ETV Bharat / international

యుద్ధభూమిలో శాంతిస్థాపనే ధ్యేయంగా చారిత్రక ఒప్పందం

author img

By

Published : Feb 29, 2020, 8:01 PM IST

Updated : Mar 2, 2020, 11:56 PM IST

దశాబ్దాలుగా కొనసాగుతున్న అఫ్గాన్​ అశాంతికి పరిష్కారం దిశగా అమెరికా, తాలిబన్లు ముందడుగు వేశాయి. దోహాలో చారిత్రక ఒప్పందంపై ఇరుపక్షాలు సంతకం చేశాయి. ఫలితంగా అఫ్గానిస్థాన్​ నుంచి అమెరికా, దాని సంకీర్ణ సేనలను ఉపసంహరించుకోనుంది.

DOHA ACCORD
దోహా ఒప్పందం

యుద్ధభూమిలో శాంతిస్థాపనే ధ్యేయంగా చారిత్రక ఒప్పందం

అమెరికా, తాలిబన్ల మధ్య చారిత్రక ఒప్పందం కుదిరింది. దోహా వేదికగా ఖతార్​ అధికారుల సమక్షంలో అమెరికా, తాలిబన్​ ప్రతినిధులు ఒప్పందంపై సంతకం చేశారు. అమెరికా విదేశాంగ మంత్రి మైక్​ పాంపియో ఈ ప్రక్రియను పర్యవేక్షించారు.

దీని ప్రకారం ఒప్పందానికి తాలిబన్లు కట్టుబడి ఉంటే అఫ్గానిస్థాన్​ నుంచి 14 నెలలలోపు అమెరికా తన సేనలను ఉపసంహరించుకుంటుంది. మార్చి 10 నుంచి శాంతి చర్చలు ప్రారంభమవుతాయి. ఈ సందర్భంగా తాలిబన్లకు పలు విజ్ఞప్తులు చేశారు పాంపియో.

"అమెరికా, తాలిబన్లు దశాబ్దాలుగా అనిశ్చితి, అపనమ్మకంతో ఉన్నాయి. గతంలో జరిగిన చర్చలు విఫలమయ్యాయి. శాంతి ప్రక్రియకు తాలిబన్లు ఆసక్తి చూపటం.. ఆల్​ఖైదాతో పాటు ఇతర ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు తెంచుకోవటానికి సిద్ధమయ్యాయి. మిలిటరీ చర్యతో శాంతి ఏర్పడదని వాళ్లు గుర్తించారు. మొదటగా మీ హామీలకు కట్టుబడి ఉండండి. ఆల్​ఖైదా, ఇతర ఉగ్రసంస్థలతో సంబంధాలు తెంచుకోండి. ఐసిస్​ను ఓడించేందుకు పోరాడుతూనే ఉండండి."

-మైక్ పాంపియో, అమెరికా విదేశాంగ మంత్రి

అంతకుముందు ఒప్పందానికి సంబంధించి అమెరికా, అఫ్గానిస్థాన్​ సంయుక్త ప్రకటన చేశాయి. దోహా ఒప్పందానికి తాలిబన్లు కట్టుబడి ఉంటేనే 14 నెలల్లోనే ఉపసంహరణ ప్రక్రియను పూర్తి చేస్తామని తెలిపాయి.

విడతల వారీగా..

ఒప్పందంపై సంతకం చేసిన 135 రోజుల్లోపు.. 8,600 బలగాలను తొలి విడతలో తగ్గిస్తామని వెల్లడించాయి. ఆ తర్వాత మిగతా సేనలను 14 నెలల్లోపు ఉపసంహరించుకుంటామని ఈ ప్రకటనలో తెలిపాయి.

ప్రభుత్వంతో చర్చలకు ఒప్పుకోవడం సహా పలు భద్రతా కట్టుబాట్లకు అంగీకరించనందుకు ప్రతిఫలంగా.. 18 ఏళ్లుగా అఫ్గానిస్థాన్‌లో మోహరించిన సైన్యాన్ని దశల వారీగా ఉపసంహరించడం ఈ దోహా ఒప్పందం ప్రధాన ఉద్దేశం.

Last Updated : Mar 2, 2020, 11:56 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.