ETV Bharat / jagte-raho

సంతోషంగా వెళ్లి... విషాదంతో తిరిగి వచ్చారు

author img

By

Published : Jan 16, 2021, 10:10 PM IST

తమ ఇంటికి వచ్చిన బంధువులతో ఓ కుటుంబం సరదాగా ఓ వాగుకు వెళ్లారు. ఈ నేపథ్యంలో అక్కడ ఒక్కసారిగా విషాదం చోటుచేసుకుంది. స్నానం కోసం వెళ్లిన ఇద్దరు పిల్లలు తిరిగిరాని లోకాలకు చేరారు. లోతు గమనించక వాగులోకి వెళ్లి మృత్యువాత చెందారు. ఈ ఘటన ములుగు జిల్లాలో జరిగింది.

Happily gone tour came with tragedy in mulugu district
సంతోషంగా వెళ్లి... విషాదంతో తిరిగి వచ్చారు

ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం జంపన్న వాగులో ఈతకు వెళ్లిన ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. జాహ్నవి(11), హేమంత్(9) మేడారానికి చెందిన సంపత్ రెడ్డి-అనితల పిల్లలు. భూపాలపల్లి జిల్లాకు చెందిన తమ బంధువులు ఇంటికి రావడంతో కలిసి ఊరట్టం బ్రిడ్జికి పర్యటకానికి వెళ్లారు.

ఈ తరుణంలో వాగులో ప్రవహిస్తున్న నీటిలో స్నానం చేసేందుకు బంధువుల పిల్లలతో కలిసి జాహ్నవి, హేమంత్ ఈతకు వెళ్లారు. లోతును గమనించకుండా జాహ్నవి ఒకసారి మునిగిపోయిందని.. కాసేపట్లో ఆమె వెనకాలే హేమంత్ కనిపంచకుండా పోయాడని బంధువులు వాపోయారు. సంపత్ రెడ్డి-అనితల ఇద్దరు పిల్లలు వాగులో మునిగి మరణించడం వల్ల తల్లిదండ్రులు బోరున విలపించారు. ఈ ఘటనతో ఆ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

ఇదీ చూడండి : కరడుగట్టిన నేరస్థుడు బాఖర్‌ అలీ అరెస్టు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.