ETV Bharat / jagte-raho

ధరూర్​లో రెండు ద్విచక్ర వాహనాలు ఢీ.. యువకుడు మృతి

author img

By

Published : Jul 26, 2020, 10:28 AM IST

జగిత్యాల జిల్లా ధరూర్​ మండలంలో రోడ్డు ప్రమాదం సంభవించింది. రెండు ద్విచక్రవాహనాలు ఢీకొన్న ఘటనలో ఒక యువకుడు మృతి చెందగా.. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.

one died in road accident in dharur when two bikes hit
ధరూర్​లో రెండు ద్విచక్రవాహనాలు ఢీ

జగిత్యాల జిల్లా ధరూర్​ మండలంలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. టీఆర్​ నగర్​కు చెందిన రోహిత్​ స్నేహితుడు విగ్నేశ్​తో కలిసి జగిత్యాల నుంచి ద్విచక్ర వాహనంపై ఇంటికి వెళ్తుండగా.. ఎదురుగా వస్తున్న మరో ద్విచక్రవాహనం ఢీకొట్టింది.

ఈ ఘటనలో రోహిత్ అక్కడికక్కడే మృతి చెందగా.. మరో ఇద్దరు యువకులు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను కరీంనగర్​కు ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న జగిత్యాల ట్రాఫిక్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.