ETV Bharat / international

14ఏళ్లుగా ఎయిర్​పోర్టే అతడి నివాసం.. ఇంట్లో భార్య ఆ పని చేయనివ్వడం లేదని...

author img

By

Published : Mar 30, 2022, 2:25 PM IST

అతడికి భార్య, పిల్లలు ఉన్నారు. సాదాసీదా జీవితం సాగించేందుకు సరిపడా ఆదాయ మార్గమూ ఉంది. కానీ.. అతడు మాత్రం కుటుంబాన్ని వదిలి వచ్చేశాడు. విమానాశ్రయాన్నే తన ఇంటిగా చేసుకున్నాడు. అలా ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా 14ఏళ్లుగా ఎయిర్​పోర్ట్​లో ప్రయాణికుడిలానే బతికేస్తున్నాడు. ఎవరతడు? ఎందుకు ఇదంతా?

Man Has Been Living in Airport for 14 Years
14ఏళ్లుగా ఎయిర్​పోర్టే అతడి ఇల్లు.. భార్య నుంచి 'స్వేచ్ఛ' కోసమని..!

Man Living in Airport: 'ద టెర్మినల్'.. సినిమా చూశారా? దర్శక దిగ్గజం స్టీవెన్ స్పీల్​బెర్గ్ దర్శకత్వంలో ప్రఖ్యాత నటుడు టామ్ హ్యాంక్స్​ హీరోగా 2004లో వచ్చిన హాలీవుడ్ చిత్రమది. స్వదేశంలో రాజకీయ సంక్షోభం తలెత్తి, పాస్​పోర్ట్ చెల్లకుండా పోయి, 18 ఏళ్లపాటు పారిస్ విమానాశ్రయంలో చిక్కుకుపోయిన ఓ వ్యక్తి జీవిత కథ స్ఫూర్తిగా తీసిన సినిమా. ఇప్పుడు మీరు చదవబోయేది అలాంటి కథే. కానీ.. ఇక్కడ 'హీరో' 14ఏళ్లుగా ఎయిర్​పోర్ట్​లో ఉంటున్నాడు. అందుకు కారణం రాజకీయ సంక్షోభం కాదు.. 'ఇంటి పోరు'.

Man Has Been Living in Airport for 14 Years
14ఏళ్లుగా ఎయిర్​పోర్టే అతడి ఇల్లు.. భార్య నుంచి 'స్వేచ్ఛ' కోసమని..!

విమానాశ్రయమే ఇల్లు: చైనా బీజింగ్​కు చెందిన వీ జియాంగువో వయసు ఇప్పుడు దాదాపు 60 సంవత్సరాలు. ఒకప్పుడు వాంగ్​జింగ్​లోని తన సొంత ఇంట్లో కుటుంబసభ్యులు అందరితో కలిసి సాధారణ మధ్యతరగతి వ్యక్తిలా జీవించేవాడు. 40+ ఏళ్ల వయసులో ఉద్యోగం కోల్పోయాడు. ఆ నైరాశ్యంలో తాగడం మొదలుపెట్టాడు. కొన్నాళ్లకు మద్యం, సిగరెట్లకు బానిసైపోయాడు. తన భార్యకు, ఇతర కుటుంబసభ్యులకు ఇది ఏమాత్రం నచ్చలేదు. దుర్వ్యసనాలకు దూరంగా ఉండాలని వారు పదేపదే జియాంగువోకు చెప్పేవారు. చివరకు వారికి ఓపిక నశించింది. ఇంట్లో ఉండాలంటే మందు, సిగరెట్ మానేయాల్సిందేనని తెగేసి చెప్పారు.

Man Has Been Living in Airport for 14 Years
14ఏళ్లుగా ఎయిర్​పోర్టే అతడి ఇల్లు.. భార్య నుంచి 'స్వేచ్ఛ' కోసమని..!

China Man Airport: ఆ రెండు అలవాట్లు మానే ఆలోచన జియాంగువోకు ఏమాత్రం లేదు. అందుకే తన మకాం మార్చేశాడు. సూట్ కేసు సర్దుకుని బీజింగ్ విమానాశ్రయానికి షిఫ్ట్ అయిపోయాడు. "నేను ఇంటికి వెళ్లాలంటే ఇప్పుడైనా వెళ్లగలను. కానీ వెళ్లను. ఎందుకంటే అక్కడ స్వేచ్ఛ లేదు. నేను ఇంట్లోనే ఉండాలంటే నాకు వచ్చే పింఛను(1000 యువాన్లు అంటే దాదాపు రూ.12వేలు) మొత్తాన్ని వారికి ఇచ్చేయాలంట. అలా చేస్తే మందు, సిగరెట్లను నేను ఎలా కొనుక్కోగలను?" అని అంటున్నాడు జియాంగువో.

Man Has Been Living in Airport for 14 Years
14ఏళ్లుగా ఎయిర్​పోర్టే అతడి ఇల్లు.. భార్య నుంచి 'స్వేచ్ఛ' కోసమని..!

ఒక కుక్కర్​.. రెండు సూట్​కేస్​లు: అధునాతన వసతులు ఉన్న బీజింగ్​ ఎయిర్​పోర్ట్ టెర్మినల్స్​లోనే తిరుగుతూ గడిపేస్తుంటాడు జియాంగువో. మొబైల్ కిచెన్ సామగ్రి, దుప్పట్లు, దుస్తుల్ని ఓ రెండు సూట్​కేసుల్లో పెట్టుకుంటాడు. ఒక చిన్న ఎలక్ట్రిక్ కుక్కర్ సాయంతో అక్కడే వంట చేసుకుని తింటాడు. అప్పుడప్పుడు ఎయిర్​పోర్ట్​లోని రెస్టారెంట్లలో భోజనం చేస్తాడు. మరీ బోర్ కొడితే.. విమానాశ్రయం బయటకు వెళ్లి.. కావాల్సినవి కొనుక్కుని తిరిగి వచ్చేస్తాడు. జియాంగువోను ఎయిర్​పోర్ట్ నుంచి పంపించేందుకు అక్కడి భద్రతా సిబ్బంది చాలాసార్లు ప్రయత్నించారు. పోలీసుల సాయంతో అతడి ఇంటి వద్ద విడిచిపెట్టారు. కానీ.. వెంటనే తిరిగి వచ్చేసేవాడు జియాంగువో.

Man Has Been Living in Airport for 14 Years
14ఏళ్లుగా ఎయిర్​పోర్టే అతడి ఇల్లు.. భార్య నుంచి 'స్వేచ్ఛ' కోసమని..!

ఇదీ చదవండి: ఉక్రెయిన్‌ శాంతిచర్చల్లో కుట్ర కోణం.. 'మిస్టర్‌ ఎ'పై విషప్రయోగం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.