ETV Bharat / priya

Fruit Tea : అల్లం టీ.. గ్రీన్​ టీ కాదు.. పండ్లతో వేడివేడి చాయ్..!

author img

By

Published : Feb 6, 2022, 4:41 PM IST

Fruit Tea : కొవిడ్‌... ప్రపంచాన్ని చుట్టేసింది. జీవనశైలిలో ఎన్నో మార్పుల్నీ తీసుకొచ్చింది. ఆహారపుటలవాట్లయితే చెప్పే పనే లేదు. ఆరోగ్యసూత్రాలంటే గిట్టనివాళ్లను సైతం తు.చ. తప్పక పాటించేలా చేసింది. అదీ ఎంతగా అంటే- అల్లం, వెల్లుల్లి, పసుపు, మిరియాలు.. వంటి మసాలా దినుసుల్నీ సుగంధద్రవ్యాలనే కాదు, చల్లచల్లగా తాగే పండ్ల రసాలను సైతం వేడివేడి టీ రూపంలో చప్పరించేంతగా..!

Fruit Tea
Fruit Tea

Fruit Tea : గ్రీన్‌ టీ, బ్లాక్‌ టీ, పూల టీలు సాచెట్లూ బ్యాగ్‌ల రూపంలో రావడం తెలిసిందే. వాటికే పండ్లూ ఔషధమొక్కల ఫ్లేవర్లు జోడించినవీ వస్తున్నాయి. అయితే ఇప్పుడు అచ్చంగా పండ్లతో చేసిన పొడులూ టీ బ్యాగ్స్‌ రూపంలో వస్తున్నాయి. వాటిని కూడా ఎంతో ఇష్టంగా వేడి వేడిగా తాగేస్తున్నారు.

.

Tea with Fruits : పండ్లేమిటీ.. టీ ఏమిటీ అనిపిస్తోంది కదూ. నిజమే, ఏదయినా తేయాకుతో తయారైనదయితేనే అది టీ. కానీ ఇప్పుడు దాని అర్థమే మారిపోయింది. మసాలా దినుసులయినా సుగంధ ద్రవ్యాలయినా పూలరేకులయినా వేటినైనా నీళ్లలో వేసి మరిగించి తాగే ప్రతీదీ టీనే. ఒకప్పుడు దీన్నే మనవాళ్లు కషాయం అనేవారు. కానీ యాంటీవైరల్‌, యాంటీ బ్యాక్టీరియల్‌, యాంటీ ఫంగల్‌... వంటి ఔషధగుణాలున్న ప్రతీ మొక్కనీ మొక్క భాగాలనీ కూడా నీళ్లలో వేసి మరిగించి తాగడం అలవాటుగా చేసుకున్నారీమధ్య. అందులో భాగంగా ఇప్పుడు పండ్లనీ వేడివేడిగా తాగేస్తున్నారన్నమాట. అదెలా అంటే..

యాపిల్ టీ

Apple Tea : సీజన్‌లో దొరికే పండ్లను మిగిలిన అన్నికాలాల్లోనూ తినగలిగేలా ఎండబెట్టి లేదా పొడి రూపంలో నిల్వ చేయగలిగే టెక్నాలజీ అంతటా వాడుకలోకి వచ్చింది. దాంతో ఆయా పండ్లను డ్రై ఫ్రూట్స్‌గాగానీ పొడి రూపంలోగానీ తీసుకోవడం పెరిగింది. అయితే ఇంతకాలం ఆ పొడిని మిల్క్‌షేక్‌లూ ఐస్‌క్రీమ్‌లూ పుడ్డింగులతోబాటు జ్యూస్‌గా చేసుకుని చల్లచల్లగా తాగుతూ వచ్చారు. కొవిడ్‌ రాకతో వాటిని వాడుకునే విధానం మారిపోవడంతో అనేక కంపెనీలు ఫ్రూట్‌ టీలను తయారుచేస్తున్నాయి. వీటినే టై(టీ)సేన్స్‌ అనీ అంటున్నారు. అంటే- తేయాకు లేని టీలని అర్థమట. దాంతో ప్రపంచవ్యాప్తంగా బ్లాక్‌ టీ వినియోగం తగ్గి టైసేన్స్‌ వాడకం పెరిగిందట. వీటివల్ల ఆరోగ్యానికి హాని లేకపోవడమే ఇందుకు కారణం.

జామపండు టీ

కెఫీన్‌ ఉండదు..!

Guava Tea : పండ్లను వేడి చేయడం వల్ల వాటిల్లోని ఆరోగ్య గుణాలు తగ్గిపోతాయన్న సందేహం సహజమే. అయితే గ్రీన్‌ టీ తయారీ మాదిరిగానే నీళ్లను మరిగించాకే పండ్లతో చేసిన పొడినీ కలుపుతారు. కాబట్టి వాటిల్లోని విటమిన్లకీ యాంటీఆక్సిడెంట్లకి నష్టం కలగదు సరికదా, పండ్లలో అధిక శాతంలో ఉండే ఆంథోసైనిన్ల వల్ల జలుబూ దగ్గూ వంటి వాటికి ఉపశమనంగానూ ఉంటుందట. గ్రీన్‌ టీలో మాదిరిగానే టైసేన్స్‌లోని పదార్థాలు రోగనిరోధక శక్తి పెంచేందుకూ శరీరంలోని టాక్సిన్లను బయటకు పంపేందుకూ తోడ్పడతాయి. క్యాన్సర్లూ, మతిమరుపూ, హృద్రోగాలు వంటి వాటినీ అడ్డుకుంటాయి. ఒత్తిడినీ తగ్గిస్తాయి. కెఫీన్‌ ఉండదు కాబట్టి గర్భిణీలూ వీటిని నిశ్చింతగా తాగొచ్చట.

అరటి పండు టీ

Banana Tea : కొన్ని కంపెనీలు ఆయా పండ్లతోపాటు ఇతరత్రా ఔషధమొక్కల్నీ ఆకుల్నీ పువ్వుల్నీ రేకుల్నీ.. కూడా కలిపి టైసేన్స్‌ని తయారుచేస్తున్నారు. వీటిని వేడిగా తాగడం ఇష్టంలేనివాళ్లు ముందు వేడినీళ్లలో పొడి లేదా టీబ్యాగ్‌ని వేసి, ఆరాక ఐస్‌క్యూబ్స్‌ వేసుకుని తాగొచ్చు. వేసవిలో ఇలా తాగడం వల్ల దాహమూ తీరుతుంది. ఎండవేడి నుంచి ఉపశమనమూ కలుగుతుంది. కొన్ని కంపెనీలు అరటిపండు, మామిడి, పుచ్చ, జామ.. వంటి పండ్లకి పేషన్‌, గులాబీ, మందార.. వంటి పువ్వుల్నీ గ్రీన్‌ టీనీ కూడా జోడిస్తున్నాయి. మాక్‌టెయిల్స్‌ మాదిరిగా క్రాన్‌బెర్రీ-ఆపిల్‌, దానిమ్మ-పీచ్‌, బ్లూబెర్రీ- గోజి- స్ట్రాబెర్రీ..

స్ట్రాబెర్రీ టీ

Strawberry Tea : ఇలా రెండుమూడు రకాల పండ్లను కలిపీ తీసుకొస్తున్నాయి. చివరికి కీరా, గుమ్మడికాయ పొడుల్నీ కూడా కలిపేస్తున్నారంటే- టైసేన్స్‌ ఏ స్థాయిలో మార్కెట్లోకి వస్తున్నాయో మరెంతగా తాగేస్తున్నారో అర్థం కావడం లేదూ!

మ్యాంగో ట్రీ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.