ETV Bharat / science-and-technology

అమెజాన్ ఖాతా లాకైందంటూ నకిలీ మెయిల్‌.. యూజర్స్‌కు అలర్ట్‌!

author img

By

Published : Dec 29, 2021, 12:36 PM IST

fake mails showing amazon account locked
అమెజాన్​ ఫేక్​ మెయిల్స్​

Amazon Cyber Crime News: సైబర్​ నేరగాళ్లు ప్రజలను మోసం చేయడం కోసం రోజుకో కొత్త మార్గాలను అన్వేషిస్తున్నారు. అయితే ప్రస్తుతం అమెజాన్‌ ఖాతాదారులే లక్ష్యంగా నకిలీ ఈ-మెయిల్స్‌తో మోసాలకు పాల్పడుతున్నారట. 'మీ అమెజాన్‌ ఖాతా లాక్‌ అయింది. వివరాలు అప్‌డేట్ చేయకుంటే పెండింగ్‌లో ఉన్న ఆర్డర్లు అన్ని రద్దవుతాయి' అంటూ కస్టమర్‌కేర్ నుంచి పంపుతున్నట్లుగా నకిలీ ఈ-మెయిల్ యూజర్‌కు పంపి మోసాలకు పాల్పడుతున్నారు.

Amazon Cyber Crime News: సైబర్‌ మోసాలకు పాల్పడే నేరగాళ్లు రోజుకో కొత్త పంథాను ఎంచుకుంటున్నారు. ఇప్పటి వరకు యాప్‌లు, ఈ-మెయిల్‌ ద్వారా మాల్‌వేర్‌ను పంపడం, ఈ-కేవైసీ, నకిలీ ఎస్సెమ్మెస్‌లు, ఫోన్‌కాల్స్‌, వాట్సాప్‌ పేమెంట్, మనీ రిక్వెస్ట్ వంటి వాటి ద్వారా మోసాలు పాల్పడుతున్నారు. తాజాగా మరో కొత్త తరహా సైబర్ మోసం వెలుగులోకి వచ్చింది. అయితే ఈ సారి హ్యాకర్స్ అమెజాన్‌ ఖాతాదారులే లక్ష్యంగా నకిలీ ఈ-మెయిల్స్‌తో మోసాలకు పాల్పడుతున్నారట. 'మీ అమెజాన్‌ ఖాతా లాక్‌ అయింది. వివరాలు అప్‌డేట్ చేయకుంటే పెండింగ్‌లో ఉన్న ఆర్డర్లు అన్ని రద్దవుతాయి' అంటూ కస్టమర్‌కేర్ నుంచి పంపుతున్నట్లుగా నకిలీ ఈ-మెయిల్ యూజర్‌కు పంపుతారు. సదరు మెయిల్ అమెజాన్‌ సంస్థ పంపినట్లుగా ఒరిజినల్ మెయిల్‌కు ఏమాత్రం తీసిపోకుండా ఉండటంతో యూజర్స్ సులువుగా నమ్ముతున్నారట. దీంతో మెయిల్‌లో సూచించిన విధంగా తమ సమాచారం అప్‌డేట్ చేస్తుండటంతో.. అవి హ్యాకర్స్‌కు చేరుతున్నాయని సైబర్ నిపుణులు పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ తరహా మోసాలు ఎక్కువగా బ్రిటన్‌లో నమోదవుతున్నట్లు తెలిపారు. భారత్‌లో ఎవరైనా యూజర్స్‌కు ఈ విధమైన మెయిల్స్ వస్తే వాటికి స్పందించవద్దని సూచిస్తున్నారు.

ఒకవేళ యూజర్‌ సదరు మెసేజ్ గురించి పట్టించుకోకుండా అమెజాన్‌ ఖాతా ఓపెన్ చేయాలని ప్రయత్నిస్తే ఆర్డర్స్ అన్ని రద్దవుతాయని సైబర్‌ నేరగాళ్లు ఈ-మెయిల్‌లో పేర్కొంటున్నారట. అలానే యూజర్స్ సులువుగా తమ వివరాలను నమోదు చేసేందుకు మెయిల్‌లోనే అమెజాన్ నకిలీ వెబ్‌సైట్‌కు సంబంధించిన లింక్‌ను ఇస్తున్నట్లు సైబర్ నిపుణులు తెలిపారు. అందుకే యూజర్స్ ఖాతా లాకైందని వచ్చే ఈ-మెయిల్స్‌ను ఓపెన్ చేయొద్దని, ఒకవేళ ఓపెన్ చేసినా.. అందులోని లింక్స్‌పై క్లిక్ చేయొద్దని అమెజాన్‌ సూచించింది.

  • మీ ఖాతా క్లోజ్‌ అయిందని వచ్చే మెయిల్స్‌కు స్పందించే ముందు, అందులోని వెబ్‌ లింక్‌పై క్లిక్ చేయకుండా, బ్రౌజర్‌లో అమెజాన్‌ వెబ్‌సైట్ ఓపెన్ చేసి లాగిన్‌ వివరాలు నమోదు చేసి చెక్‌ చేసుకోవాలని సైబర్‌ నిపుణులు సూచిస్తున్నారు.
  • అలానే మనకు వచ్చిన మెయిల్‌ను కంపెనీ నుంచి వచ్చిందా లేక హ్యాకర్స్ పంపారా అనేది జాగ్రత్తగా పరిశీలించాలి. కొన్నిసార్లు కంపెనీ పేరులోని అక్షరాలు ముందు వెనుకకి మార్చినప్పటికీ వాటిని గుర్తించలేం. అందుకే మెయిల్ ఐడీ పేరును క్షుణ్ణంగా పరిశీలించాలి.
  • ఒక వేళ మెయిల్ ఓపెన్ చేసి అందులోని లింక్ క్లిక్ చేసినా, లాగిన్‌ కావద్దు. పొరపాటున లాగిన్‌ అయినప్పటికీ అందులో మీ కార్డు వివరాలు, నెట్ బ్యాకింగ్‌ పాస్‌వర్డ్‌, యూపీఐ పేమెంట్‌కు సంబంధించిన వివరాలు నమోదు చేయకపోవడం ఉత్తమమని సైబర్ నిఫుణులు సూచించారు.

ఇదీ చూడండి: శాస్త్రరంగంలో ఈ ఏడాది 'అద్భుత విజయాలు' ఇవే..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.