ETV Bharat / international

'నేను మీకు పెద్ద ఫ్యాన్.. వచ్చే ఏడాది భారత్​కు టెస్లా!​'.. ప్రధాని మోదీతో మస్క్​

author img

By

Published : Jun 21, 2023, 7:06 AM IST

Updated : Jun 21, 2023, 11:25 AM IST

modi meets elon musk
modi meets elon musk

Modi Meets Elon Musk : అమెరికా పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ.. ట్విట్టర్ సీఈఓ ఎలాన్ మస్క్​ను కలిశారు. భారత్​లో పెట్టుబడులు పెట్టాలని ఆయన కోరారు. ప్రధాని మోదీకి తాను పెద్ద అభిమానినని అన్నారు మస్క్. వచ్చే ఏడాదిలో భారత్​లో పర్యటించేందుకు ప్లాన్ చేస్తున్నానని తెలిపారు.

Modi Meets Elon Musk : అమెరికా పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్​తో మంగళవారం (అమెరికా కాలమానం ప్రకారం) సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ.. భారత్​లో పెట్టుబడులు పెట్టమని ఎలాన్ మస్క్​ను కోరారు. తాను ప్రధాని మోదీ అభిమానినని అన్నారు ఎలాన్ మస్క్​. మోదీని కలవడం గౌరవంగా భావిస్తున్నానని చెప్పారు. ఆయన కొత్త కంపెనీలకు అండగా నిలుస్తారని మోదీపై ప్రశంసల వర్షం కురిపించారు. వచ్చే ఏడాది భారత్​లో పర్యటించేందుకు ప్లాన్ చేస్తున్నానని మస్క్ తెలిపారు.

"భారత్​లో పెట్టుబడులు పెట్టేవారిని ప్రధాని మోదీ ప్రోత్సహిస్తున్నారు. ట్విట్టర్‌ స్థానిక ప్రభుత్వాలు పెట్టే నిబంధనలు అనుసరించడం తప్ప వేరే మార్గం లేదు. లేదంటే సంస్థను మూసివేయాలి. ఏ దేశంలోనైనా ఆ దేశ చట్టాలకు అనుగుణంగానే ట్విట్టర్​ను నడపాలి. టెస్లా కంపెనీని భారత్​లో పెట్టే అవకాశం ఉంది. వీలైనంత త్వరగా ఆ దిశగా చర్యలు సాగిస్తాం. ప్రధాని మోదీకి భారత్​ పట్ల చాలా నిబద్ధత ఉంది. భారత్​లో పెట్టుబడులు పెట్టమని నన్ను ఆహ్వానించారు. ప్రధానితో చర్చలు అద్భుతంగా జరిగాయి"

--ఎలాన్ మస్క్, టెస్లా సీఈఓ

modi meets elon musk
ప్రధాని మోదీతో ఎలాన్ మస్క్
  • #WATCH | Tesla and SpaceX CEO Elon Musk, says "I can say he (PM Modi) really wants to do the right things for India. He wants to be open, he wants to be supportive of new companies and make sure it accrues to India's advantage... I'm tentatively planning to visit India again next… pic.twitter.com/7Et2nIX3ts

    — ANI (@ANI) June 20, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

భారత మార్కెట్‌లో ఉన్న అవకాశాలను అందిపుచ్చుకునేందుకు తాను ఆసక్తిగా ఉన్నట్లు ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మస్క్‌ అన్నారు. ఈ ఏడాది చివరి కల్లా ఫ్యాక్టరీని కూడా ఏర్పాటు చేసే యోచనలో ఉన్నట్లు వెల్లడించారు. అందుకోసం స్థలాన్ని వెతికే పనిలో ఉన్నామని చెప్పారు.

  • #WATCH | Tesla and SpaceX CEO Elon Musk, says "I'm incredibly excited about the future of India. India has more promise than any large country in the world. He (PM Modi) really cares about India as he's pushing us to make significant investments in India. I am a fan of Modi. It… pic.twitter.com/lfRNoUQy3R

    — ANI (@ANI) June 20, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

మరోవైపు.. ప్రొఫెసర్​ నికోలస్ తలేబ్​, రచయిచ రాబర్ట్ థుర్మన్​లతో ప్రధాని మోదీ భేటీ అయ్యారు. ఇరువురితో విడివిడిగా ద్వైపాక్షిక విడివిడిగా చర్చలు జరిపారు. ఈ సందర్భంగా తాను రచించిన 'స్కిన్ ఇన్ ది గేమ్' అనే బుక్​ను ప్రధాని మోదీకి ఇచ్చారు తలేబ్.

'భారత ప్రధాని మోదీతో సమావేశమయ్యాను. ప్రతికూల పరిస్థితుల నుంచి తిరిగి పుంజుకోవడం గురించి చర్చించాం. కొవిడ్​ సంక్షోభాన్ని భారత్ సమర్థవంతంగా ఎదుర్కొంది.' అని నికోలస్ తలేబ్ అన్నారు.

Modi America Tour : భారత కాలమానం ప్రకారం అమెరికాకు ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం ఉదయం బయలుదేరారు. మంగళవారం మధ్యాహ్నం (అమెరికా కాలమానం ప్రకారం) న్యూయార్క్‌కు చేరుకున్నారు. ఆయనకు అమెరికాలో.. భారత్‌ రాయబారి తరణ్‌జీత్‌సింగ్‌ సంధు, భారత్‌లో శాశ్వత ప్రతినిధి రుచిరా కాంబోజ్‌ స్వాగతం పలికారు. ప్రవాస భారతీయులు విమానాశ్రయానికి వచ్చి మోదీని స్వాగతించారు. మోదీని స్వాగతం పలికేందుకు వచ్చిన మినేశ్ పటేల్ అనే ప్రవాస భారతీయుడు ప్రధాని నరేంద్ర మోదీ బొమ్మ ఉన్న జాకెట్​ను ధరించారు.

అమెరికా పర్యటనపై ట్వీట్‌ చేసిన మోదీ.. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌, ప్రథమ మహిళ జిల్‌ బైడెన్‌ల ప్రత్యేక అధికారిక ఆహ్వానం రెండు ప్రజాస్వామ్య దేశాల మధ్య విలువైన బంధానికి సజీవ సాక్ష్యం అని పేర్కొన్నారు. బైడెన్‌తో పాటు ఇతర నేతలతో.. తాను జరిపే చర్చలు రెండు దేశాల మధ్య పరస్పర సహకారానికి.. దోహదం చేస్తుందని తెలిపారు. జీ-20, క్వాడ్‌, ఐపీఈఎఫ్‌వంటి వేదికలపైనా కలిసి పని చేయడానికి ఉపయోగపడతాయని మోదీ వెల్లడించారు.

Last Updated :Jun 21, 2023, 11:25 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.