ETV Bharat / jagte-raho

మల్కాపూర్​ పెద్ద చెరువులో మూడేళ్ల చిన్నారి మృతదేహం లభ్యం

author img

By

Published : Nov 15, 2020, 5:49 PM IST

three years old baby dead body found in sangareddy district malkarup pedda cheruvu
మల్కాపూర్​ పెద్ద చెరువులో మూడేళ్ల చిన్నారి మృతదేహం లభ్యం

మల్కాపూర్​ పెద్దచెరువులో మూడేళ్ల చిన్నారి మృతదేహం లభించింది. పాప ప్రమాదవశాత్తు పడి చనిపోయిందా లేక ఎవరైనా చెరువులో పడేసి చంపేశారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం మల్కాపూర్ పెద్ద చెరువులో 3 సంవత్సరాల పాప మృత దేహం లభ్యమైంది. పాప అదే గ్రామానికి చెందిన కటిక కుర్బుగా గ్రామస్థులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు.

ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు బాలిక మృతదేహాన్ని సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. పాప మృతికి కారణాలేంటని తెలియాల్సి ఉందని కొండాపూర్ ఎస్సై రాజు తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తామన్నారు.

ఇదీ చూడండి: ఉద్యోగం రాలేదన్న మనస్తాపంతో యువకుడు ఆత్మహత్య

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.