ETV Bharat / jagte-raho

రామగుండం బొగ్గు గనిలో ప్రమాదం.. ఒకరు దుర్మరణం

author img

By

Published : Oct 29, 2020, 4:53 PM IST

Updated : Oct 29, 2020, 11:48 PM IST

singareni
singareni

16:48 October 29

రామగుండం బొగ్గు గనిలో ప్రమాదం.. ఒకరు దుర్మరణం

రామగుండం బొగ్గు గనిలో ప్రమాదం.. ఒకరు దుర్మరణం

పెద్దపల్లి జిల్లా రామగుండం సింగరేణి  రీజియన్ ఆర్జీ-2  ఏరియా వకీల్ పల్లి బొగ్గు గనిలో ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఒక కార్మికుడు మృతి చెందగా.. ముగ్గురు కార్మికులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు.    

బొగ్గు పొరల కింద కూరుకుపోయి..

వకీల్​ పల్లి బొగ్గు గనిలో మొదటి షిప్టు 41 డీప్ 65 వ లెవల్ జంక్షన్ వద్ద పని స్థలంలో ఒక్కసారిగా గనిపై కప్పు కూలింది. అక్కడే విధులు నిర్వహిస్తున్న నవీన్ అనే ఓవర్ మెన్​పై కప్పు కూలడం వల్ల బొగ్గు పొరల కింద కూరుకుపోయి చనిపోయాడు. ఈ ఘటనలో మరో ముగ్గురు కార్మికులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. వారిని తోటి కార్మికులు గోదావరి ఖనిలో సింగరేణి ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. 

బాధ్యులపై చర్యలు తీసుకోవాలి..

ప్రమాదంలో చనిపోయిన కార్మికుడి నవీన్​ మృతదేహాన్ని బయటికి తీసేందుకు సింగరేణి రెస్క్యూ టీం రంగలోకి దిగింది. అధికారుల నిర్లక్ష్యం, రక్షణ చర్యలు పాటించక పోవడం వల్లే ప్రమాదం జరిగిందని కార్మిక సంఘాల నాయకులు ఆరోపించారు. డైరెక్టర్​ మైన్​ సేఫ్టీ అధికారులచే విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలన్నారు. మృతి చెందిన కార్మికుడి కుటుంబానికి న్యాయం చేయాలని.. గాయపడ్డ వారికి మెరుగైన వైద్యం అందించాలని కోరారు.  

ఇదీ చదవండి: సింగరేణి ఓబీలో బ్లాస్టింగ్.. నలుగురు కార్మికులు మృతి

Last Updated :Oct 29, 2020, 11:48 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.