ETV Bharat / international

డాన్‌బాస్‌పై రష్యా నిప్పుల వర్షం.. ఉపగ్రహ చిత్రాలే సాక్ష్యం!

author img

By

Published : Jun 8, 2022, 3:14 PM IST

Ukraine Crisis: ఉక్రెయిన్‌లోని డాన్​బాస్​ ప్రాంతంలో రష్యా సైనికులు బీభత్సం సృష్టిస్తున్నారు. తాజాగా మాక్సర్ సంస్థ విడుదల చేసిన ఉపగ్రహ చిత్రాలు ఆ విషయాన్ని తేటతెల్లం చేశాయి. శతఘ్ని గుండ్ల వర్షానికి ధ్వంసమైపోయిన భవనాలు, తూట్లు పడిన పొలాలు ఆ చిత్రాల్లో కనిపిస్తున్నాయి.

satellite-images-show-russian-artillery-damage
satellite-images-show-russian-artillery-damage

Ukraine Crisis: ఉక్రెయిన్‌లోని డాన్‌బాస్‌ ప్రాంతాన్ని రష్యా శతఘ్నులు తూట్లు పొడుస్తున్నాయి. తాజాగా విడుదలైన ఉపగ్రహ చిత్రాలు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. క్రెమ్లిన్‌ ముఖ్యంగా సివీరోదొనెట్స్క్‌ ప్రాంతంపై దృష్టిపెట్టింది. తాజాగా గత 24 గంటల్లో మాక్సర్‌ సంస్థ సమీకరించిన ఉపగ్రహ చిత్రాల్లో ఈ విషయం స్పష్టంగా కనిపిస్తోంది. శతఘ్ని గుండ్ల వర్షానికి ధ్వంసమైపోయిన భవనాలు, తూట్లు పడిన పొలాలు ఈ చిత్రాల్లో కనిపిస్తున్నాయి.

  • Satellite imagery from June 6, 2022 #Ukraine
    1.) Artillery explosions along Siverskyi Donets River & Bogorodichne (49.020, 37.512)
    2.) Fields peppered with hundreds of artillery craters (49.009, 37.308)
    3.) 40m diameter bomb crater in Dovhenke (49.022, 37.308) pic.twitter.com/IzWyHob5F0

    — Maxar Technologies (@Maxar) June 7, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">
  • Satellite imagery from June 6, 2022 #Ukraine
    1.) Field-deployed MRL w/ rocket pods oriented toward #Severodonetsk (49.054, 38.515)
    2.) Towed artillery deployed & oriented toward Severodonetsk (49.035, 38.521)
    3.) Artillery shells exploding around town of #Dolyna (48.997, 37.427) pic.twitter.com/JzfRPP3vcP

    — Maxar Technologies (@Maxar) June 7, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

సివీరోదొనెట్స్క్‌ ప్రాంతం పూర్తిగా పారిశ్రామిక నగరం. ఈ నగరాన్ని దక్కించుకొంటే దొనెట్స్క్‌లో కీలక నగరమైన క్రమటోర్క్స్‌కు చేరుకోవడానికి రష్యాకు మార్గం సుగమం అవుతుంది. ఇప్పటికే 70శాతం సివీరోదొనెట్స్క్‌ రష్యా ఆధీనంలోకి వెళ్లిపోయింది. ఈ నగరానికి 20 నిమిషాల ప్రయాణ దూరంలోని రుబిజ్నే కూడా రష్యా శతఘ్నుల దెబ్బకు ధ్వంసమవుతోంది. మరోపక్క రష్యా మల్టిపుల్‌ రాకెట్‌ లాంఛర్లను కూడా ఈ దాడలుకు వాడుతోంది. సివీరోదొనెట్స్క్‌లోని మైదాన ప్రాంతాల్లో ఈ లాంఛర్లను రష్యా మోహరించినట్లు తెలుస్తోంది.

ఇవీ చదవండి: అసహనం అనర్థదాయకం.. శాంతికి విఘాతం

కీవ్​లో 3 నెలల తర్వాత థియేటర్ రీఓపెన్​​.. తొలిరోజే హౌస్​ఫుల్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.