట్రాకర్‌ ఫీచర్స్‌ ఉన్నాయి. పీఏఐ (పర్సనల్ యాక్టివిటీ ఇంటెలిజెన్స్‌) అసెస్‌మెంట్ సిస్టం పూర్తి హెల్త్‌ కండిషన్‌ను మానిటర్‌ చేస్తూ ఆ డేటాను యూజర్‌కి చేరవేస్తుంది. ఇందులో మూడు స్పోర్ట్స్‌ మోడ్స్‌ ఉన్నాయి. 160 ఎంఏహెచ్‌ బ్యాటరీ ఉంది. ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే 28 రోజులు, పవర్‌ సేవింగ్ మోడ్‌లో 37 రోజులు పనిచేస్తుంది. ఇది 5ఏఎంటీ వాటర్‌ ప్రూఫ్ డిజైన్‌తో తయారయింది. బ్లాక్‌, గ్రీన్‌, రెడ్‌ రంగుల్లో ఈ వాచ్‌ లభిస్తుంది. దీని ధర రూ. 2,499గా అమేజ్‌ఫిట్ నిర్ణయించింది.

ఇదీ చదవండి : ఈ ఇయర్​ఫోన్స్ ధర రూ. 1.29లక్షలు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.