ETV Bharat / international

Wagner Group New Chief : 'వాగ్నర్' కొత్త బాస్ పుతిన్​​?.. పత్రాలపై సంతకాలు చేయాలని కిరాయి సైన్యానికి ఆదేశాలు!

author img

By ETV Bharat Telugu Team

Published : Aug 27, 2023, 6:59 AM IST

Wagner Group New Chief : ప్రిగోజిన్‌ మృతి చెందడం వల్ల వాగ్నర్‌ గ్రూప్‌ను తన ఆధీనంలోకి తీసుకునేందుకు రష్యా అధ్యక్షుడు పుతిన్‌ సన్నాహాలు ముమ్మరం చేసినట్లు సమాచారం. రష్యాకు విధేయంగా ఉంటామని ప్రమాణ పత్రాలపై సంతకాలు చేయాలని వాగ్నర్‌ సైనికులను.. పుతిన్‌ ఆదేశించినట్లు తెలుస్తోంది.

Wagner Group New Chief
Wagner Group New Chief

Wagner Group New Chief : రష్యా అధ్యక్షుడు పుతిన్‌పై తిరుగుబాటుకు (Wagner Group Rebellion) తెరలేపిన కిరాయి సైన్యం వాగ్నర్‌ గ్రూప్‌ అధినేత యెవెగనీ ప్రిగోజిన్‌ విమాన ప్రమాదంలో మరణించడం చర్చనీయాంశంగా మారింది. అయితే ఆయన మృతిని క్రెమ్లిన్‌ ఇంకా ధ్రువీకరించాల్సి ఉంది. మృతదేహాల వైద్యపరీక్ష అనంతరమే ప్రకటన చేస్తామని తెలిపింది.

ఈ నేపథ్యంలోనే వాగ్నర్‌ గ్రూప్‌ను పూర్తిగా తన ఆధీనంలోకి తీసుకునేందుకు పుతిన్‌ సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఆ బృందానికి ఆదేశాలు జారీ చేసినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెలువరించాయి. రష్యాకు విధేయంగా ఉంటామని ప్రమాణ పత్రాలపై సంతకాలు చేయాలని వాగ్నర్‌ సైనికులను పుతిన్‌ ఆదేశించినట్లు తెలిపాయి. ఉక్రెయిన్‌లో రష్యా చేపట్టిన సైనికచర్యలో పాల్గొంటున్న ప్రైవేటు సైనికులందరూ ఈ ప్రమాణ పత్రాలపై సంతకాలు చేయాల్సిందేనని క్రెమ్లిన్ తమ వెబ్‌సైట్‌లో ప్రచురించినట్లు సదరు కథనాలు పేర్కొన్నాయి.

మరోవైపు విమాన ప్రమాద ఘటనపై పుతిన్‌ మృతుల కుటుంబాలకు సంతాపం ప్రకటించారు. ప్రిగోజిన్‌ తన జీవితంలో ఎన్నో తీవ్రమైన తప్పులు చేసినప్పటికీ ఎంతో ప్రతిభ కలిగిన వ్యక్తి అని అనుకున్న ఫలితాలు సాధించాడని పుతిన్ కొనియాడారు. ప్రిగోజిన్‌ మరణంతో వాగ్నర్‌ కిరాయి సైన్యం పగ్గాలు సిడాయ్‌ పేరుతో పిలిచే ఆండ్రీ ట్రోషేవ్‌ చేతికి వెళ్లవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. వాగ్నర్‌ అధినేత ప్రిగోజిన్‌ తిరుగుబాటు తర్వాత ఇకనుంచి ఆ గ్రూపు బాధ్యతలను ఆండ్రీ ట్రోషేవ్‌ చూసుకుంటారని పుతిన్‌ గతంలో ప్రకటించారు.

మాస్కో వైపు ముప్పు ఉందని హెచ్చరించా : బెలారస్ అధ్యక్షుడు
Prigozhin Lukashenko Relationship : ప్రిగోజిన్ మృతిపై బెలారస్​ అధ్యక్షుడు అలెగ్జాండర్ లుకషెంకో స్పందించారు. తన ప్రాణాలకు ముప్పు ఉందని.. అప్రమత్తంగా ఉండాలని ప్రిగోజిన్​ను హెచ్చిరించినట్లు తెలిపారు. అయినా ప్రిగోజిన్ ఆ హెచ్చరికలను తేలికగా తీసుకున్నారని అన్నారు. తర్వాత తన దగ్గరకు వచ్చినప్పుడు కూడా జాగ్రత్తగా ఉండమని చెప్పానని తెలిపారు. జూన్‌లో క్రెమ్లన్​పై ప్రిగోజిన్‌ తిరుగుబాటు (Prigozhin Mutiny) చేసి.. మాస్కోకు తన వాగ్నర్ దళాలను పంపినపుడు లుకషెంకోనే మధ్యవర్తిత్వం వహించారు. పుతిన్‌ను శాంతింపచేసి ప్రిగోజిన్‌ను (prigozhin deal with putin) వెనక్కి తగ్గేలా చేశారు. వాగ్నర్‌ గ్రూపు ప్రైవేటు సైనికులకు బెలారస్‌లో ఆశ్రయం కూడా కల్పించారు.

Prigozin Plane Crash : కాగా, బుధవారం (2023 ఆగస్టు 23) మాస్కో నుంచి సెయింట్‌పీటర్స్‌బర్గ్‌కు బయల్దేరిన విమానం కూలి ప్రిగోజిన్‌ సహా వాగ్నర్‌ గ్రూప్‌లో కీలక కమాండర్లు ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదం వెనుక పుతిన్‌ ఉన్నాడని తాను భావించడం లేదని బెలారస్‌ అధ్యక్షుడు చెప్పడం గమనార్హం. అయితే పుతిన్‌కు అత్యంత సన్నిహితుడిగా లుకషెంకోకు పేరుంది.

Prigozhin Death US Intelligence : 'ప్రిగోజిన్​ది ఉద్దేశపూర్వక హత్యే.. క్షిపణితో విమానం కూల్చివేత!'

తిరుగుబాటు తర్వాత ప్రిగోజిన్‌తో పుతిన్‌ భేటీ!.. డీల్​ అప్పుడే కుదిరిందా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.