ETV Bharat / jagte-raho

మసాజ్ ముసుగులో వ్యభిచారం.. ఓ ముఠా గుట్టు రట్టు

author img

By

Published : Jan 9, 2021, 11:52 AM IST

raids-at-massage-center-at-advocate-colony-ac-guards-hyderabad
మసాజ్ ముసుగులో వ్యభిచారం.. ఓ ముఠా గుట్టు రట్టు

మసాజ్ ముసుగులో వ్యభిచారం నిర్వహిస్తోన్న ఓ ముఠా గుట్టును హైదరాబాద్ సైఫాబాద్ పోలీసులు రట్టు చేశారు. విటులతో పాటు అమ్మాయిలను, నిర్వాహకురాలిని అదుపులోకి తీసుకున్నామని డీఐ రాజు నాయక్ తెలిపారు. నిందితుల నుంచి 5 సెల్‌ఫోన్లు, నగదు, స్వైపింగ్ యంత్రాన్ని స్వాధీనం చేసుకున్నారు.

మసాజ్ సెంటర్ ముసుగుతో వ్యభిచారం జరుగుతోందని పోలీసులకు అందిన విశ్వసనీయ సమాచారంతో.. సైఫాబాద్ పోలీసులు అర్ధరాత్రి సమయంలో దాడి నిర్వహించారు. 'అట్లాంటిక్ హాస్పిటాలిటీ ఫిజియోథెరఫీ క్లినిక్' పేరిట ఏసీ గార్డ్ అడ్వకేట్ కాలనీలోని ఖురేషి టవర్స్ 202లో నిర్వహిస్తున్న ఈ 'అదోరకం' మసాజ్ కేంద్రంపై పోలీసులు తనిఖీలు చేపట్టారు. విటులతో పాటు అమ్మాయిలను, నిర్వాహకురాలిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

నిర్వాహకురాలు మెహరాజున్నీసా(45) గతంలో మెహదీపట్నంలోని ఓ మసాజ్ సెంటర్‌లో రిసెప్షనిస్ట్​గా పనిచేసేది. ఆ సెంటర్​ యజమాని.. దానిని అమ్మివేయడంతో మెహరాజున్నీసా కొనుగోలు చేసింది. అక్కడి నుంచే మసాజ్ పేరిట వ్యభిచారం నిర్వహించిన ఆమె.. అక్కడి నుంచి సెంటర్‌ను ఏసీ గార్డ్​కు మార్చారని పోలీసులు తెలిపారు. నిందితుల నుంచి 5 సెల్‌ఫోన్లు, నగదు, స్వైపింగ్ యంత్రాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు.. మెజిస్ట్రేట్ ముందు హాజరు పరిచారు.

ఇదీ చూడండి: క్లిక్‌ చేస్తే చాలు.. మాయచేసి ఉచ్చులోకి దించుతారు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.