ETV Bharat / priya

Idli Recipe: బ్రేక్​ఫాస్ట్​గా లైట్ ఫుడ్​ కావాలా? రసం ఇడ్లీ ట్రై చేయండి

author img

By

Published : Sep 30, 2021, 7:11 AM IST

అన్నంలోకి రసం తయారు చేయడం మనకందరికీ తెలుసు. అయితే ఉదయం బ్రేక్​ఫాస్ట్​గా తీసుకొనే ఇడ్లీలోకి చేసుకొనే రసం (Idli Recipe) తయారీని ఇప్పుడు మనం తెలుసుకుందాం!

idli rasam
రసం ఇడ్లీ

ఇడ్లీ, సాంబార్​(idli sambar).. డెడ్లీ కాంబినేషన్​. అయితే దీనికి ఏమాత్రం తీసుపోదని అంటుంది రసం ఇడ్లీ (Idli Recipe). దీనిని తీసుకోవడం వల్ల చక్కని రుచితో పాటు పిల్లల నుంచి పెద్దల వరకు అజీర్తి సమస్య మటుమాయం అవుతుంది. ఇంతటి ఆరోగ్యకరమైన రసం ఇడ్లీని తయారు చేసుకునే విధానంపై ఓ లుక్కేద్దామా?

తయారీ విధానం..

ముందుగా పాన్​లో ధనియాలు, కందిపప్పు, పచ్చి శనగపప్పు, మిరియాలు, ఎండుమిర్చి, జీలకర్ర, ఉప్పు వేసి డ్రై రోస్ట్​ చేసుకోవాలి. మిక్సీ పట్టి పొడిగా(idli podi) చేసుకోవాలి. బాగా కాగే పాన్​లో నూనె వేసుకొని ఆవాలు, జీలకర్ర, ఇంగువ, కరివేపాకు, వేసి కలుపుకోవాలి, తరువాత టమాటా ముక్కలు వేసి కొంచెం వేగాక.. పచ్చిమిర్చి, ఉప్పు, పుసుపు, చింతపండు రసం, నీళ్లు పోసుకొని.. ముందుగా పట్టి పెట్టిన పప్పుల మిశ్రమాన్ని వేసుకొని ఉండికించుకోవాలి. చివరిగా సర్వింగ్​ బౌల్​లో ఇడ్లీలు వేసుకొని... పై నుంచి రసం(rasam recipe) వేసుకొని కొత్తిమేరతో గార్నిష్​ చేసుకుంటే 'రసం ఇడ్లీ' రెడీ.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

కావాల్సిన పదార్థాలు..

  • ధనియాలు
  • ఎండు మిర్చి
  • మిరియాలు
  • కందిపప్పు
  • పచ్చి శనగపప్పు
  • జీలకర్ర
  • టమాటా ముక్కలు
  • చింతపండు రసం
  • పుసుపు
  • ఇంగువ
  • పచ్చిమిర్చి
  • నూనె
  • ఉప్పు
  • ఆవాలు
  • కరివేపాకు
  • కొత్తిమేర
  • ఇడ్లీలు

ఇదీ చూడండి: Chicken recipes: పసందైన చికెన్​ మిరియాల రసం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.