ETV Bharat / international

Prigozhin Death Confirm : 'చనిపోయింది ప్రిగోజినే'.. రష్యా అధికారిక ప్రకటన

author img

By ETV Bharat Telugu Team

Published : Aug 27, 2023, 5:16 PM IST

Updated : Aug 27, 2023, 5:52 PM IST

Prigozhin Death Confirm : రష్యాపై తిరుగుబావుటా ఎగురవేసిన ప్రైవేటు సైన్యం వాగ్నర్‌ గ్రూపు అధినేత యెవ్‌గెనీ ప్రిగోజిన్‌ విమాన ప్రమాదంలో మరణించారని విచారణ కమిటీ అధికారికంగా నిర్ధరించింది. ఫోరెన్సిక్‌ పరీక్షలన్నీ జరిపిన తర్వాత ప్రమాదంలో చనిపోయింది ప్రిగోజినే అని కమిటీ తేల్చింది.

Prigozhin Death Confirm
Prigozhin Death Confirm

Prigozhin Death Confirm : రష్యా ప్రైవేటు సైన్యం వాగ్నర్‌ గ్రూపు అధినేత యెవ్‌గెనీ ప్రిగోజిన్‌ విమాన ప్రమాదంలో మరణించారని రష్యా విచారణ కమిటి అధికారికంగా నిర్ధరించింది. ఫోరెన్సిక్‌ పరీక్షలన్నీ జరిపిన తర్వాత ప్రమాదంలో చనిపోయింది ప్రిగోజినే అని కమిటీ తేల్చింది. స్వాధీనం చేసుకున్న 10 మృతదేహాలకు ఫోరెన్సిక్‌ పరీక్షలు జరిపినట్లు వెల్లడించింది. కానీ విమానం ఎలా క్రాష్​ అయ్యింది అన్న విషయంపై ఎలాంటి ప్రకటన చేయలేదు. ఆ 10 మంది ప్రిగోజిన్‌కు నమ్మకస్తులైన అత్యున్నత స్థాయి లెఫ్టినెంట్లు అని ఇప్పటికే రష్యా పౌర విమానయాన శాఖ ప్రకటించింది.

Prigozin Plane Crash : ఆగస్టు 23 (బుధవారం) మాస్కో నుంచి సెయింట్‌పీటర్స్‌బర్గ్‌కు బయల్దేరిన విమానం కూలి ప్రిగోజిన్‌ సహా వాగ్నర్‌ గ్రూప్‌లో కీలక కమాండర్లు ప్రాణాలు కోల్పోయారు. ఇందులో ఏడుగురు ప్రయాణికులు సహా ముగ్గురు విమాన సిబ్బంది మరణించారు. కానీ, అగ్రదేశాల నాయకులు, పలు ఇంటెలిజెన్స్‌ సంస్థలు మాత్రం ప్రిగోజిన్‌ది హత్యేనని.. దీని వెనక పుతిన్‌ హస్తం ఉందని అంచనా వేస్తున్నాయి. ప్రిగోజిన్‌ను పక్కా ప్రణాళిక ప్రకారం హత్య చేసి.. ప్రమాదంలా చిత్రీకరిస్తున్నారని అమెరికా సహా చాలా దేశాలు అనుమానిస్తున్నాయి.

Prigozhin Death America Prediction : వాగ్నర్‌ గ్రూప్‌ బాస్‌ ప్రిగోజిన్‌ను హత్య చేశారని అమెరికా ఇంటెలిజెన్స్‌ అంచనా వేసింది. కూలిపోవడానికి ముందే విమానంలో భారీ పేలుడు జరిగి ఉంటుందని పేర్కొంది. క్షిపణిని ఉపయోగించి విమానాన్ని కూల్చేశారనే వాదనను అమెరికా నిఘా వర్గాలు కొట్టిపారేశాయి. విమానంలో పేలుడు వల్ల ప్రిగోజిన్‌ మరణించి ఉంటారని పెంటగాన్‌ ప్రతినిధి పాట్‌ రైడర్‌ అభిప్రాయపడ్డారు. ప్రిగోజిన్‌ది హత్యేనని వాగ్నర్‌ సంస్థకు చెందిన గ్రేజోన్‌ టెలిగ్రామ్‌ ఛానల్‌ కూడా వెల్లడించింది.

మాస్కో వైపు ముప్పు ఉందని హెచ్చరించా : బెలారస్ అధ్యక్షుడు
Prigozhin Lukashenko Relationship : ప్రిగోజిన్ మృతిపై బెలారస్​ అధ్యక్షుడు అలెగ్జాండర్ లుకషెంకో స్పందించారు. తన ప్రాణాలకు ముప్పు ఉందని.. అప్రమత్తంగా ఉండాలని ప్రిగోజిన్​ను ముందే హెచ్చరించినట్లు తెలిపారు. అయినా ప్రిగోజిన్ ఆ హెచ్చరికలను తేలికగా తీసుకున్నారని అన్నారు. తర్వాత తన దగ్గరకు వచ్చినప్పుడు కూడా జాగ్రత్తగా ఉండమని చెప్పానని తెలిపారు. జూన్‌లో క్రెమ్లన్​పై ప్రిగోజిన్‌ తిరుగుబాటు (Prigozhin Mutiny) చేసి.. మాస్కోకు తన వాగ్నర్ దళాలను పంపినపుడు లుకషెంకోనే మధ్యవర్తిత్వం వహించారు. పుతిన్‌ను శాంతింపచేసి ప్రిగోజిన్‌ను (prigozhin deal with putin) వెనక్కి తగ్గేలా చేశారు. వాగ్నర్‌ గ్రూపు ప్రైవేటు సైనికులకు బెలారస్‌లో ఆశ్రయం కూడా కల్పించారు.

Wagner Group New Chief : 'వాగ్నర్' కొత్త బాస్ పుతిన్​​?.. పత్రాలపై సంతకాలు చేయాలని కిరాయి సైన్యానికి ఆదేశాలు!

Prigozhin Death US Intelligence : 'ప్రిగోజిన్​ది ఉద్దేశపూర్వక హత్యే.. క్షిపణితో విమానం కూల్చివేత!'

Last Updated :Aug 27, 2023, 5:52 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.