ETV Bharat / international

16వేల అడుగుల ఎత్తులోని ఫ్లైట్​ నుంచి కిందపడ్డ ఐఫోన్​- అయినా వర్కింగ్​!

author img

By ETV Bharat Telugu Team

Published : Jan 8, 2024, 1:02 PM IST

IPhone Fall From Flight : 16వేల అడుగుల ఎత్తు నుంచి కిందపడిన ఓ ఫోన్​ అద్భుతంగా పనిచేస్తుంది. ఇటీవల గగనతలంలో డోర్​ అకస్మాత్తుగా డోర్ తెరుచుకున్న విమానంలో నుంచి కిందపడిన ఈ ఫోన్​ సగం ఛార్జింగ్​తో పని చేస్తూ రోడ్డు పక్కన దొరికింది. ఓ వ్యక్తికి రోడ్డు పక్కన లభించగా అతడు సోషల్​ మీడియాలో పెట్టడం వల్ల ఈ విషయం బయటపడింది.

iPhone fall from flight
iPhone fall from flight

IPhone Fall From Flight : సాధారణంగా మన చేతుల నుంచి కింద పడిపోతేనే కొన్ని ఫోన్లు పగిలిపోయి పని చేయకుండా పోతాయి. అలాంటిది సుమారు 16వేల అడుగుల ఎత్తు నుంచి కిందపడిపోయింది ఓ ఫోన్​. ఇంకేముంటుంది అని ఫోన్​పై ఆశలు వదిలేసుకుంటారు. కానీ అంత ఎత్తు నుంచి పడిపోయిన ఈ ఫోన్​ మాత్రం సగం బ్యాటరీ ఛార్జింగ్​తో అద్భుతంగా పనిచేస్తుంది. ఇటీవల ఎమెర్జెన్సీ ల్యాండింగ్​ అయిన అలస్కా ఎయిర్​లైన్స్ విమానం నుంచి పడిపోయిన ఫోన్ పనిచేస్తూనే దొరికింది. ఓ వ్యక్తి ఎక్స్​లో పోస్ట్ చేయగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది.

"రోడ్డు పక్కన వెళ్తుండగా నాకు ఓ ఐఫోన్​ దొరికింది. ఇప్పటికీ ఫోన్​ సగం బ్యాటరీ ఛార్జింగ్​తో ఎయిర్​ప్లేన్​ మోడ్​లోనే ఉండి పనిచేస్తుంది. అలస్కా ఎయిర్​లైన్స్ నుంచి కిందపడిపోయిన ప్రయాణికుడి ఫోన్​ అయ్యి ఉంటుంది. విమానం నుంచి పడిపోయిన రెండో ఫోన్​ దొరికింది. కానీ ఊడిపోయిన ఆ డోర్​ మాత్రం ఇప్పటికి లభించలేదు." అని సీనాథన్​ బేట్స్​ అనే నెటిజన్​ ఎక్స్​లో పోస్ట్ చేశాడు. అలస్కా ఎయిర్​లైన్స్​ బ్యాగేజ్ క్లెయిమ్​కు సంబంధించిన వివరాలు ఆ ఫోన్​లో ఉండడాన్ని ప్రస్తావిస్తూ ఐఫోన్​ ఫొటోలను సోషల్​ మీడియాలో షేర్ చేశాడు బేట్స్​. అయితే, ఇది ఏ మోడల్​ ఫోన్ అనే విషయం మాత్రం గుర్తించడం కష్టంగా మారింది. ప్రాథమికంగా ఐఫోన్​ 12 ప్రో లేదా ఐఫోన్​ 13 ప్రోగా భావిస్తున్నారు. హార్డ్​ కేసు ఉండడం వల్ల ఫోన్​ పగిలిపోకుండా ఉందని అనుకుంటున్నారు.

  • Found an iPhone on the side of the road... Still in airplane mode with half a battery and open to a baggage claim for #AlaskaAirlines ASA1282 Survived a 16,000 foot drop perfectly in tact!

    When I called it in, Zoe at @NTSB said it was the SECOND phone to be found. No door yet😅 pic.twitter.com/CObMikpuFd

    — Seanathan Bates (@SeanSafyre) January 7, 2024 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఇదీ జరిగింది
జనవరి 5న అమెరికాలోని పోర్ట్‌లాండ్‌ నుంచి ఒంటారియోకు బయలుదేరిన బోయింగ్ 737-9 మ్యాక్స్​ విమానం టేకాఫ్ అయిన వెంటనే దాని డోర్ ఊడిపడిపోయింది. దాంతో టేకాఫ్ అయిన చోటే అత్యవసరంగా దిగింది. 16 వేల అడుగుల ఎత్తులో ఈ ఘటన జరగడం వల్ల ప్రయాణికులు ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యారు. విమానంలోని పలువురి ప్రయాణికులకు సంబంధించిన ఫోన్లు సహా ఇతర వస్తువులు కిందపడిపోయాయి. విమానంలోని 174 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బంది సుక్షితంగా బయటపడటం వల్ల అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. దీనిపై అలస్కా ఎయిర్​లైన్స్​తో పాటు యూఎస్‌ నేషనల్‌ ట్రాన్స్‌పోర్టేషన్‌ సేఫ్టీ బోర్డ్‌(ఎన్‌టీఎస్‌బీ) కూడా దర్యాప్తు ప్రారంభించినట్లు తెలిపింది.

మరోవైపు, డోర్‌ ఊడిపోయిన ఘటనతో అలస్కా ఎయిర్‌లైన్స్‌ తమ వద్ద ఉన్న బోయింగ్‌ 737-9 విమాన సర్వీసులను నిలిపివేసింది. దీంతో సంస్థలోని ఈ మోడల్‌కు చెందిన 65 విమానాలు ఎయిర్‌పోర్టులకే పరిమితమయ్యాయి. ముందు జాగ్రత్త చర్యలు చేపట్టడం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎయిర్‌లైన్స్‌ CEO బెన్ మినికుచ్చి ప్రకటించారు. ప్రతి ఒక్క విమానాన్ని పూర్తిస్థాయిలో పరిశీలించి, భద్రతా ప్రమాణాలపై అధ్యయనం చేయిస్తామని తెలిపారు. మరోవైపు, బోయింగ్‌ సంస్థ కూడా విమాన డోర్‌ ఊడిపోయిన ఘటనపై స్పందించింది. ఇందుకు సంబంధించిన సమాచారం సేకరిస్తున్నామని, ఈ ఘటనలో దర్యాప్తునకు పూర్తిగా సహరిస్తామని తెలిపింది.

విమానం డోర్​ ఊడిన ఘటన- DGCA అలర్ట్- ఎమర్జెన్సీ డోర్​లు తనిఖీ చేయాలని ఆదేశాలు!

గాల్లో ఊడిపోయిన విమానం డోర్​- ప్రయాణికులంతా హడల్​- ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.