ETV Bharat / jagte-raho

భూతవైద్యం పేరుతో చిత్రహింసలు.. ప్రాణాపాయ స్థితిలో బాధితురాలు

author img

By

Published : Aug 1, 2020, 3:36 PM IST

Updated : Aug 2, 2020, 7:14 AM IST

కరీంనగర్ జిల్లా గద్దపాకకు చెందిన ఓ యువతిని మాయమాటలతో నమ్మించి వివాహం చేసుకోకుండానే ఓ బిడ్డకు జన్మనిచ్చాడు. తర్వాత భూతవైద్య పేరుతో ఆ అమ్మాయిని అపస్మారక స్థితికి పంపించారు. ప్రస్తుతం ఆమె ప్రాణాపాయ స్థితిలో ఉందని.. తనకు వైద్యం అందించేందుకు చొరవ చూపాలని ఆమెను కాపాడిన పలువురు కోరుతున్నారు.

భూతవైద్యం పేరుతో చిత్రహింసలు.. ప్రాణాపాయ స్థితిలో బాధితురాలు
భూతవైద్యం పేరుతో చిత్రహింసలు.. ప్రాణాపాయ స్థితిలో బాధితురాలు

భూతవైద్యం పేరుతో చిత్రహింసలు.. ప్రాణాపాయ స్థితిలో బాధితురాలు

కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం గద్దపాకలో ఓ యువతికి అమ్మానాన్న చిన్నప్పుడే చనిపోయారు. అయినా ఆమె కష్టపడి ఉన్నత విద్యను అభ్యసించింది. ఉన్నత శిఖరాలను అధిరోహించాలనుకుంది. హైదరాబాద్​లో ప్రైవేటు ఉద్యోగం చేస్తున్న ఆమెను మంచిర్యాల జిల్లాకు చెందిన మల్లేష్​ పరిచయమయ్యాడు. ప్రేమిస్తున్నానని ఆ యువతిని బుట్టలో వేసుకున్నాడు. వివాహం కాకుండానే ఆమె ఓ బిడ్డకు జన్మనిచ్చింది.

రెండు నెలల పసికందు ఉన్నాడని చూడకుండా.. మల్లేష్, అతని కుటుంబసభ్యులు కలిసి ఆ యువతిని భూతవైద్యం పేరిట చిత్రహింసలకు గురిచేశారు. అత్యుత్సాహంతో భూతవైద్యుడు చేసిన ప్రయత్నం వికటించింది. ఆమె చిన్నమెదడుకు గాయమైంది. ఆ యువతి అపస్మార స్థితిలో చేరుకోగా.. ఇది గమనించి భీం ఆర్మీ తెలంగాణ చీఫ్ సెక్రటరీ వాసాల శ్రీనివాస్.. ఆమెను చికిత్స నిమిత్తం కరీంనగర్‌లోని ప్రతిమ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించేందుకు చొరవ చూపించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి దయనీయంగా మారింది. యువతిని చిత్రహింసలకు గురి చేసిన ఆ నిందితులను కఠినంగా శిక్షించాలని యువతీ బంధువులు అధికారులను కోరుతున్నారు. బాధితురాలికి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఈ సంఘటనపై దర్యాప్తు ప్రారంభించారు. జైపూర్‌కు చెందిన ఓ పోలీసు బృందం సదరు భూత వైద్యుడిని పట్టుకునేందుకు కరీంనగర్ జిల్లాకు చేరుకుంది. కరీంనగర్‌ జిల్లా శంకరపట్నం, జమ్మికుంట పోలీసులు సదరు భూత వైద్యుడు శ్యాంను అదుపులోకి తీసుకొని జైపూర్‌ పోలీసులకు అప్పగించినట్లు సమాచారం.

ఆమెను మోసం చేసన మల్లేష్‌ను పట్టుకున్నప్పటికీ తప్పించుకొని తిరుగుతున్నాడని శ్రీనివాస్‌ ఆరోపించారు. బాధితురాలికి వైద్యం అందించేందుకు చొరవ చూపాలని ఆయన కోరుతున్నారు. సదరు యువతి జీవితంతో చెలగాటమాడిన మల్లేష్‌పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను కోరుతున్నారు.

ఇవీ చూడండి: చిట్టితల్లికి కొండంత వేదన... చేయూత కోసం తల్లిదండ్రుల అభ్యర్థన

Last Updated :Aug 2, 2020, 7:14 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.