ETV Bharat / jagte-raho

ఆడపిల్లలు పుట్టడం.. ఆ ఇల్లాలికి శాపమైంది!

author img

By

Published : Nov 25, 2020, 7:14 PM IST

మెుదటి కాన్పులో ఆడపిల్ల పుట్టింది.. భర్త చిత్రహింసలు పెట్టాడు.. తట్టుకుంది.. రెండో కాన్పులోనూ ఆడపిల్లే పుట్టింది. మళ్లీ ఆడపిల్లేనా.. అంటూ విచక్షణ కోల్పోయిన ఆ భర్త.. భార్యతో కర్కశంగా వ్యవహరించాడు. దీంతో అప్పుడే పుట్టిన బిడ్డను పొత్తిళ్లలో పెట్టుకుని.. రోడ్డుపై బిక్కుబిక్కుమంటూ కూర్చొంది ఆ తల్లి.

husband harassment wife because of children's
ఆడపిల్లలు పుట్టడం.. ఆ ఇల్లాలికి శాపమైంది!

బాలింతను ఇంట్లో బందించి.. తన మానవత్వాన్ని కోల్పోయాడో భర్త. ఇద్దరు ఆడపిల్లలేనా? అంటూ.. విచక్షణ కోల్పోయి.. అపస్మారకస్థితిలోకి వెళ్లేలా కొట్టాడు. విడాకులపై సంతకం చేయాలంటూ.. బెదిరించాడు. తనను చంపాలని చూస్తున్నారని ఆ బాలింత కన్నీరుమున్నీరవుతోంది.

ఏపీ అనంతపురంలోని నాయక్​ నగర్​లో నివాసం ఉండే లక్ష్మీదేవిని తన భర్త జగన్ నాయక్​ ఐదు రోజులుగా చిత్రహింసలకు గురిచేస్తున్నాడు. ఇంటిలో నిర్బంధించి.. బాలింత అని కూడా చూడకుండా కొట్టడంతో లక్ష్మీదేవి అపస్మారక స్థితిలో పడిపోయింది. ఆడపిల్ల పుట్టిందని ఇంటి నుంచి వెళ్లిపోవాలని.. విడాకుల పత్రంపై సంతకం చేయాలని బెదిరిస్తున్నారని మహిళ ఆవేదన వ్యక్తం చేసింది. బాధితురాలు లక్ష్మీదేవి సమాచారంతో అక్కడికి చేరుకున్న పోలీసులు.. భర్త, అత్తమామలను పోలీస్ స్టేషన్​కు తరలించారు. లక్ష్మీదేవిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు.

లక్ష్మీదేవికి జగన్ నాయక్​తో పెళ్లి అయినప్పటి నుంచి వేధింపులే. మెుదట ఆడపిల్ల పుట్టిందని చిత్రహింసలకు గురి చేశాడు. బిడ్డను తీసుకుని.. పుట్టింటికి వెళ్లిపోవాలని ఒత్తిడి చేసేవాడు. ఈ విషయం గురించి లక్ష్మీదేవి అప్పుడే పోలీసులకు ఫిర్యాదు చేయగా.. పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చి పంపించారు. ఇప్పుడు మళ్లీ రెండో కాన్పులో ఆడపిల్ల పుట్టిందని తన భర్త, అత్తమామలు వేధింపులు మెుదలుపెట్టారు. తనను చంపాలని చూస్తున్నారని లక్ష్మీదేవి చెబుతోంది. తన మామ శంకర్ నాయక్ ఏఎస్ఐగా పని చేస్తున్నారని తెలిపింది. బాధితురాలు తనకు ఫోన్లో ఫిర్యాదు చేసిందని బాధితురాలిని.. రక్షించి.. ఆస్పత్రికి తరలించామని సీఐ జాకీర్ హుస్సేన్ వెల్లడించారు. భర్త, అత్తమామలపై కేసు నమోదు చేసి విచారణ కొనసాగిస్తున్నామని తెలిపారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.