ETV Bharat / jagte-raho

బెట్టింగ్​ జోలికి పోవద్దు... ఆర్థికంగా నష్టపోవద్దు: సీపీ సజ్జనార్​

author img

By

Published : Oct 5, 2020, 8:21 PM IST

బెట్టింగ్ వ్యసనం బారిన పడి ఆర్థికంగా నష్టపోవద్దని సైబరాబాద్ సీపీ సజ్జనార్ సూచించారు. కొంత మంది యువత ఐపీఎల్ క్రికెట్ మ్యాచులలో బెట్టింగ్ పెడుతున్నారని పేర్కొన్నారు. పేట్ బషీర్​బాద్ పీఎస్ పరిధిలోని ఓంకార్ ఆప్టికల్స్​లో క్రికెట్​ బెట్టింగ్ నిర్వహిస్తున్న ముఠాను ఎస్ఓటీ పోలీసులు అరెస్ట్ చేశారు.

cricket betting gang arrested
బెట్టింగ్​ జోలికి పోవద్దు... ఆర్థికంగా నష్టపోవద్దు: సీపీ సజ్జనార్​

బెట్టింగ్​ వ్యసనానికి బానిస కావొద్దని సైబరాబాద్​ సీపీ సజ్జనార్​ సూచించారు. బెట్టింగ్​ల వల్ల బుకీలే లాభపడతారని పేర్కొన్నారు. పేట్ బషీరాబాద్ ఠాణా పరిధిలోని ఓంకార్ ఆప్టికల్స్​లో బెట్టింగ్ నిర్వహిస్తున్న ముఠాను ఎస్ఓటీ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి రూ.22లక్షలకు పైగా నగదు, 8 చరవాణిలు స్వాధీనం చేసుకొన్నారు. వారి బ్యాంకు ఖాతాలోని రూ.13లక్షల నగదును జప్తు చేశారు. పరారీలో ఉన్న మరో 9మంది కోసం పోలీసులు గాలిస్తున్నారు.

గత 20 రోజులుగా బెట్టింగ్​పై ప్రత్యేక నిఘా ఉంచామని సీపీ సజ్జనార్​ పేర్కొన్నారు. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఈ సీజన్​లో ఇప్పటి వరకు 7 కేసులు నమోదయ్యాయని తెలిపారు. రూ.40లక్షలకు పైగా స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. తల్లిదండ్రులు తమ పిల్లలపై నిఘా పెట్టి.. బెట్టింగుల వైపు వెళ్లకుండా చూడాలని సజ్జనార్ సూచించారు.

ఇదీ చూడండి: ఎస్బీఐ ఏటీఎం చోరీ.. 15 లక్షలు అపహరణ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.