ETV Bharat / jagte-raho

యువతిపై 139 మంది బలాత్కారం.. పంజాగుట్టలో ఫిర్యాదు!

author img

By

Published : Aug 22, 2020, 5:39 PM IST

Updated : Aug 22, 2020, 6:05 PM IST

బతుకుతెరువు కోసం భాగ్యనగరం వచ్చింది. కల్లబొల్లి మాటలతో ఒకడు వేసిన వలలో చిక్కింది. ఉద్యోగం ఇప్పిస్తానంటే నమ్మింది. అతనితోపాటు స్నేహితుల చేతిలో బలాత్కారానికి గురైంది. ఇలా ఒకరిద్దరు కాదు ఏకంగా 139 మంది తనపై అత్యాచారం చేశారని ఓ యువతి ఆరోపిస్తోంది. అందులో సినీనటులు, రాజకీయ పలుకుబడి కలిగిన వాళ్లూ ఉన్నారని పోలీసులకు ఫిర్యాదు చేసింది. సినిమాను తలపించే ఆ వ్యథ ఏంటంటే...

139-members-raped-a-women-in-hyderabad-dot-she-was-registered-complaint
యువతిపై 139 మంది బలాత్కారం.. పంజాగుట్టలో ఫిర్యాదు!

బతుకుతెరువు కోసం హైదరాబాద్‌ వచ్చిన తనను కొందరు భయపెట్టి.. బలాత్కరించారని.. తొమ్మిదేళ్లలో 139 మంది అత్యాచారానికి పాల్పడ్డారని నల్గొండ జిల్లాకు చెందిన బాధిత మహిళ ఆరోపిస్తోంది. శుక్రవారం హైదరాబాద్‌లోని పంజాగుట్ట పోలీసులను ఆశ్రయించింది. తనపై అఘాయిత్యానికి పాల్పడ్డ వారంతా చంపేస్తానంటూ బెదిరించడంతో ప్రాణభయంతో మౌనంగా ఉన్నానని, సోమాజిగూడలోని ఓ స్వచ్ఛంద సేవాసంస్థ సాయంతో ఫిర్యాదు చేస్తున్నానని పోలీసులకు వివరించింది.

చదువుకునేందుకు హైదరాబాద్‌కు వచ్చి..

తొమ్మిదేళ్ల క్రితం తనకు వివాహమైందని, ఏడాదికే విడాకులు తీసుకున్నానని పేర్కొంది. అనంతరం తాను చదువుకునేందుకు హైదరాబాద్‌కు వచ్చానని తెలిపింది. కొద్దిరోజుల తర్వాత ఓ వసతి గృహానికి వెళ్లగా.. అక్కడికి వచ్చిన సుమన్‌ అనే వ్యక్తి ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పడంతో అతని వద్దకు వెళ్లానని.. అక్కడ తనను బలాత్కారం చేశారని వాపోయింది. అప్పటి నుంచి అతనితోపాటు స్నేహితులు సామూహిక అత్యాచారం చేశారని తెలిపింది. తనపై అఘాయిత్యానికి పాల్పడిన వారిలో కొందరు సినీనటులు, మాజీ ప్రజాప్రతినిధి వ్యక్తిగత సహాయకుడు ఉన్నారని ఆరోపిస్తోంది.

నగ్నంగా నృత్యాలు..

తనను బెదిరించి నగ్నంగా నృత్యాలు చేయించారని, మద్యం తాగించారని, వీడియోలు తీశారని వాపోయింది. తనను ఈ రొంపిలోకి దించిన సుమన్‌ సెక్స్‌ రాకెట్‌ నిర్వహిస్తున్నాడని తెలిపింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పంజాగుట్ట పోలీసులు నిర్భయ చట్టంతో పాటు ఐపీసీ 376 సెక్షన్‌, ఎస్సీ, ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టాల ప్రకారం కేసులు నమోదు చేశారు. ఈమేరకు దర్యాప్తు చేపట్టామని పంజాగుట్ట ఇన్‌స్పెక్టర్‌ నిరంజన్‌రెడ్డి తెలిపారు.

ఇవీ చూడండి: పోలీస్​స్టేషన్​కు కూతవేటు దూరంలో దారుణం

Last Updated :Aug 22, 2020, 6:05 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.