ETV Bharat / jagte-raho

రైతు ఖాతా నుంచి డబ్బు మాయం చేసిన సైబర్‌ నేరగాళ్లు

author img

By

Published : Jan 29, 2021, 8:40 PM IST

ఓ రైతు ఖాతా నుంచి తన ప్రమేయం లేకుండా డబ్బు విత్ డ్రా అయినా ఘటన జోగులాంబ గద్వాల్ జిల్లాలో చోటుచేసుకుంది. బాధిత రైతు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

farmer withdrew money from his account without his involvement.
రైతు ఖాతా నుంచి డబ్బు మాయం చేసిన సైబర్‌ నేరగాళ్లు

జోగులాంబ గద్వాల్ జిల్లాలో ఓ రైతు ఖాతా నుంచి తన ప్రమేయం లేకుండా డబ్బు విత్ డ్రా అయింది. మానవపాడు మండలం చేన్నిపాడుకు చెందిన సోమశేఖర్ ఇటీవల పత్తి పంటను విక్రయించారు. ఈ నెల 26న తన ఖాతాలో రూ. 2,77,000 జమ అయ్యాయని చరవాణికి సందేశం వచ్చింది.

బ్యాంకు వెళ్లి ఆరా తీయగా మూడు నిముషాలు వ్యవధిలో 21 సార్లు డబ్బు డ్రా అయినట్లు తేలింది. శేఖర్‌కు పది నెలల క్రితం మానవపాడు ఎస్‌బీఐ బ్యాంకు నుంచి మాట్లాడుతున్నామంటూ ఏటీయం పిన్ నంబర్ చెప్పాలని అడగటంతో చెప్పినట్లు తెలిపారు. బాధిత రైతు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

ఇదీ చదవండి: యూపీలో కిసాన్​ మహాపంచాయత్​- వేల మంది హాజరు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.