ETV Bharat / lifestyle

Beauty Tips: నిగనిగలాడే ఒత్తయిన కురులు మీకూ కావాలా..?

author img

By

Published : Jul 9, 2021, 9:22 AM IST

tips-for-long-and-thick-hair
నిగనిగలాడే ఒత్తయిన కురులు మీకూ కావాలా..?

అమ్మాయిల నుంచి మహిళల దాకా ప్రతి ఒక్కరికీ... ఒత్తయిన జుట్టు(THICK HAIR) కావాలని ఉంటుంది. మరి అలాంటి కురులు మీ సొంతం కావాలంటే ఏం చేయాలో తెలుసుకుందామా...

మీ కురులు ఒత్తుగా(THICK HAIR), పొడవుగా(LONG HAIR) పెరగాలన్నా... ఆరోగ్యంగా(HEALTHY HAIR) ఉండాలన్నా ఈ కింద సూచించే పద్ధతులను పాటిస్తే.. సరి.

మాడు, వెంట్రుకలను ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి..

  • దిండు గలేబులను తరచూ మార్చాలి. ఎందుకంటే జుట్టుకు ఉండే నూనె(HAIR OIL), చుండ్రు వీటిపై పడటమే కాకుండా తిరిగి మళ్లీ తలలోకే చేరే అవకాశం ఉంటుంది.
  • ఎక్కువ వేడిగా ఉన్న నీళ్లతో తలస్నానం చేయకండి. దీంతో చాలా ఇబ్బందులు వస్తాయి. మీ శరీర ఉష్ణోగ్రత కంటే కొద్దిగా వెచ్చగా ఉండే నీళ్లతో స్నానం చేయొచ్చు.
  • కొంతమంది తలస్నానం చేసిన తర్వాత జుట్టును టవల్‌తో గట్టిగా దులుపుతుంటారు. ఇలా చేస్తే వెంట్రుకలు రాలిపోతాయి.
  • జుట్టు తడిగా ఉన్నప్పుడు అస్సలు దువ్వకూడదు. ఇలా చేస్తే చిక్కులు పడిపోయి ఊడిపోతుంది.
  • మీ జుట్టు పొడిబారకుండా ఉండేందుకు ప్రతి ఆరు వారాలకు ఒకసారి జుట్టు చివరి భాగాలను కాస్త కత్తిరించుకోండి.

మర్దనలు, పూతలు....

  • ప్రొటీన్లు ఉండే గుడ్డుతో అప్పుడప్పుడూ పూత వేసుకుంటూ ఉంటే జుట్టు చక్కగా పెరుగుతుంది. అలాగే కొబ్బరి, బాదం, జొజొబా లాంటి నూనెలతో మర్దనా చేసుకోవాలి. అప్పుడు మాడుకు రక్తప్రసరణ బాగా జరిగి జుట్టు పెరుగుతుంది.
  • తలస్నానం చేసేటప్పుడు షాంపూ మాత్రమే సరిపోదు. కండిషనర్‌(CONDITIONERS) వాడాల్సిందే. ఎందుకంటే చాలా రకాల షాంపూలు మీ జుట్టులోని తేమను లాగేస్తాయి. కాబట్టి జుట్టుకు పోషణ, తేమ అందాలంటే కండిషనర్‌ కావాల్సిందే.

పైపూతలే కాదు.. ఆహారమూ అవసరమే..

  • జుట్టు ఒత్తుగా పెరగాలంటే పై పూతలే సరిపోవు. ఆహారం విషయంలోనూ శ్రద్ధ తీసుకోవాలి. మాంసకృత్తులు, విటమిన్లు, మినరల్స్‌ ఉండేలా చూసుకోవాలి.

1. విటమిన్​ ఎ: బంగాళా దుంప, క్యారెట్​, గుమ్మడికాయ, బచ్చలికూర, పాలు, గుడ్లు

2. విటమిన్​ బి: పప్పులు ముఖ్యంగా మినపపప్పు, శనగపప్పు, పెసరపప్పు, బాదం, మాంసం, చేపలు, పచ్చి ఆకుకూరలు

3. విటమిన్​ సి: స్ట్రాబెర్రీ, క్యాప్సికమ్​, సిట్రిక్​ అధికంగా పండ్లు, బత్తాయి, నారింజ, సీజనల్​ పండ్లు(ఉదా. మామిడి, సపోటా మొదలైనవి)

4. విటమిన్​ డి: చేపలు, కాడ్​ లివర్ ఆయిల్​, గుడ్డులోని పచ్చసొన, పుట్టగొడుగులు, బలవర్ధక ఆహారం

5. విటమిన్​ ఇ: పొద్దుతిరుగుడు విత్తనాలు, బాదం, బచ్చలికూర, పాలకూర, వేరుశెనగలు

6. జింక్​: బచ్చలికూర, పాలకూర, గుమ్మడి విత్తనాలు, గోధుమలు

7. ప్రోటీన్స్​: మాంసం, చేపలు, పాలు

కెఫీన్ కూడా జుట్టు పెరిగేలా చేస్తుంది..

  • రోజుకో కప్పు కాఫీ తాగడం వల్ల జుట్టు రాలే సమస్య తగ్గడంతో పాటు వెంట్రుకలు కూడా పెరుగుతాయి.
  • గ్రీన్ టీలో ఉండే పాలీఫెనాల్స్ కురుల పెరుగుదలను ప్రోత్సహిస్తాయి. కాబట్టి రోజుకి 1-2 సార్లు గ్రీన్ టీ తాగడం ద్వారా ప్రయోజనం పొందవచ్చు. కెఫీన్ ఎలర్జీ ఉన్నవారు, రక్తం గడ్డం కట్టకుండా మందులు వాడుతున్నవారు గ్రీన్ టీ తాగకూడదు.

ఇదీ చూడండి: నల్లగా.. ఒత్తుగా.. కురులు నిగనిగలాడగా!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.