ETV Bharat / jagte-raho

పోలీసులు పట్టించుకోలేదని మహిళ ఆత్మహత్యాయత్నం

author img

By

Published : Aug 24, 2020, 5:12 PM IST

భర్తపై కేసు పెట్టినప్పటికీ పోలీసులు పట్టించుకోవడం లేదని మనస్తాపం చెందిన ఓ మహిళ నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఈ ఘటన మేడ్చల్​ జిల్లా కుషాయిగూడ పోలీస్​ స్టేషన్ ఎదుట జరిగింది.

women-suicide-attempt-in-front-of-kushaiguda-police-station-medchal-district
పోలీసులు పట్టించుకోలేదని మహిళ ఆత్మహత్యాయత్నం

మేడ్చల్ జిల్లా కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని నాగార్జున నగర్ కాలనీలో నివాసముంటున్న దంపతులు సంతోశ్​ గుప్తా- స్వాతి.. కొంతకాలంగా గొడవలు పడుతున్నారు. వేధింపులు తాళలేక మూడు రోజుల క్రితమే స్వాతి తన భర్తపై స్థానిక పీఎస్​లో ఫిర్యాదు చేయగా... వివిధ సెక్షన్ల కింద అతనిపై కేసులు నమోదు చేశారు కాని అరెస్ట్​ చేయలేదు. పోలీసుల తీరుతో మనస్తాపం చెందిన బాధితురాలు పోలీస్​ స్టేషన్​ ముందే నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డింది. గమనించిన పోలీసులు వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించారు.

మూడు రోజులుగా పీఎస్​ చుట్టు తిరుగుతున్నా పోలీసులు స్పందించకపోవడం వల్లే స్వాతి ఆత్మహత్యకు యత్నించారని కంట్రోల్ క్రైమ్ ఇన్ఫర్మేషన్ డిటెక్టివ్ ఏజెన్సీ ఛైర్​పర్సన్​ పావని ఆరోపించారు. నిత్యం వేధింపులకు గురిచేస్తున్న గుప్తాను వెంటనే అరెస్ట్​ చేయాలని డిమాండ్​ చేశారు.

ఇదీ చూడండి: ద్విచక్రవాహనాన్ని ఢీ కొట్టిన కారు.. నిందితులు పరార్

Woman commits suicide case ignored by police

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.