ETV Bharat / international

నైజీరియాలో కాల్పుల కలకలం- 160 మంది మృతి, మరో 300మందికి గాయాలు

author img

By ETV Bharat Telugu Team

Published : Dec 26, 2023, 6:57 AM IST

Updated : Dec 26, 2023, 7:29 AM IST

Nigeria Gunmens Attack : నైజీరియాలో సాయుధ మూకలు జరిపిన కాల్పుల్లో 160 మంది మృతి చెందారు. ఈ మేరకు స్థానిక ప్రభుత్వం ఓ ప్రకటన విడుదల చేసింది.

Nigeria Gunmens Attack
Nigeria Gunmens Attack

Nigeria Gunmens Attack: మధ్య నైజీరియాలోని పలు గ్రామాల్లో సాయుధ మూకలు జరిపిన వరుస కాల్పులు 160మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ మేరకు స్థానిక ప్రభుత్వం ఓ ప్రకటనను విడుదల చేసింది. 'బండిట్స్‌'గా పిలిచే సైనిక గుంపులు కొన్ని తెగలకు చెందిన ప్రజలే లక్ష్యంగా గ్రామాలపై దాడి చేసి కాల్పులకు పాల్పడ్డాయి. ప్రజల ఇళ్లలోకి చొరబడి వారిని చిత్రహింసలు పెట్టాయి.

ఆదివారం సాయంత్రం మధ్య నైజీరియాలోని పలుగ్రామాల్లో జరిగిన కాల్పుల్లో మొదట 16 మంది మృతి చెందినట్లు వార్తలు వచ్చాయి. అయితే, ఈ మారణకాండ సోమవారం కూడా కొనసాగడం వల్ల మృతి చెందిన వారి సంఖ్య భారీగా పెరిగింది. మరో 300 మందికిపైగా ప్రజలు తీవ్రంగా గాయపడ్డారని ప్రభుత్వ అధికారులు తెలిపారు. గాయపడిన వారిని ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నట్లు పేర్కొన్నారు. కొన్నేళ్లుగా నైజీరియాలోని ఈ ప్రాంతాల్లో మతపరమైన, సామాజిక పరమైన విబేధాల వల్ల ఘర్షణలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా సాయుధ మూకలు కాల్పులకు తెగబడ్డాయి.

వాయవ్య, మధ్య నైజీరియాలో ఇలాంటి ఘటనలు తరచుగా జరుగుతుంటాయి. అటవీ ప్రాంతాల్లో స్థావరాలు ఏర్పాటు చేసుకున్న సంచార జాతులకు చెందిన కొన్ని సాయుధ మూకలు గ్రామాలపై దాడులు చేసి దోపిడీలకు పాల్పడుతుంటాయి. స్థానికుల్ని అపహరించి డబ్బులు ఇవ్వాలని డిమాండ్‌ చేస్తుంటాయి. 2009 నుంచి ఇప్పటి వరకు పలుమార్లు ఇలాంటి ఘటనలు జరగ్గా వేల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోయారు.

యూనివర్సిటీలో కాల్పులు- 15 మంది మృతి
నాలుగు రోజుల క్రితం చెక్‌రిపబ్లిక్‌ రాజధాని ప్రాగ్‌లో కాల్పుల ఘటన జరిగింది. జన్ పలాచ్ స్క్వేర్​లోని చార్లెస్‌ విశ్వవిద్యాలయంలో ఓ సాయుధుడు బీభత్సం సృష్టించారు. ఫిలాసఫీ విభాగం భవనంలో విచక్షణ రహితంగా కాల్పులు జరిపాడు. కాల్పుల్లో 15మంది మరణించగా, మరో 20మందికి గాయాలయ్యాయి. కాల్పుల సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని దుండగుడిని ముట్టబెట్టారు. బాధితులను సమీప ఆసుపత్రులకు తరలించారు. ఇందులో తొమ్మిది మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. యూనివర్సిటీ చుట్టుపక్కల ప్రాంతాలను పోలీసులు ఆధీనంలోకి తీసుకున్నారు. ఈ పూర్తి వార్తను చదవడానికి ఈ లింక్​ పై క్లిక్ చేయండి.

అమెరికాలో మళ్లీ కాల్పులు.. నలుగురు మృతి.. నిందితుడిని పట్టిస్తే 10వేల డాలర్ల రివార్డ్!

US Shooting Today : అమెరికాలో కాల్పుల కలకలం.. 18 మందిని చంపి 'నరహంతకుడు' పరార్​

Last Updated : Dec 26, 2023, 7:29 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.