ETV Bharat / jagte-raho

పాన్ కార్డుతో నకిలీ వైద్యుడి గుట్టురట్టు

author img

By

Published : Feb 8, 2021, 6:20 PM IST

fake-doctor-arrested-by-kphb-police-in-hyderabad
పాన్ కార్డుతో నకిలీ వైద్యుడి గుట్టురట్టు

తన పేరుకు దగ్గర్లో ఉన్న ఓ వైద్యుడి ధ్రువపత్రాలను అంతర్జాలంలో సేకరించాడు ఓ వ్యక్తి. నకిలీ ఆధార్ కార్డు, పాన్ కార్డు సంపాదించి వైద్యుడిగా చెలామణి అవుతున్నాడు. కట్​ చేస్తే పాన్ కార్డుతో నకిలీ వైద్యుడి అసలు రంగు బయటపడింది.

మెడికల్ కౌన్సిల్​లో రిజిస్టర్ అయిన డాక్టర్ పేరుతో నకిలీ ధ్రువపత్రాల సృష్టించి వైద్య వృత్తిని కొనసాగిస్తున్న మోసగాడిని కేపీహెచ్​బీ పోలీసులు అరెస్టు చేశారు. ఆంధ్రప్రదేశ్​లోని విశాఖపట్నం జిల్లాకు చెందిన మంగం కిరణ్ కుమార్ ఓ ఆయుర్వేద వైద్యుడి వద్ద కాంపౌండర్​గా పని చేశాడు. 2013లో సొంతంగా ఓ క్లినిక్ ఏర్పాటు చేసుకున్నాడు.

ఇందుకోసం హైదరాబాద్​కు చెందిన డాక్టర్ ముక్కు కిరణ్ కుమార్ ధ్రువపత్రాలను అంతర్జాలం ద్వారా సేకరించి... నకిలీ ఆధార్ కార్డు, పాన్ కార్డులను సంపాదించాడు. నకిలీ ధ్రువపత్రాలతో ఏపీలోని పలు ఆస్పత్రుల్లో వైద్యుడిగా పని చేశాడు. పాన్ కార్డు కోసం హైదరాబాద్​కు చెందిన డా.ముక్కు కిరణ్ కుమార్ దరఖాస్తు చేసుకోగా... అప్పటికే తన పేరుపై పాన్ కార్డు జారీ అయిందని తెలుసుకొని కేపీహెచ్​బీ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అలా నకిలీ వైద్యుడి అసలు విషయం బయటపడింది. నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్​కు తరలించినట్లు కూకట్​పల్లి సీఐ లక్ష్మీనారాయణ తెలిపారు.

ఇదీ చదవండి: దొంగల బీభత్సం.. ఏటీఎంలో చోరీకి విఫలయత్నం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.