ETV Bharat / jagte-raho

తహసీల్దార్​ కార్యాలయంలో ఒంటిపై పెట్రోల్​​ పోసుకున్న మహిళ

author img

By

Published : Nov 11, 2020, 6:31 PM IST

Updated : Nov 12, 2020, 10:53 AM IST

తహసీల్దార్​ కార్యాలయంలో ఆత్మహత్యకు యత్నించిన మహిళ
తహసీల్దార్​ కార్యాలయంలో ఆత్మహత్యకు యత్నించిన మహిళ

మెదక్ జిల్లా హవేలీ ఘనపూర్ తహసీల్దార్​ కార్యాలయం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. తన భూమి వివరాలను అధికారులు పాసుపుస్తకంలో నమోదు చేయడంలేదని తహసీల్దార్ కార్యాలయంలో ఒంటిపై కిరోసిన్ పోసుకుంది ఓ మహిళ. నాలుగేళ్లుగా అధికారులు చుట్టూ కాళ్లరిగేలా తిరిగినా పట్టించుకోలేదని మనస్తాపంతో ఆత్మహత్యకు యత్నించడం కలకలం రేపింది.

భూమి పట్టా చేస్తలేరని తహసీల్దార్​ కార్యాలయంలో ఒంటిపై పెట్రోల్​​ పోసుకుని ఓ మహిళ ఆత్మహత్యకు యత్నించింది. మెదక్ జిల్లా హవేలీ ఘనపూర్ తహసీల్దార్​ కార్యాలయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. తిమ్మాయిపల్లి గ్రామానికి చెందిన బోయిని మంజులకు గ్రామ శివారులో 12 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. అయితే దీనికి సంబంధించిన పట్టాదారు పాస్​పుస్తకంలో మాత్రం ఐదు ఎకరాలను మాత్రమే అధికారులు నమోదు చేశారు. మిగిలిన ఏడెకరాల భూమిని కూడా పట్టా చేయాలని నాలుగేళ్లుగా అధికారుల చుట్టూ కాళ్లరిగేలా తిరిగినా ఫలితంలేదని మంజుల వాపోయారు.

తహసీల్దార్​ కార్యాలయంలో ఒంటిపై పెట్రోల్​​ పోసుకున్న మహిళ

అధికారుల తీరులో తీవ్ర మనస్తాపానికి గురైన మంజుల బుధవారం తహసీల్దార్​ కార్యాలయానికి వచ్చి ఒంటిపై పెట్రోల్​​ ​ పోసుకుంది. ఈ క్రమంలోనే బాధితురాలు మంజుల తహసీల్దార్​తో వాగ్వాదానికి కూడా దిగారు. విషయం తెలుసుకున్న హవేలీ ఘనపూర్​ ఎస్​ఐ తహసీల్దార్​ కార్యాలయానికి చేరుకొని మంజులకు నచ్చచెప్పి పోలీస్​స్టేషన్​కు తరలించారు. అనంతరం అక్కడ కౌన్సిలింగ్​ నిర్వహించారు.

విషయంపై తహసీల్దార్​ వెంకటేశంను వివరణ కోరగా ఆమెకు ఎలాంటి భూమి లేదని, భూ ప్రక్షాళనలో భాగంగా ఎక్కువగా ఉన్న భూమిని పాస్​బుక్​ నుంచి తొలగించడం జరిగిందన్నారు. తనపై కావాలనే మంజుల అనవసరమైన ఆరోపణలు చేస్తున్నారని అన్నారు.

ఇవీ చూడండి:జల్సాలతో అప్పుల పాలయ్యాడు... చివరకు ప్రాణాలు తీసుకున్నాడు

Last Updated :Nov 12, 2020, 10:53 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.