ETV Bharat / lifestyle

Good Parenting: పెద్ద పిల్లలపైనా... ప్రేమను పంచండి!

author img

By

Published : Aug 8, 2021, 2:32 PM IST

కొత్తగా పాపాయి పుట్టినప్పుడు ఇంటిల్లపాదీ ప్రేమ, శ్రద్ధ... అంతా తనపైనే ఉంటుంది. వారికంటే పెద్దవారి ఆలనా పాలనా విషయంలోనూ జాగ్రత్త తీసుకోవాలి. లేదంటే... తమ ప్రాధాన్యం తగ్గిపోయిందని చిన్నబుచ్చుకోవచ్చు. మంకు పట్టుదలకు పోవచ్చు. తోడబుట్టిన వారిపై ద్వేషం పెంచుకోవచ్చు. అలాకాకూడదంటే...

Good Parenting tips in telugu
Good Parenting: పెద్ద పిల్లలపైనా... ప్రేమను పంచండి!

.

తనకు చెల్లో, తమ్ముడో వస్తున్నాడని చెబితే... చాలా ఉత్సాహంగా ఉంటారు పిల్లలు. అయితే ఈ అనుబంధాన్ని పాపాయి కడుపులో ఉన్నప్పటి నుంచే అందించండి. వారికి చిన్నప్పటి నుంచే బాధ్యతలు అప్పజెప్పండి. ‘చెల్లికి ఈ డ్రెస్‌ బాగుంటుందా. ఈ బొమ్మ నచ్చుతుందా’ వంటివి వారిని అడిగి తెలుసుకోండి. వారూ సంతోషిస్తారు.

తమకంటే చిన్నపిల్లలు కాబట్టే జాగ్రత్తగా చూసుకోవాలనీ, తననీ అలానే చూసుకున్నారనే విషయం అర్థమయ్యేలా వారి చిన్నప్పటి ఫోటోలను చూపించండి. పిల్లలు అర్థం చేసుకొని, అలవాటు పడటానికి కాస్త సమయం పడుతుంది. అందుకే నెమ్మదిగా వాళ్లను చిన్నవాళ్లకు చేరువ చేయండి.

బుజ్జాయితో ఎంత బిజీగా ఉన్నా... పెద్ద పిల్లలతోనూ కొంత సమయాన్ని గడపండి. వారి ఇష్టాయిష్టాలకు ప్రాధాన్యం ఇవ్వండి. నీకిచ్చే ప్రేమలో మార్పు లేదని అర్థమయ్యేలా చెప్పండి. తను చెప్పేవి ఒప్పిగ్గా వినండి. ఇవన్నీ వారి అభద్రతను దూరం చేస్తాయి.

ఇదీ చూడండి: అమ్మ ప్రేమను తిరిగి పంచండి.. లేకుంటే లావైపోతారు..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.