ETV Bharat / international

సైనికుల వాహనాలపై కాల్పులు జరిపిన ఉగ్రవాదులు- 14 మంది మృతి

author img

By PTI

Published : Nov 3, 2023, 9:44 PM IST

Updated : Nov 3, 2023, 10:20 PM IST

Pakistan Soldiers Killed In Balochistan
Pakistan Soldiers Killed In Balochistan

21:41 November 03

సైనికుల వాహనాలపై కాల్పులు జరిపిన ఉగ్రవాదులు- 14 మంది మృతి

Pakistan Soldiers Killed In Balochistan : పాకిస్థాన్​లో భద్రతా బలగాలు ప్రయాణిస్తున్న రెండు వాహనాలపై ఉగ్రవాదులు దాడులకు పాల్పడ్డారు. ఈ దాడుల్లో 14 మంది పాకిస్థాన్ సైనికులు మరణించారు. బలూచిస్థాన్​ ప్రావిన్స్​లో శుక్రవారం జరిగిందీ దుర్ఘటన. పాక్ సైనికులు కాన్వాయ్ పస్ని నుంచి గ్వాదర్ జిల్లాకు వెళ్తుండగా ఉగ్రవాదులు దాడులకు పాల్పడ్డారని అధికారులు వెల్లడించారు. ఈ ఘటనకు కారణమైనవారిని వదిలిపెట్టబోమని ప్రకటించారు.

మరోవైపు సైనికులపై ఉగ్రవాదుల జరిపిన దాడిని బలూచిస్థాన్ అపద్దర్మ ముఖ్యమంత్రి అలీ మర్దాన్ ఖండించారు. ఈ దాడులకు కారణమైనవారిని పట్టుకుంటామని అన్నారు. మరణించిన సైనికుల కుటుంబాలకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు.

Explosion In Pakistan : పాకిస్థాన్ ఖైబర్​ పఖ్తుంఖ్వా ప్రావిన్సులోని డెరా ఇస్మాయిల్ ఖాన్ జిల్లాలో శుక్రవారం పేలుడు సంభవించింది. పొండా బజార్ ప్రాంతంలోని ట్యాంక్​ అడ్డా సమీపంలో జరిగిన ఈ ఘటనలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో 20 మంది గాయపడ్డారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న సహాయక సిబ్బంది, కేబీ బాంబ్​ డిస్పోజల్​ యూనిట్, పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఘటన ప్రాంతం సమీపంలోని అన్ని ఆస్పత్రుల్లో అత్యవరస స్థితి ప్రకటించారు. అయితే దుండగులు ఓ మోటార్​ బైక్​లో పేలుడు పరికరాన్ని అమర్చారని తెలుస్తోంది. దీంతోపాటు ఘటన స్థలంలో తుపాకుల కాల్పుల శబ్దాలు కూడా వినిపించినట్లు సమాచారం.

Suicide Blast In Pakistan : కొద్ది రోజుల క్రితం పాకిస్థాన్​లో జరిగిన ఆత్మాహుతి దాడికి 55 మంది బలయ్యారు. మరో 50 మందికి పైగా గాయపడ్డారు. బలూచిస్థాన్​ రాష్ట్రం మస్తుంగ్ జిల్లాలోని మదీనా మసీదు వద్ద ఈ పేలుడు జరిగింది. ఈ దాడిలో అక్కడే విధులు నిర్వర్తిస్తున్న డీఎస్​పీ నవాజ్​ గాష్కోరి మృతి చెందారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మహ్మద్ ప్రవక్త జయంతి (ఈద్ మిలాదున్ నబీ) సందర్భంగా ర్యాలీ నిర్వహించేందుకు స్థానికులంతా జిల్లాలోని మదీనా మసీదు దగ్గర గుమిగూడారు. ఈ క్రమంలో ఓ వ్యక్తి డీఎస్​పీ కారు దగ్గరగా వెళ్లి తనను తాను పేల్చుకున్నాడు. శక్తిమంతమైన బాంబు పేలుడు ధాటికి 55 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 50 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మెడికల్ ఎమర్జెన్సీ ప్రకటించి క్షతగాత్రులను ఆస్పత్రికి తరలిస్తున్నామని సిటీ పోలీస్​ స్టేషన్ ఎస్​హెచ్​ఓ మహ్మద్ జావెద్ లెహ్రీ తెలిపారు. గాయపడిన వారిలో కొంత మంది పరిస్థితి విషమంగా ఉందని జిల్లా వైద్యాధికారి రషీద్​ మహ్మద్​ సయీద్​ చెప్పారు.

Last Updated :Nov 3, 2023, 10:20 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.