ETV Bharat / jagte-raho

టీ దుకాణంలోకి దూసుకెళ్లిన కారు.. తప్పిన ప్రమాదం

author img

By

Published : Dec 20, 2020, 10:53 AM IST

అతి వేగంతో అదుపు తప్పిన ఓ కారు టీ దుకాణంలోకి దూసుకెళ్లింది. ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడం వల్ల అంతా ఊపిరి పీల్చుకున్నారు.

car accident at vt colony in nalgonda district
టీ దుకాణంలోకి దూసుకెళ్లిన కారు.. తప్పిన ప్రమాదం

నల్గొండ జిల్లా కేంద్రంలోని వీటీ కాలనీలో రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. అతి వేగంతో అదుపు తప్పిన ఓ కారు.. రోడ్డు పక్కన ఉన్న టీ దుకాణంలోకి దూసుకెళ్లింది. ప్రమాదంలో కారు డ్రైవర్​కు స్వల్ప గాయాలయ్యాయి.

స్థానికులు క్షతగాత్రుడిని ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ఘటన సమయంలో టీ స్టాల్ వద్ద రద్దీ లేకపోవడం వల్ల పెను ప్రమాదం తప్పింది.

ఇదీ చూడండి: వైద్యుల నిర్లక్ష్యం: బస్టాండ్​లో మృతి చెందిన మహిళ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.