ETV Bharat / international

పుతిన్‌ ప్రత్యర్థి నవానీ జైలు నుంచి మిస్సింగ్​! ఆరు రోజులుగా తెలియని జాడ

author img

By ETV Bharat Telugu Team

Published : Dec 12, 2023, 2:33 PM IST

Navalny Russia Missing : రష్యా అధ్యక్షుడు పుతిన్‌ విధానాలను తీవ్రస్థాయిలో విమర్శించే నాయకుడు అలెక్సీ నవానీ జైలు నుంచి అదృశ్యమయ్యారు. తాము ఆయన్ను సంప్రదించలేకపోతున్నామని, ఆయన జాడపై ఎలాంటి సమాచారం అందుబాటులో లేదని నవానీ న్యాయవాదులు తెలిపారు. వచ్చే ఏడాది రష్యాలో అధ్యక్ష ఎన్నికలు జరిపేందుకు రంగం సిద్ధమైన తరుణంలో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. తాజా పరిణామాలపై అమెరికా తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.

navalny russia missing
navalny russia missing

Navalny Russia Missing : రష్యా అధ్యక్షుడు పుతిన్‌ను విమర్శించే చట్ట సభ సభ్యుల అనుమానాస్పద మరణాలు గతంలో పలుమార్లు జరిగాయి. ఈ నేపథ్యంలోనే పుతిన్‌ పాలనపై తీవ్ర విమర్శలు చేసే అవినీతి వ్యతిరేక ఫౌండేషన్‌ వ్యవస్థాపకుడు, విపక్ష నేత అలెక్సీ నవానీ జైలు నుంచి కనిపించకుండా పోయినట్లు సమాచారం. ఈ ఏడాది ఆగస్టులో నవానీకి 19 ఏళ్ల జైలు శిక్ష పడింది. ఫౌండేషన్‌ కార్యకలాపాల విషయంలో జైలు శిక్ష పడిన నవానీని మాస్కోకు 150 మైళ్ల దూరంలో ఉన్న పీనల్ కాలనీ జైలులో ఉంచారు.

ఆరు రోజులుగా తెలియని నవానీ జాడ
Navalny Russian Opposition Leader : నవానీని సంప్రదించాలని ప్రయత్నించగా తమకు జైలు నుంచి ఎలాంటి స్పందన రాలేదని ఆయన న్యాయవాదులు సోషల్‌ మీడియా వేదికగా వెల్లడించారు. ఆరు రోజులుగా ఆయన జాడ తెలియడం లేదని పేర్కొన్నారు. సోమవారం నవానీ వర్చువల్‌గా కోర్టులో హాజరుకావాల్సి ఉంది. జైలులో విద్యుత్ సమస్య వల్ల ఆయన్ను హాజరుపర్చలేమని అధికారులు తెలిపారు. నవానీ మిస్సింగ్‌పై అమెరికా ఆందోళన వ్యక్తం చేసింది. రష్యాలోని దౌత్యకార్యాలయం ద్వారా మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తామని అమెరికా జాతీయ భద్రతా మండలి ప్రతినిధి జాన్‌ కిర్బీ వెల్లడించారు.

పుతిన్​పై పోటీ చేసి వెలుగులోకి నవానీ
Navalny Russia Documentary : రష్యా ఆఫ్ ది ఫ్యూచర్ పార్టీ నేత అయిన నవానీ ప్రభుత్వ ఉన్నతాధికారుల అవినీతిని బయటపెట్టారు. క్రెమ్లిన్‌కు వ్యతిరేకంగా నిరసనలు చేశారు. అధ్యక్ష ఎన్నికల్లో పుతిన్‌పై పోటీ చేయడం వల్ల దేశవ్యాప్తంగా ఆయనకు ఆదరణ లభించింది. గతంలో పలుమార్లు జైలుకు వెళ్లి వచ్చారు. ఈ క్రమంలో ఆయనపై విష ప్రయోగం జరిగింది. 5 నెలలపాటు జర్మనీలో చికిత్స పొందారు. పుతిన్‌పై పోరాటం ఆపేది లేదంటూ 2021 జనవరిలో తిరిగి రష్యాకు చేరుకున్న ఆయన్ను పోలీసులు విమానాశ్రయంలోనే అరెస్టు చేశారు. ఈ క్రమంలో 19 ఏళ్ల జైలు శిక్షపడింది. ఆయన జీవితం ఆధారంగా తెరకెక్కిన నవానీ డాక్యుమెంటరీకి ఆస్కార్ దక్కింది.

పుతిన్‌ విమర్శకుడికి 19 ఏళ్ల జైలు శిక్ష.. సాక్ష్యాలు లేకుండానే 10 నిమిషాల్లో తీర్పు

నావల్నీ ఆరోగ్యం విషమం- ఆసుపత్రికి తరలింపు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.