ETV Bharat / international

హత్య కేసులో ట్రంప్​పై అరెస్ట్​ వారెంట్​

author img

By

Published : Jan 7, 2021, 5:56 PM IST

ఇరాన్​ జనరల్​ సులేమానీ హత్యతో సంబంధం ఉందంటూ.. ఇరాక్​లోని ఓ కోర్టు అమెరికా అధ్యక్షుడి ట్రంప్​పై అరెస్ట్​ వారెంట్​ జారీ చేసింది. నేరం రుజువైతే పరిణామాలు మరణశిక్షకు దారితీస్తాయి. అయితే ఇది అసాధ్యమే అయినప్పటికీ.. మరికొద్ది రోజుల్లో అధ్యక్ష పీఠాన్ని ట్రంప్​ వీడుతున్న తరుణంలో ఇరాక్​ కోర్టు ఈ హెచ్చరికలు చేయడం గమనార్హం.

arrest warrant against Trump
'మర్డర్​' అభియోగంతో ట్రంప్​పై అరెస్ట్​ వారెంట్​

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​పై ఇరాక్​లోని ఓ కోర్టు అరెస్ట్​ వారెంట్​ జారీ చేసింది. ఇరాన్​ రివల్యూషనరీ గార్డ్స్​(కుర్ద్​ ఫోర్స్​) జనరల్ ఖాసీం​ సులేమానీ హత్యతో ట్రంప్​కు సంబంధం ఉన్నట్టు అభియోగం మోపింది.

గతేడాది జనవరిలో అమెరికా సైన్యం జరిపిన డ్రోన్​ దాడిలో సులేమానీతో పాటు ఇరాక్​ కతైబ్​ హిజ్బుల్లా డిప్యూటీ కమాండర్​ అబు మహదీ అల్​ ముహందీస్​ హతమయ్యారు. ఆ తర్వాత అమెరికా-ఇరాక్​ మధ్య దౌత్య సంబంధాలు దెబ్బతిన్నాయి.

బాగ్దాద్​లో ఓ కోర్టు మోపిన నేరారోపణ రుజువైతే మరణశిక్షకు దారితీస్తుంది. అయితే ఇది సాధ్యమయ్యే పనికాకపోయినప్పటికీ.. అధ్యక్షుడిగా ట్రంప్​ చివరిల్లో ఇరాక్​​ ఈ హెచ్చరికలు చేయడం గమనార్హం.

ఈ వ్యవహారంపై దర్యాప్తు జరుగుతోందని, మహదీ అల్​ ముహందీస్​ కుటుంబసభ్యుల వాదనను విన్న అనంతరం అరెస్ట్​ వారెంట్​ జారీ చేయాలన్న నిర్ణయానికి వచ్చినట్టు ఇరాక్​​ సుప్రీంకోర్టు జ్యుడీషియల్​ కౌన్సిల్​ ఓ ప్రకటనలో తెలిపింది.

ఇదీ చూడండి:- జనవరి 20కి ముందే ట్రంప్​పై వేటు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.