ETV Bharat / priya

మటన్ స్పెషల్: ఎంఎల్ఏ పొట్లం బిర్యానీ

author img

By

Published : May 24, 2021, 7:25 PM IST

బిర్యానీ అంటే ఎప్పుడూ చికెనే కాదండోయ్. మటన్​తోనూ అదిరిపోయే బిర్యానీ తయారు చేసుకోవచ్చు. మరి పొట్లం బిర్యానీ ఎప్పుడైనా చేసుకున్నారా? ఎలా తయారు చేయాలో తెలీదంటారా? దానికేం.. ఈ కథనం చూస్తే సరి!

mutton special recipe mla potlam birani making step by step process
మటన్ స్పెషల్: ఎంఎల్ఏ పొట్లం బిర్యానీ

ఎంఎల్ఏ పొట్లం బిర్యానీ తయారు చేసుకునే విధానం ఇలా..

కావల్సినవి:

మటన్‌ కీమా - 150 గ్రా, రొయ్యలు - వంద గ్రా, బాస్మతీ బియ్యం - 300 గ్రా, దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు - అన్నీ కలిపి ఒకటిన్నర చెంచా, ఉప్పు - తగినంత, కారం, పసుపు - చెంచా చొప్పున, నూనె - పావుకప్పు, నెయ్యి - టేబుల్‌ స్పూను, జీలకర్రపొడి - చెంచా, జాజికాయపొడి - చెంచా, పెరుగు - మూడు టేబుల్‌ స్పూన్లు, అల్లంవెల్లుల్లి పేస్టు - టేబుల్‌స్పూను, వేయించిన ఉల్లిపాయ ముక్కలు - పావుకప్పు.

ఆమ్లెట్‌ కోసం: గుడ్లు - నాలుగు, మిరియాలపొడి - చెంచా, కొత్తిమీర తరుగు - రెండు టేబుల్‌స్పూన్లు, ఉప్పు - కొద్దిగా, కారం - చెంచా, నూనె - రెండు చెంచాలు.

తయారీ విధానం:

బియ్యాన్ని శుభ్రంగా కడిగి అరగంట నానబెట్టుకోవాలి. తరవాత ఆ బియ్యాన్ని మరోసారి కడిగి, సరిపడా నీళ్లు పోసి యాలకులూ, నెయ్యి వేసి సగం వరకు ఉడికించుకొని పెట్టుకోవాలి. తరవాత అన్నంలో మిగిలిన నీటిని పూర్తిగా వంపేసి ఆ అన్నాన్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మరో బాణలిలో నూనె వేడి చేసి దాల్చిన చెక్క, లవంగాలు వేయాలి. ఇందులో కీమా, రొయ్యలు, అల్లంవెల్లుల్లి పేస్టు వేసి ఏడెనిమిది నిమిషాలు వేయించుకోవాలి. కీమా మెత్తగా అయ్యిందనుకున్నాక పెరుగూ, కారం, జీలకర్ర పొడీ, సరిపడా ఉప్పు వేసి దింపేయాలి. ఇప్పుడు మరో గిన్నెలో వండిన అన్నాన్ని సగం పరవాలి. దానిపై కీమా, రొయ్యల మిశ్రమాన్ని ఉంచి, వేయించుకున్న ఉల్లిపాయ ముక్కలూ, జాజికాయ పొడి వేయాలి. దానిపై మిగిలిన అన్నాన్ని పరిచి గట్టి మూత పెట్టేయాలి. కాసేపటికి అన్నం ఉడుకుతుంది. అప్పుడు దింపేయాలి.

ఇప్పుడు ఓ గిన్నెలో ఆమ్లెట్ల కోసం పెట్టుకున్న పదార్థాల్లో నూనె తప్ప మిగిలినవన్నీ తీసుకోవాలి. గుడ్లసొనను బాగా గిలకొట్టాలి. దీన్ని పెనంపై ఆమ్లెట్‌లా వేసి, చుట్టూ నూనె వేస్తూ కాల్చుకోవాలి. దీన్ని పళ్లెంపై పరిచి.. మధ్యలో బిర్యానీ ఉంచి పొట్లంలా చుట్టేయాలి. అంతే పొట్లం బిర్యానీ సిద్ధం. తినేముందు పొట్లం మధ్యకు కోస్తే సరిపోతుంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.