ETV Bharat / opinion

కారు చెప్పిన కిడ్నాప్ కథ..! చంపొద్దు, ఏదైనా చేయండి..! డీల్ వ్యవహారంలో ఊహించని మలుపు

author img

By

Published : Feb 25, 2023, 6:10 PM IST

కారు చెప్పిన కిడ్నాప్ కథ..!
కారు చెప్పిన కిడ్నాప్ కథ..!

POLICE FOILED THE KIDNAP PLAN : ఓ వ్యక్తిపై ఉన్న కోపంతో అతనిని కిడ్నాప్​ చేసి కాళ్లు, చేతులు విరిచేయడానికి ప్రయత్నించిన కుట్రను పోలీసులు భగ్నం చేెశారు. ఈ ఘటన వైఎస్సార్​ జిల్లాలో చోటుచేసుకుంది.

POLICE FOILED THE KIDNAP PLAN : ఓ వ్యక్తికి మరో వ్యక్తితో స్థలం విషయంలో గొడవ జరిగింది. దీంతో కక్ష పెంచుకున్న మొదటి వ్యక్తి.. అతడి కాళ్లు, చేతులు విరిచేసి దేనికి పనికి రాకుండా చేయాలనుకున్నాడు. అందుకు ఓ ముఠా సహాయం తీసుకున్నాడు. ముందుగా కిడ్నాప్ చేసి.. ఆ తరువాత తీవ్రంగా గాయపర్చాలని పన్నాగం పన్నారు. ఇందుకోసం కిడ్నాప్ కాంట్రాక్టు డీల్​ను కుదుర్చుకుని, దానిని అమలు చేసే ప్రణాళికను సిద్దం చేసుకున్నారు. ఈ కిడ్నాప్​కు కార్లో కూర్చొని స్కెచ్ వేసుకున్నారు. అందరు తలో ఐడియా ఇచ్చిన తర్వాత పక్కగా ఓ నిర్ణయానికి వచ్చారు.

ఎవరినైతే కిడ్నాప్ చేయాలని భావించారో.. ఆ వ్యక్తిపై రెక్కి నిర్వహించి.. అతను బయటికి వచ్చే సమయం, అలవాట్లు, తిరిగే ప్రదేశాలు, కలిసే మనుషులు ఇలా రెండు రోజుల పాటు అతనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోవడానికి అతని ఇంటిపై నిఘా పెట్టాలని డిసైడ్​ అయ్యారు. కార్లోనే కాంట్రాక్టు డీల్, ప్లాన్ అన్ని ఒకే కావడంతో.. కిడ్నాప్​ డేట్​ ఫిక్స్​ చేసుకున్నారు. ఈ రెండు రోజులు పట్టణంలోని ఓ లాడ్జ్​లో ఉండాలని నిర్ణయించుకున్నారు. కానీ అనుకుని ఓ సంఘటనతో వాళ్ల కథ అడ్డం తిరిగింది. ఇంతకీ ఏంటా సంఘటన అనుకుంటున్నారా.. ఇంకెందుకు ఆలస్యం కిందది చదివేయండి..

ఆంధ్రప్రదేశ్ వైఎస్సార్​ కడప జిల్లా కమలాపురానికి చెందిన ఇద్దరు వ్యక్తుల మధ్య స్థల వివాదం నెలకొంది. దీంతో కోపం పెంచుకున్న సదరు వ్యక్తి అతనిని అడ్డుతొలగించుకోవాలనుకున్నాడు. ఆ క్రమంలోనే ఓ ముఠాతో డీల్​ మాట్లాడుకున్నారు. డీల్​ కుదిరిన తర్వాత అతనిపై రెక్కీ పెట్టాలని డిసైడ్​ అయ్యి. పట్టణంలోని ఓ లాడ్జ్​లో ఓ గది అద్దెకు తీసుకున్నారు. అయితే ఎవరినైతే దాడి చేసి గాయపరచాలని అనుకున్నారో.. ఆ వ్యక్తే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బాధిత వ్యక్తి ఫిర్యాదు మేరకు.. కమలాపురంలోని లాడ్జ్​లో ముగ్గురిని, కారు వివరాల ఆధారంగా మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. గతంలో ఏమైనా హత్యాయత్నానికి పథకం వేశారా లేదా ఎవరినైనా హత్య చేశారా అనే కోణాల్లో కూడా పోలీసులు విచారణ చేస్తున్నారు. పూర్తి వివరాలు అనంతరం మీడియా ముందు ప్రవేశపెట్టనున్నట్లు సమాచారం. అయితే మీకు ఇక్కడ ఓ డౌట్​ వచ్చిందా.. కార్లో డీల్​ మాట్లాడుకుంటే బాధిత వ్యక్తికి ఎలా తెలిసింది అని.. కార్లో ఉన్న నలుగురు వ్యక్తుల్లో ఎవరో ఓ వ్యక్తి అతడికి సమాచారం ఇచ్చినట్లు తెలిసింది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.