ETV Bharat / lifestyle

Cereal Food Outlets in Telangana: ప్రైవేటు ఉత్పత్తులకన్నా తక్కువ ధరకే...

author img

By

Published : Sep 21, 2021, 6:54 AM IST

రాగులు, కొర్రలు, సామలు, ఊదలు, సజ్జలు తదితర పోషక తృణధాన్యాల ఆహారోత్పత్తుల (Nutritious cereal food products)ను నేరుగా విక్రయించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. ప్రైవేటు సంస్థలు అధిక ధరలకు అమ్ముతున్నట్లు సర్కారు దృష్టికి రావడంతో వాటికన్నా తక్కువ ధరలకే నాణ్యమైన ఆహారోత్పత్తులను ప్రజలకు చేరువ చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.

Cereal Food Outlets in Telangana
పోషక తృణధాన్యాల ఆహారోత్పత్తులు

రాజేంద్రనగర్‌లోని ‘భారత తృణధాన్యాల పరిశోధనా సంస్థ’ ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మిల్లెట్స్‌ రీసెర్చ్‌- ఐఐఎంఆర్‌ (Indian Institute of Millets Research)లో గల ‘న్యూట్రిహబ్‌ (NutriHub‌)’తో రాష్ట్ర వ్యవసాయ పరిశ్రమల అభివృద్ధి సంస్థ (State Agro-Industries Development Corporation)’(ఆగ్రోస్‌) తాజాగా ఒప్పందం చేసుకుంది. తృణధాన్యాల పంటలతో పలు రకాల ఆహారోత్పత్తుల తయారీకి అవసరమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఐఐఎంఆర్‌ (Indian Institute of Millets Research) అభివృద్ధి చేసింది. దేశవ్యాప్తంగా పలు ప్రైవేటు సంస్థలు ఈ పరిజ్ఞానాన్ని, ఆధునిక యంత్రాలపై హక్కులు తీసుకుని తృణధాన్యాలతో తయారుచేసిన ఆహారోత్పత్తులను విక్రయిస్తున్నాయి. న్యూట్రిహబ్‌ (NutriHub‌) ఉత్పత్తులకు ‘ఈట్‌ రైట్‌ (Eat Right)’ అనే బ్రాండును సైతం ఐఐఎంఆర్‌ (Indian Institute of Millets Research) సృష్టించింది. ఇదే బ్రాండు, ఈ సంస్థ పరిజ్ఞానాన్ని తీసుకుని తెలంగాణలో తృణధాన్యాల ఆహారోత్పత్తుల విక్రయ కేంద్రాలను (Cereal Food Outlets in Telangana) ఏర్పాటుచేయాలని ఆగ్రోస్‌ నిర్ణయించింది. బిస్కెట్లు, కేక్‌లు, ఇడ్లీలు, రొట్టెలు, వడియాలు తదితర అనేక రుచికరమైన ఆహారోత్పత్తులను ‘ఈట్‌ రైట్‌ (Eat Right)’ పేరుతో తయారుచేయనున్నారు. తొలిదశలో గ్రేటర్‌ హైదరాబాద్‌లోని 150 పురపాలక డివిజన్లలో 150 విక్రయ కేంద్రాలను ప్రభుత్వం త్వరలో ఏర్పాటు చేయనుంది. ప్రజలు ఎంత మేర కొనుగోలు చేస్తారు? నిర్వహణ సవాళ్లను పరిశీలించి మలిదశలో వరంగల్‌, కరీంనగర్‌, ఖమ్మం తదితర అన్ని పెద్ద పట్టణాల్లోనూ విక్రయ కేంద్రాల (Cereal Food Outlets in Telangana)ను తెరవాలని సంస్థ యోచిస్తోంది.

పేదలకు పోషకాహారం చేరువ చేయాలని..

మేనేజింగ్‌ డైరక్టర్‌, ఆగ్రోస్‌

పేదలకు పోషక ఆహారాన్ని చేరువ చేయాలనే ప్రభుత్వ సంకల్పంతో ఈ విక్రయ కేంద్రాలను ప్రారంభిస్తున్నాం. ఇటీవల వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి స్వయంగా ఐఐఎంఆర్‌ (Indian Institute of Millets Research)ను సందర్శించి ఆహారోత్పత్తుల తయారీ గురించి తెలుసుకున్నారు. రాష్ట్రలోని ప్రతి ఒక్కరూ తమ నిత్య ఆహారంలో ఈ ఉత్పత్తులను భాగంగా చేసుకుంటే వారి ఆరోగ్యానికి మేలు జరగడమే కాకుండా తృణధాన్యాల పంటలు సాగుచేసే రైతులకు ఆదాయం పెరుగుతుంది. వరి సాగు తగ్గించి ఈ పంటలు పండించే రైతులను ప్రోత్సహించాలనేది ప్రభుత్వ సంకల్పం. ఇందుకు అనుగుణంగా ఆగ్రోస్‌ ఈ పంటలను కొని ఆహారోత్పత్తులు తయారుచేసే ప్రైవేటు సంస్థలతో ఒప్పందాలు చేసుకుని విక్రయ కేంద్రాలకు సరఫరా చేయనుంది. జయశంకర్‌ వర్సిటీలోని తృణధాన్యాల విభాగంతో కూడా త్వరలో ఒప్పందం చేసుకుని మరిన్ని రకాల ఉత్పత్తులను గురుకుల పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలకు సరఫరా చేయాలని ప్రణాళిక సిద్ధం చేస్తున్నాం.

- కె.రాములు, మేనేజింగ్‌ డైరక్టర్‌, ఆగ్రోస్‌

అమ్మాయిలకు స్వయం ఉపాధి

ఈ కేంద్రాల ద్వారా నిరుద్యోగ యువతులకు స్వయం ఉపాధి కల్పించాలని ఆగ్రోస్‌ నిర్ణయించింది. ఆచార్య జయశంకర్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయానికి చెందిన గృహ విజ్ఞానశాస్త్రం(హోంసైన్స్‌), ‘ఆహారశాస్త్రం(ఫుడ్‌ టెక్నాలజీ) పట్టభద్రులైన అమ్మాయిలతో ఈ కేంద్రాలను ఏర్పాటు చేయిస్తారు. ఆ వనితల వివరాలు ఇవ్వాలని వర్సిటీ కాలేజీలకు ఇటీవల ఆగ్రోస్‌ లేఖ రాసింది. వీరిలో ఆసక్తి ఉన్నవారిని వాణిజ్యవేత్తలుగా తీర్చిదిద్దనున్నారు. హెచ్‌పీసీఎల్‌, బీపీసీఎల్‌ పెట్రోల్‌ బంకుల్లో ఈ విక్రయ కేంద్రాల ఏర్పాటుకు స్థలాలను కేటాయించాలని ఈ సంస్థలకు కూడా ఆగ్రోస్‌ లేఖ రాసింది. ఈ ఉత్పత్తులపై తయారీదారులు, ప్రజలకు అవగాహన కల్పించేందుకు అక్టోబరు మొదటివారంలో రాష్ట్రస్థాయి అవగాహన సదస్సు నిర్వహించనుంది.

ఇదీ చూడండి: గుప్పెడు గింజలతో గంపెడు ఆరోగ్యం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.